డైలీ సీరియల్

దూతికా విజయం-88

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంతసేపూ వీరభద్రుడు వేళ్ళ సందుల్లోంచి సరస్వతి పడే అవస్థంతా చూస్తూనే ఉన్నాడు. అతను చూస్తూన్న విషయం కూడా ఆమెకు తెలిసే ఊరుకున్నది.
‘‘నేను రానా?’’
‘‘అక్కర్లా!’’ అన్నది సరస్వతి రోషాన్ని నటిస్తూ.
‘‘సరే- నువ్వే నా దగ్గరికి రా.. ఆ ముడి నేను వేస్తానురా!’’
‘‘గొప్ప పని చేస్తారు!’’ అని ఆమె ఎత్త్తి పొడిచింది.
‘‘నీ కర్మకు నేనేం చేస్తానూ? నీ అవస్థ నీవు పడు’’
మరికొంచెం సేపు సరస్వతి తంటాలు పడింది కాని ముడి పడలేదు.
వీరభద్రుడు నవ్వి ‘బల ప్రయోగం కావాలి సుకుమారీ! నీవల్ల కాదు.. నా దగ్గరికి రా- అంతా సరిజేస్తాను!’’ అన్నాడు.
ఆమె రుసరుసలాడుతూ వీరభద్రుని ఎదుటికొచ్చి నిలబడింది.
వీరభద్రుడు కూడా లేచి నిలబడి రవికె ముడివేస్తాడని ఆమె అనుకున్నది. కాని అతను లేవకుండానే ఆమెను తన వొళ్ళోకి లాక్కున్నాడు. రవికె రెండు కొనలనూ పట్టుకుని గట్టిగా గుంజాడు. నాలుగైదు కుట్లు టపటపతెగినివి.
‘‘కుట్లు తెగిపోతున్నాయ్! ఎంత బాగా కుట్టారండీ!’’ అన్నది సరస్వతి ఆతృత వెల్లడిస్తూ.
‘‘అన్నీ తెగవులే- నీవు కదలకు’’ అని బిగలాడి మొత్తంమీద ఒక పీట ముడి వేయగలిగాడు.
‘‘అబ్బ బిగుసుకుపోతోంది. ఊపిరాడదేమో!’’ అన్నది సరస్వతి లేచి నిలబడుతూ.
‘‘ఓర్చుకో.. ఏం చేస్తాం? రాణి వాసానికి వెళ్ళగానే రవికె మార్చుకోవచ్చులే!’’
‘‘మంచి ఉచిత సలహాలు చెపుతున్నారే!.. ఇంత అల్లరిముఖం అని తెలిస్తే మరో జత బట్టలన్నా వెంట పెట్టుకొని వొచ్చి ఉండేదాన్ని!’
‘‘ఈసారి వచ్చేప్పుడు, ఎందుకైనా మంచిది ఒక పెట్టెడు బట్టలు తెచ్చుకొని, ఇక్కడ ఉండు. వానలో తడిసినా, లేక కామ రంగంలో చిరిగినా పనికొస్తవి!’’
‘‘ఈసారి ఇలాటి అల్లరి పనులు చేస్తే కండలు ఊడిపడేట్లు పీక్కపోతే నా పేరు సరస్వతి కాదు!’’ అన్నదామె ప్రతిజ్ఞ పెట్టే ధోరణిలో.
‘‘చూద్దాం!’’ అన్నాడు వీరభద్రుడు నిర్లక్ష్యంగా. ‘‘ఎందుకైనా మంచిది బట్టలు తెచ్చుకోవడం మాత్రం మరిచిపోకు’
‘‘ఇంకా నయం ఇక్కడే కాపరం పెట్టమన్నారుకాదు!’’
‘‘ఇక్కడ కాపరం పెట్టడం మొదలైంది. ఇప్పుడిప్పుడే మార్చలేం సరూ! పగలు అక్కడ విధి నిర్వహణ కానీ.. రాత్రులు మాత్రం వస్తూండు ప్రస్తుతానికి!’’ అన్నాడు వీరభద్రుడు.
‘‘అబ్బ! ఎంత ఆశండి మీకు! ఉచితంగా లభ్యమైంది కదాని, రోజూ రావాలా?’’
‘‘ఉచితమైన పనులు చేయకూడదని ధర్మశాస్త్రాలు చెపుతున్నవా?’’ అని వీరభద్రుడు ఎదురు సవాలు చేశాడు.
‘ఉచితం’ అనే పదానికి రెండో అర్థాన్ని ప్రయోగించాడు వీరభద్రుడు అనే విషయాన్ని ఆమె గ్రహించింది.
‘‘ఇది ఉచితమైన పనేనా?’’
‘‘కాదా? నా భార్యతో కాపరం చేయటం అనుచితమా? నాకు తెలియదులే!’’
‘‘మనిద్దరికీ దాంపత్యం ఏమిటండీ! చదువుకున్నవారు పండితులు కూడాను! ధర్మశాస్త్రాలు బాగా తెలిసిన బ్రాహ్మణులు మీరు. నేను క్షత్రియ కన్యను..’’
వీరభద్రుడు ఆమె మాటకు అడ్డుపడి ‘‘ఇంకా కన్యనే అనుకుంటున్నావా పిచ్చి సరూ!’’ అన్నాడు.
ఆమె కొంచెం సిగ్గుపడి ‘‘పోనీండి క్షత్రియ వనితను. మనకీ కులభేదాలు అడ్డు ఉండగా దంపతులమయ్యేందుకు ఏ ధర్మశాస్త్రాలు అంగీకరిస్తవి?’’ అన్నది.
‘‘అలా అడుగు చెపుతాను. మన్మథ సామ్రాజ్యంలో ఇన్ని మతాలు, కులాలు లేవు. రెండే రెండు జాతులు ఆడా, మగాను. ఆ రెండు జాతుల కలయికకే ఆ అనంగుడు పుష్పాస్త్రాలను ఎల్లప్పుడూ ప్రయోగిస్తూనే ఉంటాడు. విజయాన్ని సాధిస్తూనే ఉంటాడు. పూ విలుకాని ధర్మశాస్త్రానుసారంగా మన దాంపత్యానికి ఎలాంటి ఆక్షేపణా ఉండబోదు!’’
‘‘గొప్ప ధర్మసందేహాన్ని మీకు వీలుగా, వాటంగా ఉండేట్లు వివరించి పరిష్కరించారు.. మరి మీ బ్రాహ్మణ్యం ఏం కావాలి స్వామీ?’’
‘‘అది ఉండనీ, ఊడనీ.. నాకు లెక్కలేదు. నాకు కావలసింది నీవు, నీకోసం దేన్నయినా సరే వదులుకునేందుకు సిద్దంగా ఉన్నాను’’
‘‘నిజంగానా?’’
‘‘కావాలంటే పరీక్షించుకోవచ్చు’’ అన్నాడు వీరభద్రుడు, తన సంసిద్ధతను తెలియజేస్తూ.
తన రాణి విషయాన్ని ప్రస్తావించేందుకు ఇదొక సదవకాశమని సరస్వతికి తోచి ‘‘అయితే నేను చెప్పినట్లు వింటారా?’’ అన్నది.
‘‘చెప్పు.. చూస్తాను!’’ అని వీరభద్రుడు చప్పరించాడు.
తన మనసులోని మాటను వీరభద్రుడు ముందుగానే గ్రహించాడేమోననే అనుమానం ఆమెకు కలిగింది. అయినా చెప్పి ఒప్పించటం తనవిధి కదా! చల్లకువచ్చి ముంత దాయటమెందుకు? ఎంతసేపు దాచి మురిపించి, మరిపించగలదు? అందుకని అసలు సంగతి చెప్పక తప్పదు!’’
‘‘మీరు మా రాణి కోర్కెను తీర్చాలి’’
వీరభద్రుడు మొహం చిట్లించాడు.
‘‘ఈ తతంగానికి వెనుక నిజంగానే రాణి ఉన్నదన్నమాట!’’
‘‘నేను అబద్ధమాడుతున్నాననుకున్నారా?’’
‘‘అదికాదు.. నీవే రాణిని అడ్డం పెట్టుకొని వచ్చావనే మొదటి నుంచీ గాఢంగా నమ్ముతున్నాను’’.
‘‘అందుకనా ఇంత అల్లరిగా ప్రవర్తించింది! ఏమండీ రాణి కనుకనే రెండొందల బంగారునాణాలబహుమతిని మీకు పంపింది’’-
‘‘అందులో నీ కొంగున కట్టిన ఒకటి తగ్గించు!’’
సరస్వతి చిరునవ్వుతో జవాబుచెప్పింది.
‘‘అలాగే అనుకోండి.. నైతే మీకు అంత గొప్ప బహుమతి ఇవ్వగలనా అని కూడా మీరు ఎందుకు ఆలోచించలేదు?’’
‘‘సరూ! నీవిచ్చిన బహుమతి రాణి పంపిన బుహుమతికన్నా వేయి రెట్లెక్కువ. కావాలంటే రాణి బహూకరణను తిరస్కరించానని చెప్పి, ఆ మూటను ఆమెకు తిరిగి ఇచ్చేసేయ్!’’ అన్నాడు వీరభద్రుడు.
ఇతని ప్రణయం ఇంత అచంచలంగా ఉండటం సరస్వతికి గొంతులో వెలక్కాయపడినట్లనిపించింది.
‘‘అపచారం! రాజాగ్రహాన్ని కొని తేకండి.. రాణి తాను ఇచ్చింది తిరిగి తీసుకుంటుందా యేం?.. నా మాటకు సూటైన జవాబు చెప్పలేదు. మా రాణి రతీదేవికి అపర రూపం.. ఆమె రసికత్వం అద్భుతం! మీ చిలిపి చేష్టలన్నీఆమెభరించగలదు..’’
సరస్వతికి మాట మధ్యలోనే వీరభద్రుడు అడ్డుపడ్డాడు.
‘‘అదంతా నాకు అనవసరం సరూ! చేతికి చిక్కిన ఒక పక్షిని వొదిలేసి ముళ్ళపొదల మధ్యలో వున్న పది పక్షుల కోసం ప్రయత్నించే మూర్ఖుణ్ణనుకున్నవా?’’
‘‘అయితే నేను పక్షినా?’’ అన్నది సరస్వతి కోపాన్ని నటిస్తూ.
‘‘ఔను.. ప్రేమ పక్షివి’’
‘‘మరి మీరో?’’
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు