డైలీ సీరియల్

శివశరణం భవహరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కానీ నీ చనుకొండల సందుల్లో దారి తెన్ను తెలియక తిరిగే నా మనస్సు అనే బాటసారి దాహాన్ని నీవు తీర్చగలవా?’’ అని అన్నాడు. ఆయన మాటల్ని విని ఆ కాంతామణి ‘ప్రభూ! నీ మనసునకు నచ్చిన విధంగా నీ కోరిక తీరుస్తాను. వేరుమాటలేల? మీ తలంపే నా భాగ్యం కదా!’ అని వినయపూర్వకంగా పలికి ముందు నడువ సాగింది. ఆమె వెంట లింగమూర్తి నడువసాగాడు. ఆ దృశ్యం చూచే వారికి వెనె్నల వెంట నడిచే చంద్రరేఖలా తోచి అమితాశ్చర్యాన్ని కలిగించింది. ఆ విధంగా శ్రీకంఠుడు వివిధభోగవస్తువులతో సుందరమైన ఆమె గృహానికి చేరుకొన్నాడు. చేరుకొని ఆ జలజాక్షి భక్తిపూర్వకంగా చేసిన పూజలనందుకొన్నాడు. తదుపరి మోమున చిరునవ్వు లొలికిస్తూ ఆ నటరాజమూర్తి రతిక్రీడకు సంజ్ఞ చేసాడు. అంతకు ముందే మన్మథుని పూలబాణలబారిన పడ్డ ఆ లలితాంగి ఆ కపటలింగమూర్తిని ఒక ఏకాంతగృహానికి తోడ్కొని పోయి పూలపాన్పుపై మేను వాల్చింది.
అప్పుడా ఇరువురు వివిధ శృంగారప్రసంగాలతో అర్ధనిమీలిత నేత్రాలతో ఒకరినొకరు ముద్దులలో తేలిపోతూ పరవశులై తీయని ఊసులాడుకొంటూ ఒకరినొకరు కౌగిళ్లను వీడక రతిక్రీడల్లో తేలియాడి- పోయారు. మన్మథకళా స్థానాల్ని ఒకరినొకరు స్పృశించుకొంటూ పులకితగాత్రులయ్యారు. కలకండవలె మధురానుభూతి కలుగుతూ ఉండగా పరస్పరం జిహ్వాచుంబనాలలో (నాలుకతోనాకుట) పరవశమై- పోయారు. ఏ రీతిగా పలికినా అమృతరససారమై చవులూ రిస్తుండగా ఇరువురు ఊసులాడుకొన్నారు. ఏభంగిమలో నిలిచినా చక్కదనాలరాశులై ఒకరి నొకరు కవ్వించుకోసాగారు. మరుని సయ్యాటలో జరిగిన తొట్రుపాటులే వివిధ శృంగారవిలాసాలై ఒకరిపై నొకరు కుతూహలాన్ని పెంచుకొన్నారు.
రాజు దాసిని శిక్షించుట
ఈ విధంగా మిండజంగంతో రతిక్రీడల్లో తేలిపోయిన ఆమె ఆ కాళహస్తిపట్టణాన్ని పాలించే యాదవ భూపాలుడు భోజనం చేసే సమయంలో ప్రతిదినం భోజనపాత్రను సిద్ధంచేసే ఒక నిత్యోద్యోగిని, ఆ నాడామె తన విధిని మరచి ఆ విధంగా శివయోగిని కూడి రతిపరవశురాలయింది. యాదవరాజు ఆ రీతిగా తన విధిని మరచిన దాసిపై కినిసి ఆమెను వెంటనే తన వద్దకు తీసికొని రండని రక్షకభటుల్ని పంపాడు. ఆ రీతిగా ఒక వనితను బంధించడానికి పలువురు రాజభటులు వచ్చి పిలువగా ఆమె అదిరిపడి భయపడుతూ లేచింది. భయం ఆమెను రాజుకడకు కొనిపోవడానికి లాగుతుండగా ఆమె ప్రేమ ఆ మాయాజంగమముని వద్దకు లాగింది. మరల రాజభటులు ఆమెను తీసికొనిపోవడానికి లాగుతుండగా ఆమె తొందర తొందరగ ఒంటిచేతితో జుట్టు ముడివేసుకొంది. మరొకచేతితో చీరసరిగా కట్టుకొంది. మెడలో హారాలు చిక్కుపడిపోయాయి. నిద్రలేని కలువ కళ్లు అప్పుడే తేరుకొంటూ ఉన్నాయి. తీగలాంటి ఒడలు వడలిపోయి యుంది. దంతక్షతాల చేత ఆమె పెదవులు పగడాలద్దినట్లు మెరుస్తున్నాయి. పిఱుదుల బరువుతో కాళ్లు తడబడుతూ ఉన్నాయి. స్తనభారం చేత సన్నని నడుమూగిసలాడిపోతూ ఉంది. కలతపడి కూడ కలతపడని విధంగా దిటువు తెచ్చుకొన్న మనస్సుతో శ్రీకాళహస్తీశ్వరుని నీవే దిక్కని ప్రార్థిస్తూంది. చంద్రుని ముందు వెలవెలబోయే పద్మంలా తెల్లబోతూ నిట్టూర్పులు విడుస్తూ రాజుముందర ఆ అంభోజవదన నిలబడింది.
ఆమెను చూచి ఆ యాదవ భూపాలుడు నిష్ఠూరాలాడి దేవతల మనస్సును కూడ భ్రమింపచేయగల ఆమె సౌందర్యానికి భంగపాటు కలుగుతుందని కొంచెం కూడ ఆలోచించకుండ తలను గొరిగించండని ఆజ్ఞాపించాడు. రాజులు సేవకుల తప్పు నొక్క దానిని కూడ క్షమింపని చండశాసనులు కదా మరి. రాజాజ్ఞానుసారం కేశవిహీన అయిన ఆ సుందరాంగి మబ్బును వీడిన మెఱుపు వలె - తుమ్మెదలు వీడిపోయిన సుందరపూలతవలె కళా విహీనమై, సిగ్గుతో చలించిపోతూ వచ్చి జంగమ దేవరచరణాల మీద వాలిపోయింది. ఆ రీతిగా రాతిగుండెతో తనను శిక్షించిన యాదవేంద్రుని నిందిస్తూ కనుకొలకుల నుండి బొటబొట కన్నీరు కారుతూ ఉండగా కుచభారం చేత నేలకంటని తనువల్లికను వంచి దైవాన్ని స్మరిస్తూ పంచమస్వర విశేషంతో పలికే మదకోకిల వలె మధురంగా ఆమె విలపించింది.
దాసిని శివుడనుగ్రహించుట
అప్పుడు లోకైకవిభుడైన ఆ మహాదేవుడు (శివుడు) భక్తజనుల ముంగిట కల్పకపారిజాతం కావున ‘ఓ’ అంటూ దాసి చేసిన విలాపానే్న ఓం కారోచ్చారణంగా తలంచాడు. జలజల రాలు కన్నీటి ధారనే అభిషేకజలంగా స్వీకరించాడు. ఆమె నిడువాలు కళ్లనే సమర్పింపబడిన నీలోత్పలాలుగా గ్రహించాడు. ముక్కుపుటల నుండి వెలువడే వేడి నిట్టూర్పులనే ధూపగంధంగా ఆఘ్రాణించాడు. ధవళకాంతులచే ప్రకాశించే ఆమె దంతకాంతులే వెలిగించిన దీపావళిగా (దీపాలవరుస) ఆనందించాడు. దొండపండును బోలిన ఆమె అధరోష్ఠానే్న తన కర్పింపబడిన అమృతతుల్యమైన ఉపాహారంగా ఆరగించాడు. పాదాలమీద పడుటయే ఆమె చేసిన సాష్టాంగ దండప్రణామంగా భావించాడు. ఆరీతిగా సంప్రీతుడైన ఈ సర్వజ్ఞమూర్తి (శివుడు) ‘అలివేణీ! ఏల ఏడ్చెదవు? ఇక మానుము’ అని ఆదరంగా దాసి తలనిమిరాడు.
ఏమి అద్భుతమో గాని అది ఇంద్రజాలికుడు ఎత్తి పట్టుకొన్న నెమలిపింఛమో! మన్మథుని పూవింటికి వింటి త్రాడుగా అమరి మత్తెక్కి సంచరించే తుమ్మెదల సమూహమో !! శివుడు మన్మద రాజ్యలక్ష్మి అయిన ఆమెకు అభిషేకం చేయడానికి ఎత్తియిచ్చిన నల్లని ఇంద్రనీలమణుల పూర్ణకుంభ ప్రకాశమో !!!.
- ఇంకావుంది...

చరవాణి: 9490620512