డైలీ సీరియల్

దూతికా విజయం-63

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరభద్రుని చేతుల్లో చాతుర్యం తక్కువనే విషయం తెలిసిపోయిందామెకు. ఆడవాళ్ళ ముడులు, ఇష్టపడి స్ర్తిలు విప్పవలసిందేకాని, పురుషునివల్ల అయే పనికాదని త్వరలోనే అతను తెలుసుకొని, మరింత చిరాకుతో గమ్యాన్ని జేరలేక దిక్కుతోచని పక్షివలె ఆ ప్రదేశమంతా తచ్చాడుతూ, మరీ ముందుకు సాగలేని నిస్సహాయ స్థితిలో పడ్డాడు.
‘‘నన్నొక మాట చెప్పనివ్వండి’’ అన్నదామె మృదువుగా.
‘‘కాస్సేపు మాట్లాడకు.. ఆ తరువాత తెల్లారేవరకూ తీరిగ్గా మాట్లాడుకుందాంగా!’’ అన్నాడు వీరభద్రుడు, ఆతృతకు ఆగలేక వేగిపోతున్నవానివలె.
‘‘అదికాదు- నేనెవరిననుకుంటున్నారు?’’
‘‘సరస్వతినని చెప్పావుగా! స్ర్తివి! చాలా అందగత్తెవు. మొదటి చూపులోనే ప్రణయసాగరంలో నన్ను మొదటిసారిగా తల్లకిందుగా పడేసిన పడతివి! మన్మథుని నిశిత శరాలు తరముకొనిరాగా నా పాలపడి శరణువేడిన సరస సల్లాపాలాడేందుకు వచ్చిన సారంగివి. నిన్ను పొగిడేందుకు తగిన కవిత్వం నాకు రావటంలేదు. అందునా ఈ స్థితిలో మాటలెందుకు? కాస్త ఓపిక పడితే నీ రూప రేఖా లావణ్యాలతోపాటు నీ రసికకత్వాన్ని కూడా జోడించి రసమయ కవిత్వం చెప్పేందుకు ప్రయత్నిస్తాను?’’
తనను జవాబు చెప్పనీయకుండా ఊపిరాడనంత బలంగా ముద్దు పెట్టుకున్నాడు.
సరస్వతికి కంపరంగా ఉన్నది. తాను కోరని అనుభవం ఇది. పురుష ప్రపంచంమీద వుండే జుగుప్స అంతా వెళ్ళక్క్రాలనుకుంటుంది. చాలా అసహ్యకరమైన ఇరకాటంలో పడింది. ఎలా నచ్చచెప్పి తప్పించుకోవాలో అర్థంకాని తికమక. చిరాకు వేధిస్తూన్నవి.
ఇది మహా ప్రమాదకరమైనదిగా పరిణమిస్తోంది. కౌశలంతో సాధించలేనివారికి ప్రమాదాలుగా ఉండేవి. ఆ చాకచక్యాన్ని ప్రయోగించగలిగితే వారికి సురక్షితంగానే రూపొందుతవి. ఆ కౌశలం ఏమిటనేది తానిప్పుడు ఊహించి సక్రమంగా అమలు జరపాలని సరస్వతి నిశ్చయించుకున్నది.
ప్రణయం పాకాన పడుతున్నట్లు వీరభద్రుడు భావిస్తూంటే, శృతిమించి రాగాన పడుతోందని సరస్వతి గ్రహించింది. మంచి మాటలు పనిచేసే పరిస్థితి కాదు కనుక, కఠినమైన మాటలూ, దూషణ వాక్యాలూ ప్రయోగించి తన నిరాకరణను సూటిగా, ఘాటుగా, వాడిగా, వేడిగా తెలియపరచాలని నిశ్చయించుకున్నదామె.
మెల్లిగా చేతులు వీరభద్రుని పట్టు నుంచి విడిపించుకున్నది. క్రమంగా వాటిని వీరభద్రుని మెడకు మెలేసింది. ప్రియురాలిలో రాగోదయమై రాగ ప్రదర్శన ఆరంభమైనదని వీరభద్రుడు పట్టు కాస్త సడలించాడు. దానంతటదే పైపైకి పాకే లతను నిరోధించటమెందుకు? తనకు తెలిసిన పట్టు విడుపులూ, చాతుర్యాలూ కామకళలనూ ప్రదర్శించేందుకు కామిని సిద్ధపడిందనుకున్నాడు.
అతని మెడ మీదికి సాగిన చేతుల్ని మెడమీద మెలేసి వాడిగా వున్న గోళ్ళకు అతని మెడలోని మాంసపు రుచిని చూసే అవకాశాన్ని కలిగించిందామెకు. అంతలావు మనిషీ ఆ రక్కుతో కీచుమన్నాడు. అందినచోటల్లా కొరికింది. రాక్షసివలె మారిన రమణి- ఆడపులివలె మీదికి దూకటాన్ని అతను ఊహించలేదు. తత్తరపడి నోట మాటరాక- ఇంతలో ఇంత రసాభాస ఎలా ఐనదో తెలియక నిశే్చష్టుడయ్యాడు. తన పట్టు పూర్తిగా విడిపోయిన విషయం కూడా తెలియలేదతనికి.
ఒక్క దూకున సరస్వతి అల్లంత దూరాన పడింది. చెదిరిన దుస్తుల్ని సరిజేసుకున్నది. రేగిన ముంగురుల్ని గోళ్ళతో దిద్దింది. ఆమె ముఖమంతా జేవురించి కోపంతో ఎర్రబడింది.
‘‘నీవు మూర్ఖుడివి, అరసికుడివి. బాహుబలం ఉండగానే సరా? ఏనుగుకు లేదా బలం? కాని రాచకన్యపట్ల చూపే రసికత కానీ, సంస్కార ప్రవర్తన కానీ ఎక్కణ్నుంచి వస్తవి? నీలాటి మోటు మనుషులకా ప్రణయం? పుష్పబాణుని పుష్పాలలోని మృదుత్వం లేనిదే ప్రేమ రాణిస్తుందా? చీర చెరుగు చూడగానే మతిపొయ్యే మందభాగ్యుడివి, మందమతివి. మదంతో కన్ను కానక ఎవరు ఎవరనే విచక్షణాజ్ఞానమన్నా లేకుండా ప్రవర్తించే పశువువి. అందుకనే మగ పురుగులంటే నాకు మంట!’’ అన్నదామె ఉద్రిక్తంగా.
ఐన గాయాలను ఒక్కసారి పరిశీలించుకొని, ఆమె చివాట్లు నాలుగూ చెవిన వేసుకున్నాడు వీరభద్రుడు. ఇదీ ఒకరకం శృంగారమేమోననే సందేహం వచ్చింది కానీ ఎదురుగా వున్న మహాకాళీ స్వరూపాన్ని చూసేటప్పటికి నిజంగానే ఆమెను తాను అపార్థం చేసుకున్నానని తేల్చుకున్నాడు.
‘‘తరువాత?’’ అన్నాడతను, ఉద్రేకమంతా తగ్గిన ప్రశాంత చిత్తంతో.
‘‘నేను దూతికను. దూతకు ఎలాంటి హాని చేయరాదనే జ్ఞానమన్నా లేదు నీకు! నీకు అతిథిని. అతిథి సత్కారం ఎంత నేర్పుగా, మర్యాదగా చేశావో ఆలోచించు.. నా అందచందాలకే మూర్ఛబోతున్నావు, మా రాణి మాధవీదేవి భూలోక రంభ. ఆమె నిన్ను కోరి తాను నీచపడినా, నిన్ను ఎంత ఎత్తుకు తీసుకొని వెళ్ళిందో క్షణం ఆలోచించలేదు. రత్నాన్ని వదులుకొని రాయికోసం తహతహలాడిన అజ్ఞానివి!’’
మనసులోని భావానికి తనకు కలిగిన ద్వేషాన్ని కూడా జోడించి, ఎంతో తీవ్రంగా ఎదుటి వ్యక్తికి తనంటే అసహ్యం వేసే విధంగా మాట్లాడాననీ, ఇందువల్లనైనా తనను దూరాన ఉంచుతాడనీ, అప్పుడు అసలు విషయాన్ని వినేందుకు సిద్ధవౌతాడని సరస్వతి అంచనా. ఇంతకన్నా తక్కువ మాట్లాడితే ప్రయోజనం లేదని, ఈ ధోరణిని వీరభద్రుడు మరి పొడిగించకుండా ఆట కట్టించాననీ ఆమె నమ్మింది.
తాను ఆశించిన రోషం వీరభద్రునిలో కనిపించటంలేదు. పైపెచ్చు నవ్వుతున్నాడు. అది చూడగానే ఈ వింత వ్యక్తిత్వాన్ని తాను సరిగా కొలవలేదేమో ననిపించిందామెకు.
‘‘కామినీ భూతాలు ఉంటవంటారు. ఇదసలు దెయ్యాల కొంపట! అందమైన, ఆడదెయ్యం ఎప్పుడన్నా అందులోనూ
ఇలాటి వాన రాత్రి అందుబాటులోకి వస్తుందేమో, దాని అంతో, నా అంతో తేల్చుకుందామని ఉండేది. నీవు రాగానే నా కోరిక తీరిందని అనుకున్నాను. ఆడదెయ్యంలాగే రక్కావు; పీకావు; కొరికావు. బాధ కలిగినా నేను దీన్ని భరించగలిగిందేనని తేల్చుకున్నాను. ఇంతకన్నా అధికమైన గాయాలు చేయగలిగే శక్తి కూడా నీకు లేదని తేలిపోయింది. ఇంతమాత్రానికే లెక్కచేసేవాణ్ని కాదు. నీవే మొండి అనుకుంటున్నావేమో, నేను నీకన్నా శతమొండినని ఇప్పుడే రుజూచేస్తాను.. ఇక మీ రాణి అంటావా- ఇప్పుడిక్కడ లేదుగా! రేపు రాత్రి మీరిద్దరూ రండి- చూస్తాను. ఇపుడు నీవు నన్ను తప్పించుకొని పోలేవు. నా రసికత్వమేమిటో మీ రాణికి అనుభవపూర్వకంగా చెప్పవచ్చులే!’’
హుందాగా, ఠీవిగా, నిర్భయంగా వీరభద్రుడు ఆమె దగ్గరికి వచ్చి పిట్టను పట్టుకున్నట్లు పట్టుకున్నాడామెను. ఆమె నడుం చుట్టూ చేయివేసి గాలిలోకి లేపాడు. ఈసారి ఇరవై ఏళ్ళుగా కాపాడుకుంటున్న తన కన్యాత్వానికి భంగం కలిగితీరుతుందనే భయం ఆమెను వేధించింది.
ఈ మహాబలాఢ్యుణ్ణి, కామోద్రేకిని తాను శారీరకంగా నిరోధించటం అసంభవం. తనను వంటింటి కుందేటిని చేశాడు. మరేం చేయదలచుకున్నా అతన్ని అడ్డేవారు లేరు. తెలివిగా భయపెట్టి బైటపడాలనుకున్నది సరస్వతి.
గుంజుకుంటూ ‘‘జాగర్త- అరుస్తాను! నలుగురూ గుమికూడిదే నీ ఎముకలు విరగ్గొడతారు!’’ అన్నదామె.
ఒకపక్క తన పక్కటెముకలు ఫెళఫెళమంటవేమోననే భయం ఆమెను పీడిస్తోంది.
వీరభద్రునికి అసహ్యం వేసినట్లుంది. హఠాత్తుగా వదిలేశాడు.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు