డైలీ సీరియల్

ఈశ్వరునకు వనదేవతల ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దొంగలు విఫల మనోరథులై వెడలిపోవుట
వారు ప్రయాణిస్తూ మార్గమధ్యంలో ఉదయార్చన చేయాలని వేశ్యాంగనలు భయంకరంగా జంతువులు చేసే అరుపుల ధ్వనికి చెవులు చిల్లులు పడే మహారణ్యంలో ఈశ్వరలింగాన్ని ముందు పెట్టుకొని నిశ్చల బుద్ధితో సరోవరతీరంలో నిలిచియున్నారు. ఆ సమయంలో వారి వెంట వచ్చిన దొంగలు ‘ఈనాడు ఈ వేశ్యల్ని చంపి ఆభరణాలు, ధనం దొంగిలించుకొని స్వేచ్ఛగా పోదాము. ఈ అడవుల్లో పడి ఎట్లో వీళ్లు రాత్రికి కాళహస్తికి చేరుకొంటారు’ అని తలంచి ఆ పాపాత్ములు అపకారాన్ని తలపెట్టబోయారు. అప్పుడు చెల్లెలు అప్పా! ఏమిటో చూడుమని పలికింది. దానికి ఆమె నవ్వి ఓ తల్లీ! నీకు పరాకెందుకే దర్శింప సాధ్యం కాని లోకజనకుడైన శ్రీకాళహస్తీశుని సేవించు. ఏమయిననూ కానిమ్ము అని అంది.
అనగా తదేక ఈశ్వర ధ్యాననిమగ్నతా భావం చేత సమాధిస్థితి పొందినవారై పరవశురాండ్రవుతూ ఈశ్వరుని సేవిస్తూ ఉండగా ఆ నారీమణులకు ఆనందం కలిగించేందుకై శ్రీకాళహస్తీశ్వరుడు దయతో ద్రవిడ (తమిళదేశం) జంగమ వేషాల్ని ధరించిన ప్రమదగణాలతో అచటకు వచ్చాడు. వారు నోటితో శివస్తోత్రాల్ని చదువుతున్నారు. దేహమంతట విభూతిరేఖల్ని దిద్ది తీర్చుకొన్నారు. కంఠంలో తలలపై గుండ్రని మరియు చిన్న రుద్రాక్షల్ని ధరించారు. చెక్కిళ్ల వరకు వ్రేలాడే రాగి కమ్మల్ని పెట్టుకొన్నారు. కావి రంగుగల గోచీలు కట్టుకొన్నారు. ఎడమచేతిలో సజ్జలింగాన్ని పట్టుకొన్నారు. బహుదూర ప్రయాణం చేత శరీరమంతట చెమటలు కలిగియున్నారు. త్వరత్వరగా పూలు కోసేందుకు నడుస్తున్నారు. శివుని పూజించేందుకు పత్రపుష్పఫలాన్ని భక్తితో తెచ్చే ద్రవిడ (తమిళదేశం) జంగమ వేషాలు ధరించారు.
ఆ కలకలాన్ని చూచి మనస్సున భయపడిన దొంగలు కాకుల వలె ఒకరినొకరి చూచుకోకుండ అడవిలోనికి పారిపోయారు. అటుపిమ్మట మదనాంతకుడైన నీలకంఠుడు ఆ వేశ్యల్ని చూచి దయతో ‘‘ఇది ఏమి? ఇక్కడ ఈవిధంగా మీరు ఎందుకున్నారు?’’ అని అడిగాడు. అప్పుడా వేశ్యలు ఆ శివునకు నమస్కరించి మాయాజంగమ వేషధారులై దొంగలు తమను నమ్మించి ఈ అడవిలోనికి తీసుకొని రావడం, తమ స్వర్ణ్భారణాల్ని అపహరింప ప్రయత్నించడం అంతలో మీరు రాగా వారు పారిపోవడం మున్నగు విషయాల్ని వివరించారు. అంతట శివుడు కృపామూర్తియై.
‘‘అమ్మలార! కరుణా సముద్రుడు, శ్రేయోనిధియు, శ్రీకాళహస్తీశ్వర స్వామిని ఆరాధన చేయుట కొఱకు మిమ్మల్ని అచటకు తీసుకొని పోతాను. నావెంట రండి. విచారాన్ని విడవండి. అని వారి నాదరించి వెంటబెట్టుకొని యమస్థానమైన దక్షిణదిశలో గల వెండికొండకు (దక్షిణ కైలాసము) తీసుకొని పోయాడు.’’
* * *
త్రోవలో వనదేవతలు ఈశ్వరార్చన చేసే నేర్పు కలిగినవారై శివునిపై పిల్లవాయువుల చేత పూలతీగలను కదిలించి రాల్చిన పూలను చల్లారు. పూలతేనెల జల్ల్ఱులో స్నానమాడించారు. తుమ్మెదల గుంపు చేయు మనోహరమైన తానగాన విశేషాలతో రంజింపచేసారు. అగరు అనే వృక్షాలు, గుగ్గులపు చెట్లు, చందనవృక్షాలు పరస్పరం రాసుకోవడం చేత పుట్టిన అగ్గివల్ల జనించే ధూపధూమాన్ని సమర్పించారు. చాలా లోతయిన నదీ తీరాలలో సదా భగవదారాధన చేసే యోగులు, మరియు శైవాగమ తత్త్వవేత్తలతో మంచి పరిచయ భాగ్యముండటం చేత చిలుకలు, గోరువంకలు నిత్యం పలికే మంత్రాలతో శ్రవణ మనోహరంగా చేసారు. సూర్యకాంతుల్ని తిరస్కరించే దక్షిణకైలాసగిరిపై గల మణుల కాంతి పుంజంతో నీర్ళానాలిచ్చారు. స్వేచ్ఛగా సంచరించే మదగజాలు, కారెనుబోతులు, శరభమృగాలు, సింహాలు మొదలగు మృగశ్రేష్ఠుల గంభీరధ్వనులకు కొండ గుహలలో ఏర్పడే ప్రతిధ్వనులే మనోహర వాద్యవిశేష ధ్వనులుగా మ్రోగించారు. పనస, రసాలమామిడి, మద్ది, ఈత, నేరేడు, నిమ్మ, వెలగ చెట్లనుండి క్రిందపడిన ఫలాల్ని ఆహారంగా సమర్పించారు. రెండువైపులకు మధ్యభాగంలో ప్రవహించే సువర్ణముఖీ నదీ మధ్యంలోని తామరపద్మాల మరియు ఎర్రవిబలువల సుగంధాన్ని ప్రసరింప చేసారు. శివలింగానికి మైపూతగా చేయబడే చందనం, కర్పూరం, కుంకుమం, జవ్వాది, కస్తూరి అను సుగంధద్రవ్యాల పరిమళంతో సంతోషాన్ని కలిగించారు. తోటలలో గల మామిడి, కొండగోగు, మందార, సురపొన్న, దేవదారు, మారేడు, పొన్న, అంకుడు (వృక్షవిశేషం), పొగడ, మల్లిక మొదలగు పుష్పసువాసనలను చూచి అసూయపడి వానిని తమయందు విలీనం చేసుకొన్న చల్లని పిల్లవాయువులతో ఆనంద పరిచారు. ఈవిధంగా వస్తున్న మహేశ్వరుడికి మార్గాయాస శ్రమను తొలగించి సేవించారు.
శ్రీకాళహస్తిలో వేశ్యకన్యల ప్రవేశం
ఐదు ముఖాలు (సద్యోజాత -వామదేవ- అఘోర -తత్పురుష-ఈశాన) కల శివుని వలె పంచాస్యాల (సింహాల) సంచారం కలది; నీలకంఠునివలె నాట్యమాడు నీలకంఠాలు (నెమళ్లు) కలది; పార్శ్వభాగంలో ప్రకాశించే శివాని (పార్వతి) కల ఈశ్వరుని వలె శివా (నక్కల) కోలాహలం కలది;
- ఇంకావుంది...

చరవాణి: 9490620512