డైలీ సీరియల్
అగస్త్యుని తపస్సు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అటుపిమ్మట గణేశ్వరుడు - భైరవుడు మొదలయిన దేవతలందరిని సేవించి వెనె్నల లేని చంద్రుడిలా గంగానదిచే సుందరంగా లేని ఈ పుణ్యప్రదేశం నాకు మిక్కిలి దుఃఖం కలిగిస్తూ ఉంది. ఈ పరమేశ్వరుని నుద్దేశించి ఇక్కడనే తపస్సు చేసి ఒక పుణ్యనదిని ప్రవహింపచేయాలి. దానికి నన్ను అనుగ్రహించండి’ అని అగస్త్యుడు భార్యాసహితుడై మునులముందు నిలిచి అభ్యర్థించి వారి సంపూర్ణా- నుమతిని పొందాడు. పొంది దక్షిణకైలాస పర్వతానికి నాలుగు యోజనాల దూరంలో నైరృతి దిక్కున గల ఒక మహాపర్వతాన్ని చేరుకొన్నాడు. (ఈ పర్వతానికే బ్రహ్మాచలమని పేరు. ఇచట అగస్త్యుడు తపమాచరించడం వల్ల అగస్త్యాచలమనే పేరు తరువాత ప్రసిద్ధమైంది. ఈ పర్వతం చంద్రగిరి సమీపంలోని తొండవాడలో ఉంది. ఆగస్త్యుడిచట ఒక లింగాన్ని కూడ స్థాపించాడు. అది అగస్త్యేశ్వర లింగంగా పేరు పొందింది).
ఆ ముని దంపతులా పర్వతాన్ని ఎక్కనారంభించారు. కాని భార్య లోపాముద్ర మాత్రమా కొండ నెక్కలేకపోయింది. అప్పుడుగస్త్యుడు ఆమెను దగ్గరగారమ్మని చేయూతనిచ్చి తోడ్కొని గిరిశిఖరాన్ని అధిరోహించాడు. అధిరోహించి ఆ కొండపై గల సెలయేళ్లలో స్నానాన్ని చేసి, నిత్య కర్మానుష్ఠాన్ని ఆచరించి ప్రీతికరమైన ఒక పుణ్యప్రదేశంలో సుఖాసనం వేసికొని తపస్సు చేయనారంభించాడు. ఆ సమయంలో ‘ఓ ఋషీశ్వరా! ఈశ్వరుని గూర్చి తపస్సు చేయుము. ఆయన కృపావిశేషంతో సంసార సాగరసంబంధమైన పాపాలకు శత్రువైన ఒకమహానది తప్పక ఇక్కడ పుట్టును గాక!’ అని అభీష్ట సిద్ధితో శుభసూచకంగా ఆకాశవాణి పలికింది. ఆ మాటల్ని విని ముని భయసందేహాల్ని వీడి జగదేక నాయకుడు, చంద్రశేఖరుడు, శ్లాఘనీయుడు, మన్మథాంతకుడు అయిన మహేశ్వరుడిని హృదయ పీఠంలో ఉంచికొని సాయంకాలం లోని అగ్నిస్వరూపుడై తపస్సు చేసాడు.
గ్రీష్మం - అగస్త్యుని తపస్సు
కొంతకాలం గడిచే సరికి వేసవి వచ్చింది. అది చాలా దారుణమైనది. దాని భరించజాలక స్ర్తిలు తమ కంచుకాల్ని (రవికెలు) విడిచి వేయాలని భావించారు. మానవులంతా చేత ధరించిన విసన కర్రల్ని విడువనే విడువరు. దక్షిణ దిక్కునుండి వీచే మలయవపనాలలో తిరగాలని ఉత్సాహపడుతూ ఉన్నారు. శ్వాసలు వేడెక్కిపోతున్నాయి. నేలపై చల్లిన నీటివల్ల చల్లదనం గాక భాష్పవాయువులే వెదజిమ్మబడుతున్నాయి. కొద్ది దూరం నడిచినా బాటసారులు అలసి పోతున్నారు. భార్య కౌగిలి కి కూడ ఆ వేసవితాపం అవరో ధానే్న కలిగిస్తూ ఉంది. అందరి కి శరీరాలనుండి చెమట పుట్టిస్తూ ఉంది. ఆ వేడిమి భరింపజాలక నింగి లోని పక్షులు నేలపై వాలిన చల్లగా నుండునేమోనని, నేలపై ఉండే జీవులు నీటిలో ఉంటే సుఖంగా ఉండునేమోనని, నీటిలో ఉండే జలచరాలు వేరే చోటకు పోతే సుఖంగా ఉంటామని భావిం చాయి. ఆ భయంకరమైన వేసవి తాపానికి నేలపై గల చెరువులన్ని ఇంకిపోయాయి. దావానలం చేత (అడవులలో వ్యాపించే అగ్ని) పర్వతాలు మండిపోతూ ఉన్నాయి. భూమండలమంతా ఇనుప పెనం మాదిరి కాలిపోతూ ఉంది. ఇక ఆ ఎండల తీవ్రత ఏమని వర్ణించగలం? బ్రహ్మాండాల చుట్టూ జలావరణమే లేకుంటే భూమండలమంతా మండి పోయి ఉండేది.
