డైలీ సీరియల్

దూతికా విజయం-75

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రక్షక భటుల ఎదుట తనను భార్యగా ఒప్పుకున్నాడు కనుక; ఇప్పుడు బహిరంగంగా మాత్రం కాదనడు. పోతే, తన పట్ల అతనికి అసహ్యం పేరుకొనిపోయి ఉన్నట్లయితే దొడ్డిదోవలో తనకు ఉద్వాసన చెప్పి పీడ విరగడైందనుకుంటాడేమో? అలా జరిగితే తాను వచ్చిన పని సర్వనాశనమైనట్లే!
ఒకవేళ వీరభద్రునిలో కామాగ్ని ఈపాటికి చల్లారి దువ్వకట్టి ఉంటే; తాను ఊది ఆ నివురు వదలకొట్టి నిప్పును పైకి లాగాలి. ఈసారి వీరభద్రుడు కల్పించుకునేదాకా కూడా వేచి ఉండటం అంత మంచిది కాదు. తానే ఎదురుదాడిని ఆరంభించి, క్రియారూపాన తన సర్వేంద్రియాల సర్వాంగీకారాన్ని బేషరతుగా అతనికి తెలియజేయాలి.
వీరభద్రుడు ఈసారి తనను విసర్జిస్తే జీవితమే విసర్జించినట్లు లెక్క. కొద్దిసేపటి క్రితమే పరిచయమైన వ్యక్తికీ, జీవితానికీ ఇంత అవినాభావ సంబంధం ఇంత స్వల్ప వ్యవధిలో జరగటం చిత్రాతి చిత్రమే మరి!
ఈ దాడిలో మొదటినుంచీ తాను తగినంతగా నిరోధిస్తూనే వున్నది. రమ్మనగానే వచ్చి పొమ్మనగానే పోయే పడతిమీద ఏ పురుషునికీ వాంఛ ఉండదు. కాని మొండికెత్తి లొంగనిదాన్ని లొంగదీసుకోవటమే తన పురుషత్వానికో విజయ చిహ్నమని భావించే పురుషుడు అంత త్వరగా విముఖుడవలేడు. అదీగాక ఇప్పుడు ఏర్పడిన పరిస్థితులన్నీ వీరభద్రునికే ఎంతో అనుకూలంగా వుంటే సుముఖుడే అవుతాడు కదా!
విరుద్ధమైన గుణగణాలనూ, తత్వాలనూ కరిగి మూసవోయందే ఏ ఒక్కటీ తనకు తానుగా రాణించకుండా ప్రకృతే తగిన కట్టుదిట్టాన్ని చేసింది. కుసుమ కోమలమైన స్ర్తి శరీరానికి మొరటుగా వుండే పురుషకాయాన్ని జోడించటమే ప్రకృతి నిర్దేశించి చండప్రచండంగా అమలు జరుపుతోంది.
ఈ సంఘర్షణలో స్ర్తి శరీర సౌకుమార్యం గాయపడాలి మరి! అలా కాకుండా అది మెరుగులు దిద్దుకునే ఏర్పాటుచేసింది! పైపొరలు తొలగిపోగా వింత కాంతితో స్ర్తిత్వం నలుదిశలా ప్రజ్వరిల్లేట్లు చేసింది!
గనిలోనుంచి ఇప్పటికే వెలికితీసిన రత్నంలాటి స్ర్తి శరీరాన్ని పురుషుడు సానబెడితేనే కాని ఆ పైనున్న మలినాలన్నీ తొలగిపోయి దివ్యకాంతులీనవలసిన సిద్ధాంతాన్నీ ప్రకృతే ఆజ్ఞాపించింది. వైవిధ్యంలో వైరుధ్యం ఉన్నా, కలయికలో కరిగిపోయి ఒకదానిలో మరోటి లీనమైపోతూన్నవి కదా!
మెతక లోహమైన బంగారంలో, ప్రపంచంలోకెల్లా కఠిన పదార్థంగా వున్న వజ్రం పొదగబడినప్పుడే కదా ఒకదాని శోభను మరొకటి ద్విగుణీకృతం చేయగలుగుతూన్నది. ఈ విధంగా విరుద్ధ ధ్రువాల మధ్య అత్యంతాకర్షణను సృష్టించి ప్రకృతి తన సృష్టిని విధి విరామం లేకుండా కొనసాగించుకుంటూనే వున్నది! ప్రకృతి ప్రసాదించిన ఈ వరాన్ని ఉపయోగించుకోలేకపోవటం వ్ఢ్యౌమే అవుతుంది మరి. ప్రకృతి ఏర్పరచిన రాజబాట ఉండగా, దారి లేదని వాపోతూ కీకారణ్యంలో ఇరుక్కునిపోయి నానా అవస్థా పడటం దేనికి?
ఆ దివ్యానుభూతిని తలచుకుంటుంటే శరీరం పులకలెత్తుతూన్నది. ఐతే వీరభద్రుణ్ని కామభూతమే ఆవహించినట్లు తాను అర్థం చేసుకున్నది.
అలాంటి వ్యక్తితో‘మానవుడు - మానవి’ అనే అంతస్తులో పోరాట సాగించటం కుదురుతుందా? తనక్కూడా అమానుష శక్తులు కాకపోయినా, ఆ మహోద్రేకం ఆవేశించి, తనను కూడా కామినీ భూతమల్లే చేయందే ఈ వీరభద్రుని భరాయించగలదా? ఎంత నచ్చచెప్పుకున్నా తనకంత ఆవేశం అందుబాటులో వున్నట్లు తోచదు.
పోరాడి గెలువదలచినప్పుడు విరోధిని నిరాయుధుణ్ని చేయలేకపోతే, కనీసం పోలికలున్న ఆయుధాన్నన్నా ఎన్నుకోవాలి కదా! లేదా చేతనున్న ఆయుధానికే తగినంత పదునుపెట్టందే, పరాజయం తప్పదు!
ఇదంతా ఎలా సాధ్యమో అయోమయంగా ఉన్నప్పటికీ- ఆమె లోక జ్ఞానం కొంతవరకూ విశదీకరించింది. ఈ సమరం సరసంగా, భోగతో రాణించాలంటే ఒకరినొకరు ఉద్రిక్తపరచుకోవలసి వుంటుంది. ముఖ్యంగా స్ర్తి కోరబడేది కనుక, పురుషుడే ఆమెను తన మట్టానికి తెచ్చుకొనే ప్రయత్నాలు చేస్తాడు. అసలు నిప్పుకణాలు రాలే వీరభద్రుని కౌగిలిలో కరిగిపోయాక, ఆ అగ్ని తనలో మండి నాల్కలు జాపనట్లయితే తన ఈ స్ర్తిత్వమే వ్యర్థమనుకోవలసి వుంటుంది!
ఎటుచూసినా దావానలం తనలో ప్రవేశించి ప్రజ్వరిల్లేందుకే పరిస్థితులన్నీ చాలా అనుకూలంగా వున్నవి. తాను దూర దూరాలకు జరగకుండా ఉంటే తనలో రగిలే అగ్నికి, వీరభద్రుడు ఆజ్యమై, ఇంధనాన్ని సరఫరాచేసి భగభగ మండించుకుంటాడనే నమ్మకం కలుగుతోందిప్పుడు.
ఈ ప్రపంచమే పాకుడురాళ్ళమయం. ఆ రాళ్ళమీద నడుస్తూ పడిపోకుండా కాపాడుకోవటమే గొప్ప! అలాంటిది ఇప్పుడు తన కాళ్ళు కూడా జారుడుగానే యారైనవి. ఆదర్శం క్రమంగా హరించుకొనిపోగా, గరుగ్గరుగ్గా వున్న పాదాలపై పొరలు వైదొలగి, మృదుత్వం బహిర్గతమైంది. పాకుడురాళ్ళమీద, జారే కాళ్ళతో నడవటమంటే వెనువెంటనే పతనానికి సిద్ధపడే ఉండాలి. తన స్వాధీనంలో లేని ఈ పతనంలో ఎక్కువగా గాయపడకుండా, కీళ్ళు కదిలిపోకుండా, ఎముకలు విరగకుండా కాస్త సుఖంగా ఉండే విధంగా నేల కరపటానికి మాత్రమే ప్రయత్నించాలి.
అదే అంతిమ పోరాటమైనట్లు, విజయమో, వీరస్వర్గమో అంతు తేలవలసిన అవసరం వున్నట్లూ ఆమెకు తోచింది. పమిటకొంగు నడుముచుట్టూ తిప్పి, బొడ్డున దోపి తాను సంసిద్ధురాలనయ్యానని ఆమె భావించింది.
తరువాత ఏం చేయాలో తెలుసుకోటం విజ్ఞత; ఎలా చేయాలా తేల్చుకోవటం కౌశలం; చేయటం వ్యక్తిత్వం. ఈ సూత్రాన్నిబట్టి అద్భుతంగా మారిన తన వ్యక్తిత్వంతో ఎదురుదాడికి తనను తాను సిద్ధం చేసుకున్నాననే విశ్వాసం కలిగింది.
తన వ్రతభంగానికి తలపెట్టిన కామధేవుని శక్తి సామర్థ్యాల ముందు తన అల్పత్వమే రుజూకావలసి వున్నది. పూవిలుడు విజయుడై మకరధ్వజాన్ని ప్రతిష్ఠించదలిచాడు. ఆ విజయ పతాక ప్రతిష్ఠకు పతాక విన్యాసం చేయటమే విధి నిర్ణయం. తాను పొందే ఆ తెలియని, తెలుసుకోవాలని ఉవ్విళ్ళూరే అమర సౌఖ్యాన్ని గూర్చిన తలపుల తంపర ఆమెను తన్మయత్వంలో ముంచివేసింది.
***
వీరభద్రుడు కొత్త ఉత్సాహంతో తలుపు మూసిన చప్పుడు ఆమె కర్ణపుటాలను తాకినప్పుడు, సరస్వతి తన్మయత్వం నుంచి ప్రస్తుతంలోకి దూకింది.
వీరభద్రుడు ఒక్కసారి సూటిగా చూసి, సరస్వతి అక్కడ కనిపించక పోయేటప్పటకి చుట్టూ కలియజూసి వాకిలి మూల నక్కి ఉన్నట్లు గ్రహించింది.
ఈ అనవసరపు రభసను పొడిగించడంవల్ల తాను ఏమీ సాధించలేక, వృథా కాలయాపన అవుతుంది కనుక, తను అన్ని కోణాల నుంచీ తీవ్రంగా ఆలోచించి చేసుకున్న నిర్ణయాన్ని అమలుజరిపేందుకు సరస్వతి నిశ్చయించుకొని సంసిద్ధ ఐనది.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు