డైలీ సీరియల్

ఆలోచనకు తగ్గట్టే రూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ విధంగా జరిగే యుద్ధంలో అర్జునుడు పట్టుదలను వీడక చేస్తున్న ఆతని యుద్ధాన్ని చూచి శివుడు బ్రహ్మ-విష్ణ్వాది దేవతలు సేవిస్తుండగా ఎడమ భాగాన పార్వతిని ధరించి, గజ చర్మాంబరధారుడై- చంద్రరేఖాధరుడై, సర్పభూషణుడై- మన్మథుని తెల్లని భస్మాన్ని దాల్చిన వాడై, లోకమంతట వ్యాపించి ధవళకాంతులతో ప్రకాశించువాడై, వృషభవాహనా రూఢుడై దివ్యతేజస్సుతో ప్రత్యక్షమయ్యాడు.
‘దేవా! నా అజ్ఞాన పరిమితమైన అపరాధాన్ని క్షమించు. శత్రుసంహారార్థంగా మహాకాంతుల్ని వర్షింపజేసే ప్రళయ కాలమేఘమైన పాశుపత మంత్రరాజాన్ని నాకు అనుగ్రహించు. భక్తుల దురాశాపాశాల్ని ఖండించువాడా! దయావీక్షణ ! ఇది గాక ముక్తికాంత భర్తృత్వాన్ని దయతో ప్రసాదించు’ అని అర్థించాడు. ఆ అభ్యర్థన విని నీలకంఠుడు ‘అర్జునా! పాశుపతాస్త్రాన్ని నీకు అనుగ్రహిస్తాను. శత్రువుల్ని గెలువుము. కాని మోక్షసామ్రాజ్య సౌఖ్యాన్ని మాత్రం ఈ జన్మలో పొందలేవు. ఎందుకంటే రాజ్యంకోసం బంధుసంహారాన్ని నీవు సంకల్పించి యుద్ధానికి పూనుకొన్నావు. కాబట్టి కలియుగంలో వేటగాడివై పుట్టి వేటకు అడవులకు పోయి ఒకచోట దివ్యమైన నా లింగరూపాన్ని చూచి నిస్సందేహుడవై దేహాత్మ భ్రాంతిని విడిచి ననే్న సేవించి మోక్షవాంఛితాన్ని పొందుతావు’. అని పలికి అనుగ్రహించి అంతర్ధానం చెందాడు. ఆ విధంగా అర్జునుడు తిన్నడిగా జన్మించి మోక్షాన్ని పొందాడు.
అని తిన్నని కథా వృత్తాంతమంతా మాయాజంగమా కారుడైన జగత్పతి మహేశ్వరుడు వీర నృసింహయాదవ భూపాలునికి అనుగ్రహించి చెప్పి ‘నీవు ధన్యుడవవుతావు. నీవు ఆ మహాదేవునకు మహాలయాన్ని నిర్మించు’ అని చెప్పి అంతర్ధానమయ్యాడు. అంతట యాదవనృసింహ భూపాలుడు చాల ఆశ్చర్యపడి ఈ వేశ్య ఎంత కృతార్థురాలు. సాక్షాదీశ్వరుని పొందునే పొందింది. తనకు దేవాలయాన్ని నిర్మించమని నాకాజ్ఞ ఇచ్చాడు. నేనెంత ధన్యాత్ముణ్ణి. నాజన్మ ఎంత ధన్యమైనది. ఈ పట్టణమంతా కృతార్థత చెందింది. నా భాగ్యమే మని చెప్పగలను? అని యాదవరాజు అత్యంత సంతోషిత మనస్కుడై తనచే శిక్షింపబడిన వేశ్యాంగనను ఆదరించాడు. అశ్వపాలకుడు జీనును కట్టి గుఱ్ఱాన్ని సిద్ధంచేయగా లేడివలె వేగంగా పరుగిడ గల గుఱ్ఱాన్ని ఎక్కి కాళహస్తినగరానికి వచ్చి ఆనందాతిరేకంతో సువర్ణముఖీ నదిలో స్నానం చేసాడు. తదనంతరం మదనాంతకుడూ, హిమగిరి తనయవిభుడూ, దక్షిణ కైలాసగిరి విహారసదానందుడూ, మేరుపర్వతమే విల్లుగా కలవాడూ, విష్ణువు బాణంగా వహించినవాడూ, త్రిపురాసుర సంహారి పృథివి- జల- తేజో- వాయు- రాకాశాలనే పంచ భూతాలు - సూర్య చంద్రులు, యజమానుడు అనే అష్టమూ ర్తులతో ప్రకాశించే వాడూ అయిన పరమేశ్వరుని, హిమ గిరి తనయను, పరివార దేవ తల్ని యాదవరాజు యథా విధిగా అర్చించాడు. తదుపరి ఆ యాదవరాజు దక్షిణకైలాసానికి సువర్ణముఖరీనదికి మధ్య ప్రదేశంలో శ్రీకాళహస్తీశ్వరు న కు చుట్టు నీళ్లు పడేవరకు, రాళ్లు తగిలే వరకు తవ్వించి ఆ పునాదినుండి బెల్లపురసంతో కలిపిన సున్నంతో ఇటుకల్ని - శిలల్ని కదలకుండగ బంధించి, పార్వతి - వినాయకుడు - చండీశ్వరుడు- భైరవస్వామి- కుమారస్వామి గుళ్లను, ప్రాకారాలను అందంగా గోపురాలతో దేవాలయాల్ని కట్టించి శంకరుని కరుణతో రాజ్యపాలన చేయసాగాడు
ఆశ్వాసాంత పద్యాలు
నీవారమనే పేరు గల వరిధాన్యపు గింజకొన వలె సూక్ష్మ స్వరూపా! గుప్పెడు నీవారధాన్యాన్ని భుజించే యోగుల మనస్సులలో స్థిరంగా నిలిచియుండే దేవా! సత్ఖ్యాతి, అసత్ఖ్యాతి, అన్యథాఖ్యాతి, ఆత్మఖ్యాతి, అఖ్యాతి, అనిర్వచ నీయ ఖ్యాతి అనే ఆరు విధాల తర్కపద్ధతులచే జీవ-ఈశ్వర భేదాన్ని స్థాపించే పండితుల ముఖాలు అనే గృహాలను మూసివేయు తలుపు వంటివాడా! పుట్టుక- ముది మి - ఆపదలు - నాశనం మొదలగు దుఃఖా ల్ని నశింప చేయువాడా! శ్రీకాళ హస్తీశ్వరా !
పుట్టుక - ముసలితనం - మృత్యువు లేదా భార్య- పుత్ర- ధనాలు అనే భౌతిక బంధాల్ని ఛేదించువాడా ! సంసార బంధ మనే సముద్రాన్ని బంధించే నిపుణమైన విద్యలో ప్రవీ ణుడా! సమస్త జీవులు అనే సేనలకు నాయకుడా! భక్తులపాలిట కల్పవృక్షమైన వాడా! శ్రీకాళ హస్తీశ్వరా!
వటవృక్షమూలంలో నివ సించే దక్షిణామూర్తీ! జీవేశ్వ రులు భిన్నమైన వారనే భేదవాదాన్ని చేసే వారి వాదములచే ఖండిం పబడని వాడా! జటాజూట మనే గుడిసె ముంజూరు నందు చిక్కు కొన్న చంద్రఖండం చేత ప్రకాశించు వాడా! దిగంతా లే కట్టు బట్టలుగా కలవాడా! హాలా హల విషాన్ని ఆరగించిన వాడా! చెలరేగు కంటి మంట లచే మన్మథుని జయించి నవాడా!
శ్రీకాళహస్తీశ్వరా ! నీకు నమస్కారం.
*
అయిపోయింది.

చరవాణి: 9490620512