డైలీ సీరియల్
తనయులకై తపం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బంగారుమాణిక్య రచితమైన హంసల రథాన్ని దిగి బ్రహ్మ తన దేవితో కూడి సువర్ణముఖరీ నదిలో స్నానమాడి ఈశ్వరుని, జ్ఞానప్రసూనాంబను సేవించుకొన్నాడు.
తదుపరి దక్షిణకైలాస శిఖరం మీద కూర్చుండి బ్రహ్మ పద్మాసనస్థితుడై హృదయకమలంలో పరమేశ్వరుని ధ్యానిస్తూ పంచేంద్రియ సౌఖ్యాలను విసర్జించి కందమూల ఫలభక్షణంతో కొన్నినాళ్లు; జలమే ఆహారంగా కొంతకాలం; గాలి నాహారంగా మరికొన్నిదినాలు; నిత్యోపవాసాలతో మరికొన్ని నాళ్లు తపస్సు చేస్తూ లోకాలకు భీతిగొలిపే గాలి - వర్షం - శిశిరం మొదలైన వాని తీవ్రతలకు భయపడక ధైర్యంగా బ్రహ్మ పెక్కేండ్లు తపస్సు చేసాడు. ఆ సమయంలో గంగానదీ తరంగాల నుండి వీచే గాలి బ్రహ్మకు గ్రీష్మఋతు తాపాన్ని హరించింది. మునీశ్వరులు చేసే యజ్ఞాగ్నికీలలు చలి బాధను తొలగించాయి. సమీపవృక్షాలపై నిలిచి పురులు విప్పి ఆడే నెమళ్లు వాన తీవ్రతను తగ్గించాయి. సర్పరాజులు తమ పడగల్ని విశాలంగా విప్పార్చి ఝంఝూమారుత వేగాన్ని అడ్డగించాయి. సమస్త భూతాల అంశలతో కూడి ప్రకాశించే కొడుకును పొందేందుకు ఆవిధంగా బ్రహ్మ తపస్సు చేస్తుండగా వాయువు-అగ్ని-నెమళ్లు, నాగులు మొదలైనవారు ఆయనకు సహాయులై వచ్చారు. ఆవిధంగా తపస్సు చేస్తున్న బ్రహ్మ ఆశ్రమం సాక్షాత్తు శాంతరస స్వరూపంగా ప్రకాశించింది.
అచట తల్లి కానరాక బాధపడే లేడిపిల్లకు బెబ్బులి తన బిడ్డకు పాలిచ్చే రీతిగ పాలిస్తూ పెంచుతుంది. దైవికంగా చెట్టుపైగల గూటి నుండి క్రిందికి జారిపడ్డ రామచిల్క పిల్లల్ని పిల్లి రక్షిస్తూ ఉంది. ఎండలో మాడుతూ ఉన్న కొండ కోయిలలను తెచ్చి కోతులు మామిడి చెట్ల నీడలలో సేదతీర్చుతున్నాయి. తప్పిపోయిన ఆడ ఏనుగులను తెచ్చి సింహాలు మగఏనుగుల విరహతాపాన్ని పోగొడుతున్నాయి. ఉరుములకు ఎగబడి వచ్చే శరభమృగాల్ని మెల్లగ తెచ్చి గండభేరుండ పక్షులు నేలపై ఉంచి రక్షిస్తూ ఉన్నాయి.
ఇక సరస్వతీ మాత బ్రహ్మకు అవసరమైన పరిచర్యలు సేయ సాగింది. ఆమెకు ఆ అడవిలో గల చెంచు స్ర్తిలు పని పాటలయందు సహాయపడ్డారు. చిలుకలు పలుకుతోడుగ నిలిచాయి. అది చదువుల తల్లికి ఒక వినోదానే్న కలిగింపగా ఆమె భర్తకు కోరిక సిద్ధించే వరకు తపస్వినియై చేదోడు వాదోడుగా నిలిచింది. పదునాలుగు భువనాలకు ఆశ్చర్యం గొలిపే విధంగా ఆధ్యాత్మిక విద్యాధురంధరుడైన కొడుకు కలిగేందుకు భారతీదేవి, భర్త బ్రహ్మతో కలిసి తపమాచరిం చింది. కొంత కాలానికి ఈశ్వరుడు కనుకొలకుల కృపా వృష్టి కురిపిస్తూ నందివాహన మెక్కి సరస్వతీ బ్రహ్మలకు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు విష్ణువు సకలదేవతలు ఆయ నను పరివేష్ఠించి ప్రమద గణాలు సేవింపగా వెంట వచ్చారు. మంగళ వాద్యాలు ఘనంగా మ్రోగాయి.
