డైలీ సీరియల్

వనితల ముక్తిసౌధం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివుని ఎఱ్ఱని జటాజూటపు ఎరుపు కాంతి బాగా కలసిపోయి సంధ్యాకాల సమయమనే శంకను కలుగచేయగా పార్వతి ప్రియుడైన శివుని విడిచిపోయింది. అప్పుడు శివపార్వతుల శరీర కాంతియనే యమునా గంగా నదుల సంగమంలో పుట్టిన అచ్చమైన తెల్లకలువల రాశిలో దాగికొనే చక్రవాక పక్షులవలె తెల్లని పైటవస్త్రంలో ఉన్న ఉన్నతమైన కలశాల వంటి స్తనాల్ని గట్టిగా పట్టేందుకు ఆశపడే శివుని కుడిచేతి వద్ద పార్వతి ఎడమహస్తం అమరింది (అంటే నివారించింది). గాఢమైన కౌగిలి వలన భార్య పార్వతియందు కలిగిన ఆనందభాష్పాలు చూచి అవి తన ఆభరణాలయిన పాముల పూత్కారాల నుండి వెలువడిన విషాగ్ని ధూమం వలన కలిగాయని శివుడు భ్రమించాడు.
వెంటనే తన సర్పాభరణాల్ని తొలగించే ప్రయత్నం చేసాడు. దానిని చూచి పార్వతి నవ్వింది. ఆ నవ్వుల తెల్లదనంతో తెల్లనైన ఆమె ముఖం తన ముఖం (శివుని ముఖం) వేరుపరచి చెప్పడానికి సాధ్యంకాని రీతిగా ఇరువురి ముఖాలు సౌందర్యాతిశయంతో ప్రకాశించాయి. వామ భాగంలో నిత్యమూ నిలిచియుండే పార్వతి అందమైన నడుముకు తన నడుము ఏ విధంగాను సరిగాక ఓడిపోయిన ఆ సన్నని నడుమున్న చోట అతకడానికి ఆకాశాన్ని తునకలు తునకలు చేయాలని ఈశ్వరుడు గండ్రగొడ్డలి పైకెత్తిన చేతితో మనోజ్ఞంగా ఉన్నాడు. మన్మథదహనం చేసే చూపునందే ఉదయమైన దయావీక్షణం చేత, కంఠనాళం మీద నిలిచిన విషపు నల్లని మచ్చచేత; మెడలోని హారాలలో ప్రకాశించే ఇంద్రనీలమణులచేతను; భయంకరమైన తాండవనృత్యం చేసే తరుణంలో బ్రహ్మాండాన్ని భిన్నంచేసిన పాదంచేత; యోగీశ్వరులు ధ్యానంలో లాస్యమనే నృత్యవిలాసపాదం చేత; ఆ శివపార్వతులు చాల ఆనందదాయకమయ్యారు.
వేశ్యా కన్యల శివసాయుజ్యం
జననీ జనక శరీరాకృతి చేతనూ, శ్రీవిద్యా-పురుష సామరస్య రమణీయాకారం చేతనూ, శృంగార-శాంతరస సమ్మేళన స్వరూపం చేతనూ, ప్రత్యక్షంగా నిలిచే భోగ-మోక్షదాయక సాకారం చేతనూ ప్రకాశించే ఒకానొక ఘనమైన మహాతేజస్సు కన్నులకు మిరుమిట్లు గొల్పుతూ ఆ వేశ్యాంగనలకు ప్రత్యక్షమైంది. దానిని చూచివారు ఇన్నాళ్లకు తమ కోరిక సఫలమైనదని సంతోషించి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి చేతులు జోడించి వౌనంగా నిలబడ్డారు. వారిని చూచి శివుడు వారి మనోరథాన్ని గ్రహించి తానుచేసిన సేవకు శివుడు తనకు సాయుజ్యాన్ని ఈయక మాత్రమే ఇచ్చియున్నాడని తలంచిన పార్వతి సిగ్గుపడే విధంగా వారికి మోక్షపదవిని అనుగ్రహించి మాయ మయ్యాడు.
వేశ్యాకన్యలు ముక్తి పొందిన వార్త ఆకాశవాణి ప్రకటించుట
అప్పుడు శివుని సన్నిధిలో నిలిచిన ఆ వేశ్యా వనితల రాక ఆలస్యం కావడం చేత శివాలయానికి ముంగిట తమ సొమ్ములకు రక్షణగా ఉంచిన తోడి ఇంటిబిడ్డలు ‘దేవాలయంలోనికి పోయిన ఆ వనితామణులకు ఇంత సమయం అవసరమైనదా? శ్రీమహాదేవుని సేవకు వారు పోయింది తగిన సమయం కాదా? శివపూజలో వారికి తృప్తి కలుగలేదా? ఏల ఆలసించారు? సొమ్ములతో మమ్ము ఈ ఆలయం బహిఃప్రదేశంలో ఉంచి వారు ఇంతవరకు ఎక్కడా నిలువరు కదా’ అని భావించారు. అంతలో ఆ దేవస్థానం వారు వారిని ఊరడించి గుడిలోనికి పోయి వారవనితల్ని వెదుకగా వారెచ్చట కనబడలేదు. అప్పుడు వారికి కంగారు కలిగి భయపడగా ఆకాశవాణి జరిగిన వృత్తాంతాన్ని అంతా వారందరకు తెలియజెప్పింది. దానిని విని వారు భోగపు స్ర్తిల అపారభక్తికి - భక్తులపై గౌరీరమణుని మహా కారుణ్యభావం చెప్పనలవి కాదని భావించి గుడి బయటకు వచ్చి ఆ వేశ్యకాంతల చెలికత్తెల్ని చేరబిలిచి ఈ సంసారము నందు మమకార బుద్ధితో ప్రవర్తించి పతనం కాకుండగా ఆ వేశ్యకాంతల్ని శివుడు మోక్షమనే సముద్రంలో నిమజ్జనం (ముంచుట) చేసిన విషయాన్ని వివరించి చెప్పారు. ఈ విషయాన్ని శివాలయంలో, జ్ఞాన ప్రసూనాంబాలయంలో, విఘ్నే శ్వరుడు- భైరవమూర్తి- నారాయణుడు - ఇంద్రుడు- కన్నప్ప- దక్షిణామూర్తి - నటరాజమూర్తి మొదలైన ప్రదేశాలలో అనే్వషిస్తున్న వారికి ఆకాశవాణి అందరకు విన్పించింది. అంతేకాక ఆకాశవాణి ఇంకా ఇలా చెప్పింది. ‘నిస్సందేహంగా శ్రీకాళహస్తీశ్వరుని మీరిక్కడే యుండి సేవించండి. మోక్షమందిన ఈ వేశ్యకాంతల భక్తి పుణ్యాత్ములకు తెలిసే విధంగా లింగ ప్రతిష్ఠల్ని చేయండి.’ అప్పుడా వెంటవచ్చిన వనితలు తమ ఏలికసానుల (సానిరాణులు) పేర దక్షిణకైలాస ప్రాంగణంలో అత్యంతభక్తితో శివలింగ ప్రతిష్ఠాపనలు చేసారు.
అని శివుడు వేశ్యాంగనల కథ విన్పించగానే దానిని విని మనఃపరిపక్వత కలిగిన ఆయాదవ మహారాజు ఈశ్వరునకు మ్రొక్కి ‘ఓ మహానుభావా! నా మనస్సులో ఒక సందేహం కలిగింది. దానిని విన్నవిస్తాను. దయతో దానిని నివృత్తి చేయండి. జిజ్ఞాసతో శిక్ష- వ్యాకరణం- ఛందస్సు-నిరుక్తం- జ్యోతిష్యం-కల్పం అనే వేదాంగాల్ని చప్పరించిన వారూ, సకల వేదామృత సముద్రాన్ని పుక్కిలి పట్టిన వారూ, సర్వవేదార్థ ధనాన్ని తమ ఆత్మ అనే భూమిలో పాతుకొన్నవారూ, న్యాయశాస్త్ర గ్రంథాలనే ఫలాల్ని నమిలి మ్రింగినవారూ, ధర్మశాస్తమ్రనే ఔషధాల్ని నూరుకొని త్రాగినవారూ, అనేక పురాణాలనే బావుల్ని త్రవ్విన వారూ, యోగార్థ సాధనాల్ని మనస్సులో ఉపాసించిన వారూ, ఇతర మతాలనే బంగారాన్ని ఒరిపిడి రాయిపై పరీక్ష చేసినవారూ, తపస్సులు చేసిన వారూ, పుణ్యతీర్థాలు తిరిగిన వారూ ఎన్నో వ్రతాల్ని చేసిన వారూ, శివుని ప్రత్యక్షంగా ఎరుగలేక పోయారు. మరి సామాన్యమైన ఈ సాలీడు - పాము- ఏనుగులు ఏ జ్ఞానంతో పూజించి ముక్తిపొందాయి?’ అని అర్థించాడు.
ఇంకా ఉంది

చరవాణి: 9490620512