సూర్యుడా విధంగా వేసవిలో తన ప్రతాపాన్ని అన్నింటి మీద చూపిస్తున్నా అగస్త్యుని మీద మాత్రం చూపలేదు. ఎందుకంటే ఈయన దేవతాధిపతి పదవిని పొందిన నహుషచక్రవర్తినే పాము కమ్మని శపించినవాడు. నింగి కెగసిన వింధ్యాచలశిఖరాల్ని నేలమట్టం చేసింది ఈ మహామునియే. బడబాగ్ని జ్వాలలకు కూడ ఇంకిపోవని సముద్రజలాల్ని ఆపోసనం పట్టి వేసింది కూడ ఈ ముని వీరుడే. దుష్టులు - వంచకులైన వాతాపి - ఇల్వలులనే రాక్షసుల్ని సహితం అన్నసూక్తం పఠిస్తూ విందారగించిన మహాశక్తిమంతుడీయనయే. కాబట్టి ఈయన గొడవ నాకేల? అని సూర్యుడు భయపడ్డాడో లేక ఎండ తనకు తాకని ఆతపస్తంభనవిద్య నేర్చుకొన్నాడో ఏమో. కాకుంటే వేసవిలో ఆ తీవ్రమైన ఎండకు ఎవరు తాళగలరు. అందుకే అగస్త్యముని ఆ మండువేసవిలో కూడ ప్రశాంతచిత్తుడై తపస్సు నిర్విఘ్నంగా ఆచరించాడు. అంతేకాదు ఆ వేసవి ఎండకు తోడుగా ఆ అగస్త్యుడు తన చుట్టూ పంచాగ్నుల నేర్పరచుకొని వాని మధ్యలో నిలిచి ఆ చండభానుణ్ణి కనులు విప్పి చూస్తూ - సూర్యకాంతులచేత తాను ప్రకాశమానుడై తపస్సు చేసాడు. ఆయన తీవ్రతపస్సును చూచి దిక్పాలకులు తమ పదవులకు గండమేర్పడుతుందే మోనని భయ పడసాగారు.
వర్షర్తువు - అగస్త్యుని తపస్సు
ఆ విధంగా గ్రీష్మర్తువు గడిచి వర్షర్తువు వచ్చింది. అగస్త్యుడు తపస్సు చేయడం చూచి వింధ్య పర్వతం మేరువుపైగల పూర్వవైరంతో నింగినంతా తన మహూన్నత శిఖరాలతో నింపి వేసాడో లేక సముద్రం తనను మ్రింగి శత్రువైన అగస్త్యుడు చిక్కాడు ఇక ఈయన్ను ఓడిస్తానని దండెత్తి వచ్చాడో లేక తమను రూపుమాపే సూర్యుణ్ణి అంతమొందించాలని చీకట్లు ముసురుకొని వచ్చాయే ఏమో అన్నట్లు కాలమేఘాలు వ్యాపించాయి.
ప్రతి మేఘంలో మెరుపులు పుట్టాయి. ప్రతి మెరుపులో ఉరుములు పుట్టాయి. ప్రతి ఉరుములో నుండి పిడుగులు పడ్డాయి. అంతకంటే వర్షం అధికమయ్యింది. ఆ సమయంలో ప్రళయకాలంలో పుట్టే పుష్కలావర్తకాది మేఘాలు కురిసే వర్షమో, లేక భూమికి కప్పుగా నున్న పైలోకం ఉరుములచే ముక్కలు కావడం చేత కురిసే లోకావరణంలో ఉన్న జలమో, లేక భయంకర సూర్యకిరణాలు జలరూపాన్ని ధరించి ఈ భూమండలాన్ని ఆక్రమించాయో, లేక నేలపై పారడానికి దేవతలు గంగానది నుండి తీసిన కాల్వలేమో లేదా గాలి- నింగి- నేల-నిప్పు-జలరూపాన్ని ధరించాయో అనే రీతిగా వర్షాలు కురిసాయి.
- ఇంకావుంది...