డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-11

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏకఛత్రాధిపత్యాన్ని సంపాయించేందుకు ఆమె తీవ్రంగా ఆలోచించింది.
రాజ్యకాంక్ష ఆమెను సరిగ్గా ఆలోచించనీయలేదు. కనుకనే తన ఆధీనంలో వున్న రోమన్ సైనికులను విడుదల చేసింది. తన ఖజానాలోని సగం సొమ్ముని జీయస్ పాంపేకు ఇచ్చింది. మరికొంతమంది ఈజిప్షియన్ సైనికులతోపాటు ఆహార పదార్థాలనూ, 50 ఓడలనూ కూడా ఇచ్చి సాగనంపింది. సీజర్‌కూ, పాంపేకూ జరిగే ఈ అంతిమ పోరాటంలో పాంపే తప్పక విజయాన్ని సాధిస్తాడనీ, తాను చేసిన సహాయానికి ప్రతిఫలంగా తనను మహారాణిని చేస్తాడనీ ఆమె ఆశించింది.
కానీ రుూ ఆశ భావి జీవితానికి సంబంధించిన ఒక ఎండమావు! చేతిలో వున్న సొమ్ములో సగభాగాన్ని రోమన్‌లకు సమర్పించుకున్నది. తన ప్రభుత్వానికి రక్షణగా వున్న బలగాన్నీ, నావల్నీ, నావికుల్నీ, రోమ్‌కు సాగనంపింది. తీరా ఆ ఓడలు వెళ్ళిపొయాక తాను కోరలు తీసిన పామయ్యాననే సత్యాన్ని ఆమె గ్రహించింది. ఇప్పుడంతా మించిపోయింది కనుక ఇక పశ్చాత్తాపపడి లాభం లేదు.
ఇలాంటి సమయం కోసమే టాలమీ పక్ష నాయకుడు పొథినస్ వేచి ఉన్నాడు. లోగడ రోమన్ సైనికుల్ని బందీలుగా సిరియాలోని రోమన్ రాయబారికి పంపటంవల్ల జరిగిన అవమానాన్ని, దేశానికే అవమానంగా ఆయనప్రచారం చేసి ఉన్నాడు. ఇప్పుడు క్లియోపాత్రా కేవలం స్వార్థచింతతో చేసిన సహాయాన్ని పొథినస్ వేరొక రూపంలో ఎత్తిచూపాడు.
‘‘అసలే దేశం దౌర్భాగ్య స్థితిలో ఉన్నది. క్లియోపాత్రా పాటి సహాయం చేయలేకనేనా మే మూరుకున్నది? ఔలటీస్ టాలమీ చేసిన ఋణ బాధతోనూ, దుష్కార్యాలతోనూ ఎన్ని శతాబ్దాలకు తిరిగి దేశ సౌభాగ్యమనే పదాన్ని వినగలుగుతామోనని, నానా అవస్థలూ పడుతూన్న సమయంలో- ఇప్పటికీ దేశాన్ని దోచి పెట్టింది చాలక, తిరిగి రుూ రోమన్‌లకు క్లియోపాత్రా సహాయం చేసిందంటే అర్థం ఏమిటి? ఈ ధనరాశులూ, ప్రజలూ క్లియోపాత్రా తాతగాడి సొత్తా? అదీగాక రేపు రోమన్ సామ్రాజ్యాన్ని ఎవరు ఆక్రమిస్తారో తెలియని స్థితిలో క్లియోపాత్రా పాంపేకు సహాయన్నా పంపితే, రేపు జూలియస్ సీజరే నియంత అయ్యే పక్షంలో, ఈజిప్టును ఆయన రోమన్ సామ్రాజ్యంలో కలుపుకునేందుకు రుూ ఒక్క కారణం చాలదా?
‘‘ఈమె తండ్రి చేసిన దుష్కార్యాలకే తట్టుకోలేకపోతూన్న సమయంలో, ఈమె చేసే రుూ పాడు పనులు దేశానికి ఏ విధంగానూ క్షేమకరం కాజాలవు. ఆమె వ్యక్తిగతంగా ఎలా పోయినా ఫర్వాలేదు కాని, దేశాన్ని సర్వనాశనం చేయటాన్ని ప్రభుత్వం ఏ విధంగానూ సహించలేదు.
‘‘పోతే వంశాచారానుసారం క్లియోపాత్రా భర్తతో ఒక్కరోజన్నా కాపరం చేసిందా? తమ రాజుకు ఈ దుష్టురాలు తగిన రాణి అని ప్రజలు భావించి ఆమోదించగలరా? టాలమీ వంశంలోకి పరాయి రక్తం మిళితం కాకూడదనే ఆచారాన్ని కించపరిచిందీమె! ఇలాంటిదాన్ని ఎవరు క్షమించగలుగుతారు? పాలకులైన ప్రతివారూ ఒక్కోసారి ఈజిప్టును రోమన్‌లకు అమ్మజూపితే మనకిక మిగిలిందేమిటి?’’
ఈ విధంగా పొథినస్ తిరుగుబాటు లేవదీశాడు. ఆయన చెప్పిన మాటల్ని ఖండించేందుకు క్లియోపాత్రాకు ఎలాంటి అవకాశమూ లేకుండా పోయింది. పైపెచ్చు వున్న రక్షణను కూడా కోల్పోవటంవల్ల, తన భర్త టాలమీ పక్షాన్ని ఎదుర్కొనే శక్తి కూడా ఆమెకు లేదు. ఈ తిరుగుబాటు మరికొంచెం సాగితే, తన ప్రాణానికే ముప్పని ఆమె గ్రహించింది. ఎటు చూసినా కీడు మాత్రమే ఆమెకు కనిపిస్తోంది. ప్రాణాలతో బైటపడటమే విషమ సమస్యగా తయారవకముందే, ఆమె తెలివిగా తన వారిని కొంతమందిని తీసుకొని, ఖజానాలో మిగిలిన సొమ్ముతో సహా అర్థరాత్రి అర్థరాత్రే ఈజిప్టు నుంచి పారిపోయింది.
5
ఈజిప్టు తీరాలు దాటి చాలా దూరం పొయ్యే వరకూ క్లియోపాత్రా తిరిగి మనిషవలేదు. ప్రాణాలు గుప్పెటలో పెట్టుకొని బయలుదేరింది. ఇపుడు కాస్త ఊపిరి పీల్చుకొని ఏం చేయటమా, ఎటు పోవటమా అని ఆలోచించసాగింది.
ఏనాటికైనా తాను రోమన్ ప్రభుత్వాన్ని శరణు కోరవలసిందే! తన తండ్రి రోమన్ పాలకుల కాళ్ళ దగ్గర పడిగాపులు గాచి, రాజుగా ఈజిప్టు తిరిగి రావటాన్ని ఆమె ఇంకా మరిచిపోలేదు. ఐతే ఇప్పుడు తాను రోమ్ వెళ్తే?
రోమ్‌లో కూడా స్థిరమైన ప్రభుత్వం లేదు.
స్వదేశంలో వలెనే అక్కడా రెండు పక్షాలున్నవి. ఒక పక్షంవారు- అంటే, పాంపేకు తాను సహాయపడింది. ఈ విధంగా పాంపే తనకు రుణపడి ఉంటాడని తాను నమ్మింది. ఐతే పంపే ఇపుడు తన మొర ఆలకించి, తనకు సహాయం చేసే స్థితిలో లేదు. ఎందుకంటే నిన్నమొన్ననే తన సహాయాన్ని ఆయన పొంది ఉన్నాడు.
అదీగాక ఆయన ముందుగా తన నియంతృత్వాన్ని కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతూన్నాడు. గ్రీస్‌లోని యుద్ధ్భూమిలో- ఆయన తల బద్దలు కొట్టుకుంటున్నాడు. ఆ యుద్ధంలో అటో ఇటో తేలేవరకు తన సంగతి కానీ, ఈజిప్టు భావిని గూర్చి కానీ ఆలోచించేవారుండరు. కనుక తాను ఇపుడు రోమ్‌కు వెళ్ళటం వృథా! ఒక విధంగా ప్రమాదం కూడాను. ఎందుకంటే తనను, తన భర్త టాలమీతో కలిసి ప్రభుత్వాన్ని నిర్వహించేందుకు మాత్రమే రోమ్ అంగీకరించింది. ఇందులో చీలికలు ఏర్పడినపుడు వ్యవధిమీద కాని అమీ తుమీ తేలదు.
పోతే రుూ విశాల విశ్వంలో తానెక్కడికి వెళ్లాలి? బైటి ప్రపంచాన్ని గూర్చి తాను విన్నదే కాని, దేశం విడిచి రావటం ఇదే మొదలు! అదీ సరదాగా తిరిగొచ్చేందుకు రుూ ప్రయాణం జరగటంలేదు. పరిస్థితులు చక్కబడేదాకా, అవి ఒక విశిష్ట రూపాన్ని దాల్చేవరకూ తాను అజ్ఞాతవాసం చేయవలసిందే కాని, వేరొక మార్గమంటూ లేదు.
అనాథగా, చాలా కొద్ది బంగారంతో రాజ్యాన్నీ, రాజభోగాల్నీ పోగొట్టుకొని, దిక్కులేని స్థితిలో ఎటు వెళ్లాలనే విషయాన్ని గూర్చి ఆమె ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేకపోయింది. ఎందుకంటే బంధు మిత్రులూ, ఆదరించేవారూ తనకు లేరు కనుక, ప్రపంచంలో ఏ మూలకు వెళ్లి తలదాచుకున్నా ఒకటే!
కానీ మరికొన్ని ముఖ్య విషయాలున్నవి. తాను స్వదేశానికి సాధ్యమైనంత దగ్గర్లో ఉండాలి. ఎందుకంటే, అక్కడి వార్తలు ఎప్పటికప్పుడు తనకు అతి త్వరలో అందుతూండాలి. అదృష్టవశాత్తూ సమయం చిక్కితే, తాను ఈజిప్టును ఆక్రమించుకొనేందుకు వీలుగా చూసుకోవాలి. అందుకని ఈజిప్టుకు మరీ దగ్గర్లోనూ ఉండరాదు. తనకన్నా బలవంతుడైన తన భర్త ఏ క్షణాన్నయినా తనమీద దండెత్తి సర్వనాశనం చేయగలడు!
తనకు ఎటూ మిత్రులనదగిన వాళ్ళు లేరు కనుక శతృత్వాన్ని చూపే వారికి దరిదాపుల్లో మాత్రం ఉండరాదు. ముఖ్యంగా ఈజిప్టులోని ప్రస్తుత పాలకులకు సహాయకులుగా ఉండేవారి పంచ మాత్రం చేరకుండా చూసుకోవాలి.
అంతకన్నా ముఖ్యం- తాను భయపడి, కేవలం ప్రాణాల్ని కాపాడుకోవటమే పరమావధిగా భావించినట్లు కనపడాలి. ఇది నిజమే అయినప్పటికీ, ఒక్కో సందర్భంలో నిజాన్ని ఒప్పించడం, నిజాన్ని నిజంగా చూపటం కష్టవౌతూంటుంది. ఒకపక్క తాను కూడా ఒక చిన్న సైన్యాన్ని ఏర్పరచుకోవాలి. ఈ సైన్యంతో ఈజిప్టు మీద దండెత్తి, దాన్ని ఆక్రమించుకునే అవకాశాలుండగలవని ఆమె కలలో కూడా తలంచడంలేదు. కాని, ఒకవేళ ఈజిప్షియన్ సైన్యాలు తనమీద దండెత్తినట్లయితే, కనీసం ఆత్మరక్షణకన్నా ఉపయోగపడే పాటి సైన్యమన్నా తనకుండాలి.
ఈ ఊహలు అనుగుణంగానే ఆమె ఎర్ర సముద్ర తీరంలో లోయల్లో విడిది చేసింది.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు