డైలీ సీరియల్
స్వచ్ఛసౌందర్యరాశి సువర్ణముఖీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతే గాక వజ్రాయుధపు దెబ్బకు పెద్ద్ధ్వని చేస్తూ పెకిలిపడి కూలిపోయే కొండల నుండి జారిపడే బండరాళ్ల చప్పళ్లకు బెదరి నీటిపక్షులు రెక్కల నొక్కసారిగా విప్పి నింగిపైకెగిరాయి. వాని రెక్కల తాకిడికి అచట గల సెలయేర్లలోని నీరు తుంపరల లాగ పైకెగసి పడింది. అవి అచటనే రతిక్రీడలలో మునిగిపోయిన దేవతాస్ర్తిల ముఖాలు చెమటపట్టకుండ చల్లదనాన్ని కలిగించాయి.
పూర్వజన్మగతమైన పాపకర్మ వాసనలవలన ముక్తులు కాని లోకంలోని జీవులందరిని తన వద్దకు రమ్మని ఆహ్వానం పలుకుతున్నదో అనే విధంగా ఎడతెగని కెరటాల సవ్వడులతో ఆ సువర్ణ ముఖరీనది ఎగసి ఎగసి పడుతూ ప్రవహిస్తూంది. ఆ విధంగా ప్రవహించే ఆ నది ఎఱ్ఱనేలలపై ప్రవహిస్తూ అందంగా ఎఱ్ఱగా ప్రకాశించింది. తెల్ల నేలలపై ప్రవహిస్తూ పాలసముద్రం లాగ రమణీయమైన కాంతులీనింది. నల్లరేగడి నేలలపై ప్రవహిస్తూ నల్లని కృష్ణానదీ సౌందర్యాన్ని వహించింది. త్రోవలో అడ్డంగా ఉన్న రెండు కొండల్ని తాకి అచట సుళ్లు తిరిగి తిరిగి రావడం చేత చూపరుల కనులకు కనువిందు చేసే బహుముఖప్రవాహవైభవాన్ని కలిగి తనయందు ఈ ఈ పుణ్యక్షేత్రాలున్నాయని ప్రజలకు తెలుపుతున్నదా అన్నట్లుగా మనోజ్ఞంగా ఉంది.
విజ్ఞానమయ కోశంలో ప్రతిఫలించే పరమాత్మను కలిగియుండి బిందు కళలతో ప్రకాశించే యోగి సహజవైభవం వలె ఆ సువర్ణముఖరీనది సాంద్రమైన నీటిబిందువుల సముదాయంతో కళకళ లాడింది. అదే రీతిగా కుంభక ప్రాణాయామమార్గంలో దశవిధ ప్రణవ (ఓంకారం) నాద (శబ్దం) సముదాయాన్ని వినే యోగి హృదయంలా ఆ నది నిరంతర పక్షుల నినాదాలచే ప్రసన్న నదీహృదయంలా ఉంది. అంతేగాక సంసార సాగరాన్ని దాటింప సమర్థకారణమైన ఆత్మచైతన్య కళలాగ (విజ్ఞానమయ కోశంలో ప్రతిఫలించేది) ఆ నది కూడ సంసారసముద్రాన్ని దాటించే కళాకౌశలంతో మనోజ్ఞంగా ఉంది. దాటుటకు అశక్యమైన ప్రపంచవిషయాల్ని దాటిన ముని వలె ఎత్తు-పల్లాల భూముల్ని దాటుతూ నది ముందుకు ప్రవహించింది. యధేచ్ఛగా సంచారం చేసే జీవనంతో (నీటితో) ఆనది యధేచ్ఛ జీవనం (జీవితం) గడిపే యతివలె ప్రకాశించింది.
అప్పుడా నది మత్స్య-కచ్ఛప (తాబేలు) మొదలైన వానితో ప్రకాశిస్తూ మత్స్య-కచ్ఛపాది అవతారాలతో ప్రకాశించే వాసుదేవునిలా రమణీయంగా ఉంది. శంఖాలు (నదుల్లో ఉంటాయి) చక్రాలు (చక్రవాక పక్షులు) మొదలైన వానితో శోభించే ఆ నది శంఖచక్రాది ఆయుధాలు ధరించిన విష్ణు మూర్తిలా ప్రకాశిస్తూ ఉంది. పర్వతాల్ని ఉత్పాటనం చేస్తూ (పెకలిస్తూ) ముందుకు సాగు తున్న ఆ నది గోవర్ధన పర్వ తాన్ని ఉత్పాటనం చేసిన మహా విష్ణుసౌందర్యంతో విరా జిల్లు తూ ఉంది. పలాశ కలాపాన్ని (అంటె ఒడ్డు మీద ఉన్న మోదుగు చెట్లను) కూలదోస్తూ సాగే ఆ సువర్ణముఖరి పలాశ కలాపాన్ని (రాక్షససమూహాన్ని) సంహరింప చేసే శేషశాయి వీరత్వాన్ని వహించి కదలిపోతూ ఉంది. అపారమైన గోరక్షణ (్భమి) చేస్తూ ప్రవహించే ఆ దివిజగంగ అపారగోరక్షణ (అనేక లోకాలను రక్షించే) చేసే పన్నగశాయి వలె ప్రకాశించింది. అనేక నరకలోక జనసమూహాలకు దుఃఖాన్ని నివారించడం ద్వారా నరకుని సంహరించి జనసమూహాలకు దుఃఖాన్ని నివారించిన శ్రీకృష్ణునిలా సువర్ణముఖరి విలసిల్లుతూ, ప్రకాశమానమై సువర్ణముఖరి పవిత్రమైన వాసుదేవుని లీలావిలాసంగా ముందుకు కదిలింది.
ద్వితీయాశ్వాసం
బ్రహ్మకు సరస్వతి వలన కుమారులు పుట్టుట
మలయపర్వతం నుండి వీచే చల్లని వాయు స్పర్శాది విషయాలయెడల నిరాసక్తమైన వేదాంత విద్యకు నిలయమైనవాడా! మునిజనుల పాలిటి కల్పవృక్షమైనవాడా! శ్రీకాళహస్తినివాసా! ఓ మహేశా!
యాదవరాజు ఎడల కరుణాకటాక్షాల్ని నెరపి మీరే స్వయంగా చెప్పిన మీ స్వీయకదను భక్త జనులకు చెవుల పండుగ అగునట్లు వినిపింతును ఆలకించుడు.ఒకానొకప్పుడు సత్యలోకంలో బ్రహ్మ కొలువైయున్నాడు. ఆ కొలువులో సకల విద్యా రహస్యాల లోని శంకల్ని తీర్పగల్గిన మునీశ్వరులు బ్రహ్మ ముందు వరుసగా నిలిచి ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. సమస్తదేవతా సమూహం చేతులు కట్టుకొని ఎదురుగా ఆజ్ఞల్ని శిరసా వహించడానికి సంసిద్ధులై జాగరూకతతో నిలిచియున్నారు. నోళ్లపై తన హస్తాల నుంచుకొని వినయంతో దిక్పాలకులు తమ తమ విజ్ఞాపనల్ని చేయడానికి చేరారు. రాక్షసగణం బ్రహ్మ కనుసన్నలలో మెలగుతూ సేవకులై వేచి యున్నారు. గరుడులు- గంధర్వులు-్భజగులు (సర్పరాజులు) కిన్నరులు - పిశాచులు ఈ దేవతా గణాలకు చెందిన భటులు చావడి ముందు ఆరుబయట కోట్లాదిగా నిలిచి రక్షణ కల్పిస్తూ ఉన్నారు. ఆ సమయంలో బ్రహ్మ కళత్రమైన (్భర్య) సరస్వతీ దేవి ప్రాణవిభుడైన బ్రహ్మను సేవించడానికి కొలువుకూటానికి వచ్చింది. వచ్చిన ఆ సరస్వతీ దేవి నవనవమైన లావణ్యశోభతో తళతళమను లావణ్యమంతమైన కాంతులతో ప్రకాశించే క్షీరజలం గల పాలసముద్రం లాగ ప్రకాశిస్తూ ఉంది. ఆమె శ్రేష్ఠమైన రత్నాలతో మెరిసే పాలకడలిలా సద్గుణరత్నాలతో ప్రకాశిస్తూ ఉంది. చంద్రబింబోదయం వలె విలసిల్లే ముఖసౌందర్యం గలిగి శోభతో విలసిల్లే క్షీరసాగరాన్ని పోలియుంది. గిరీంద్ర సదృశమైన స్తనాలు కలిగి గిరీంద్రాలు కలిగియుండే సుధాబ్ధి వలె అలరారింది.
- ఇంకావుంది...