ఈశ్వరుడు ప్రత్యక్షమై బ్రహ్మకు వరమిచ్చుట
ఆ విధంగా ప్రత్యక్షమైన శివుడు ‘సురజ్యేష్ఠా! నేను నీకేమి ఈయగలను? చెప్పు.’ అని పల్కాడు. ఆ మాటవిని బ్రహ్మదేవుడు సాష్టాంగ నమస్కారం చేసి వివిధ రీతుల సన్నుతించి శరీరంలో ఆనందం చేత వణుకు రోమాంచం (గగుర్పాటు) కలుగగా ఇలా అన్నాడు. ‘‘దేవ! నీవంటి దైవం; దివ్యక్షేత్ర రాజాలలో దక్షిణకైలాసాన్ని పోలిన క్షేత్రం; కోరికలు ఈడేరిన నావంటివాడు ఈ లోకంలో లేడు. నీదర్శన భాగ్యం కలిగినా నీయాకారాలలో ఒక్క దానినైన సంపూర్ణంగా చూడడం సాధ్యంకాదు. అట్టి లోకాతీతమై దృష్టికి గోచరంకాని నీ చిదాకృతిని ఇంక స్తోత్ర మేవిధంగా చేయగలను? అన్ని విధాల వౌనం వహించడమే ధన్యత అని నాబుద్ధికితోస్తూ ఉంది. ‘ఓ దేవా! కాలధర్మాన్ని పరిశీలించకుండ భారతీ దేవితో మదనకేళిలో తేలియాడిన ఫలితంగా ముప్పది వేలమంది రాక్షసులు పుత్రులుగా పుట్టారు. వారు నా యాజ్ఞానుసారంగా వింధ్యాద్రికి పోయి ప్రజలను పీడింపగా భూదేవి నాతో మొరపెట్టుకొంది. అప్పుడు నేను కోపించాను. దానినుండి ఉగ్రుడను పుత్రుడు జన్మించాడు. ఆతని చేత వారినందరిని చంపించి పుత్రహత్యకు పాల్పడ్డాను. ఆ ఉగ్రునే చంపి పుత్రహీనుడనయ్యాను. ఈ రెండు దోషాల నుండి నన్ను దయతో రక్షించు.’
అని బ్రహ్మ ప్రార్థించగానే ప్రసన్నుడై పార్వతీరమణుడిలా అన్నాడు. ‘దక్షిణకైలాస క్షేత్రాన్ని నీవు చూచినంత మాత్రం చేతనే నీకు పుత్రహత్యాది దోషాలు తొలగిపోయాయి. మాఘమాసంలోని ముఖనక్షత్రకాలంలో సువర్ణముఖీ నదీస్నానం చేసి వౌనంగా నూటయెనిమిది సార్లు ఓం నమశ్శివాయ అను పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ, ప్రదక్షిణలు- నమస్కారాలను చేస్తూ ఆవిధంగా ప్రతీ నెలా సంవత్సరకాల పర్యంతం చేస్తే నీకు సుపుత్రుడు జన్మిస్తాడు. నీవేకాదు. ఎవరు ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి సుపుత్రుడు జన్మిస్తాడు.’ అని పల్కి సర్వేశ్వరుడు అంతర్థానమయ్యాడు.
ఋభువుని జననం
పిమ్మట కొంతకాలానికి ఈశ్వరుని అనుగ్రహం చేత సరస్వతియందు గర్భవతియైన లక్షణాలు కనబడ్డాయి. రెండు నెలలకే ఆమె చీర చిన్నదయింది. క్రమంగా వేవిళ్లు ఆరంభమయ్యాయి. నాలుకకు అరుచి ఏర్పడింది. చెక్కిళ్లు ఉదయకాల చంద్రుడిలా కళావిహీనమయ్యాయి. నడుము క్రమంగా పెరుగసాగింది. స్తనాగ్రాలు నలుపు వహించాయి. నడకలలో ఆయాసం సంభవించింది. నిట్టూర్పులు ఎడం లేకుండ అధికంగా రాసాగాయి. గర్భవతియయిన కారణంగా ఆ వాగ్దేవి తెల్లని మేను పుష్పించిన పూలతీగ అయింది. ఆమె స్తనాలు పుష్పమంజరుల వలె వికసించాయి. ఆ స్తనాలపై గల నలుపు పూలగుత్తులపై వ్రాలు తుమ్మెదల వలె మనోహరంగా ఉన్నాయి. సరస్వతీదేవి గర్భంలో తన (బ్రహ్మ) ఆత్మస్వరూపమే పుత్రరూపంగా పిండాకారం వహించి యుండటం కారణం చేత (ఆత్మావై పుత్ర నామాసి, పురుషుడే స్వయంగా స్ర్తి గర్భం నుండి పుత్రరూపంగా జన్మిస్తున్నాడు). ఉగ్రునిచే స్వయంగా జరిపించిన స్వపుత్రహత్యా కళంకమూ చివరకు ఆ ఉగ్రుడినే చంపగా సంభవించిన పుత్రహీనతా కళంకమూ రెండు (బ్రహ్మకు చెందినవి) బహిర్గతమైనవేమో నన్నట్లు సరస్వతి చనుమొనలయందు నలుపు జనించింది.
- ఇంకావుంది...