డైలీ సీరియల్

శ్రీకృష్ణ రమ్య రామాయణం( రెండవ భాగం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘పీడా విరగడైపోయింది’’
‘‘అవును. మేము కిట్టయ్యను యింటికి తీసుకెళ్ళి, స్నానాలు చేయించి, దిష్టితీయించి, పార్వతీ పరమేశ్వరుల గుడికి తీసుకెళ్ళి, పూజలు చేయించా!’’.
‘‘చాలా మంచిపని చేశారు ! ... కానీ, యిప్పుడు ఏ పూజా చేయడం లేదు నీ కొడుకు ! ... ఆయన పూజలు మేమే చేస్తున్నాం !’’ అందొక పడతి.
‘‘బుద్ధిమంతులు తల్లీ ! ... అని
వాళ్ళంతా చేతులు జోడ్చి నమస్కరించారు.
‘‘ఇంకా, ఏం చేశారు వీరు ?’’
‘‘అమ్మో!... ఏం చెప్పను తల్లీ ! ... ఒకటా రెండా ? ...
ఎన్ని వింతలు, విడ్డూరాలు చేశాడో వీడు ! ... కృష్ణపరమాత్మ ! ... అన్నీ కృష్ణలీలలే తల్లీ !’’ ...
‘‘మరొకటి చెప్పండి అత్తమ్మా !’’
ఆ పిలుపుతో ఆమె పరవశించింది.
‘‘ఎంత పుణ్యం చేసుకొని పుట్టానో తల్లీ ! నాకు దేవుడంటి కొడుకు! ... దేవతల్లాంటి కోడళ్ళు ! ...’’ అంది ఆనంద పారవశ్యంతో.
వాళ్ళంతా ఆనందించారు.
‘‘ఇంకొకటి చెప్తా తల్లీ!... ఆ సంఘటన నా కళ్ళముందే కదలాడు తోంది!’’
‘‘ఏమిటండీ అది ?’’
‘‘ఓరోజు వీడో కొండ పైకెక్కి, శిఖరమీద కూచున్నాడు. ఆశాకమంత కొండ ! ... ఆ కొండ శిఖరంపై పిల్లంగోవిలా వీడు ! ... సూర్యునిలా మెరిసి పోతున్నాడు పట్టుబట్టల్లో !’’...
‘‘అలాగా’’
‘‘అవును. కొండదిగమంటే దిగడువీడు ! ... నేనా ముసల్దాన్ని. మా ఆయన యింకా ముసిలోడు. మేం ఎక్కానూలేం ! ... వీడు దిగిరానూ రాడు ! ... ఆరోజు పేద్ద పండగ. ఊరికి ఊరంతా కదిలివొచ్చింది, ఆ కొండను పూజించడానికి. వీడా పూజని ఆపమంటాడు !
ననే్న పూజించమంటాడు ! ... ఎంత చెప్పినా వినడు ! ... ఏవేవో కతలు చెప్పాడు. తానే దేవుణ్ణని నమ్మించాడు’’.
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087