డైలీ సీరియల్

శ్రీకృష్ణ రమ్య రామాయణం( రెండవ భాగం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూలతోడ పూజించెను
మీ వలెనే ఒకరిపూజ
మరియొకరికి నచ్చదాయె
ఒకరు చేయు అ
మరియొక్కరు మెచ్చరాయె
చివరికి ఒక శుభదినాన
ఆ మువ్వురు కలిసికొనిరి

వైరమ్మున పోరాడిరి
మృత్యువు ఒడిజేరిరి
అపుడంతట ఆ శివుండు
వారికి ప్రత్యక్షమగుచు
వారికి నిడి మోక్షమ్మును
వారినిగటాక్షించెను

నాటి నుండి అది శ్రీ
కాళహస్తి క్షేత్రమంచు
పిలువబడెను అందరతో
కొలువబడెను భక్తులతో
ఆ కద విన్నారంతా
ఆనందము నందిరంత

‘‘ఇంతకు మీ పాదరక్ష
లేమైనవి ? ఎటనున్నవి ?
ఎచట జారవిడిచినారు ?’’
ఎటుల మరచిపోయినారు ?
తారలు చంద్రునితోడను
అడిగినట్లు వారడిగిరి
తమనాథుని
శ్రీనాథుని

‘‘అదిగో ! ఆ చెట్టుక్రింద’’
నంచు చూపెనాతడు
వారలంత పాదుకలను
చూచిరి పాదపము క్రింద
వెలుగులీను చుండెనవి
చంద్రునివలె చెట్టుక్రింద
‘‘నే తెచ్చెద ! నే తెచ్చెద !’’
నంచు వారు పరుగులిడిరి

వారలంత పోటీపడి
పరుగెత్తిరి వానికొరకు
‘‘పాదపమని ! పాదుకలని’’ !
‘‘నేనంటే ! నేనని’’ !
ఆ వెలుగుల నావృక్షము
వెలిగె పాలపుంత వోలె
అచ్చెరువను అచ్చెరువున
మునకలిడిరి ముదితలంత

ఇది ఏమిటి విడ్డూరం ?
పాదుకలిటు వెలుగుట ?
ఇవి కృష్ణుని పాదుకలో ?
లేక సూర్యకిరణాలో ?

ఇంకా ఉంది

- గన్ను కృష్ణమూర్తి, 9247227087