డైలీ సీరియల్

దూతికా విజయం-62

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలాంటిదాన్ని తాను ప్రయోగించి, తనలోని లోతులను వీరభద్రుని గ్రహణశక్తికే వొదులుతే, అంతకన్నా పదునైన జిహ్వ ఎదురుసవాలుగా, తన లోతులను గమనించమంటూన్నది.
రాణి నాలుక కొనలోంచి వెలువడిన మాటలు ఆజ్ఞలై, నేర్పరి ఐన విలుకాడు వదలిన బాణమల్లే తనను విడుస్తే, తాను వచ్చి పడిన వేగాన్ని తేలిగ్గా నిరోధించగల ఈ మాటలు వీరభద్రుని నాలుక నుంచి వెలువడి ప్రతిఘటిస్తున్నవి!
తెలివితేటలమధ్య వాగ్యుద్ధమే ఆరంభమైంది. తన సమఉజ్జీని ఎదుర్కోవటం జరిగింది. కనుక తాను ప్రయోగించే మాటలుమరింత మెలకువగా ఉండాలని సరస్వతి మరోసారి తనకు తాను జ్ఞాపకం చేసుకున్నది.
వీరభద్రుని కుశాగ్రబుద్ధిని గమనించిందామె.
తరువాత సంభాషణక్రమానికి పెద్ద అడ్డంకి ఏర్పడినట్లయింది. ఐనా ఏదో ఒకచోట ఆరంభమై సాగితీరాలి కదా!
‘‘మరి..’’ అని ఆమె ఇంకా ఏమో చెప్పబోతోంది.
దృఢమైన వీరభద్రుని చేయి ఆమె మెడమీద వాలి- ఒక్క గుంజు గుంజుకుంది. ఆ ఊపులో ఆమె సరాసరి వీరభద్రుని ఊరుపు పీఠాన్ని అలంకరించింది.
క్షణంలో జరిగిపోయిన ఈ సంఘటనతో ఆమెకు దిమ్మ తిరిగింది. హఠాత్పరిణామాన్ని ఆకళింపు చేసుకునేందుకు ఒక్క క్షణం పట్టిందామెకు.
మృదువైన తన శరీరంమీద, కండలు తేరిన వీరభద్రుని కరకుకరాల ఒత్తిడి అధికవౌతోంది. ఏమిటి ఇతని ఉద్దేశం! ఒంటరిపాటున తనలాంటి కన్యను ఇలా బలాత్కరించేందుకు ఎంత సాహసం ఉండాలి!
‘ఏమిటిది- మీకేం మతిపోతోందా?’’ అన్నదామె అతని బంధంలోంచి తప్పించుకునేందుకు గింజుకుంటూ.
వీరభద్రుని పట్టు సడలలేదు సరికదా మరింత బిగిసింది. కాస్త అలుసిస్తే ఈ మగాళ్ళు నెత్తికెక్కుతారు కదా!
‘‘నీలాటి రూపవతి అయిన మగువను చూస్తే మతిపోవటంలో ఆశ్చర్యమేమిటి సరూ!’’
అప్పుడే తనకో ముద్దుపేరు రాణికి తప్ప మరెవ్వరికీ తెలియనిదాన్ని ఈ వీరభద్రుడు ఎలా ప్రయోగించాడో ఆమెకు తెలియలేదు. ‘సరూ!’ మాట వినటంతో సరస్వతి శరీరం గగుర్పొడిచింది.
‘‘ఏమిటీ మోటుతనం! వొదలండి. మగువ మనసు తెలుసుకునేపాటి ఓపిక కూడా తమకు లేదా?’’ అన్నదామె అసహ్యాన్ని ధ్వనింపజేస్తూ.
‘‘సరూ! నీవు చాలా తెలివిగలదానివని నేను గ్రహించాను. రాణి పేరిట ఆమె ప్రతినిధిగా వచ్చావు. ప్రవేశానికి పథకంవేశా- పారింది. పేరు సరస్వతి అని చెప్పావు.. నాపరంగా ‘బ్రహ్మ’ శబ్దాన్ని ముమ్మారు ప్రయోగించి నీకు భర్తృత్వాన్ని వహించవలసిన నా బాధ్యతను గుర్తుచేశావు.. నా విధి నిర్వహణకు నేను సిద్ధపడగానే అభ్యంతరాలు చెపుతున్నావు. నీలాంటి నెరజాణలకే చెల్లుతుందీ చిలిపితనం!’’
‘బ్రహ్మ’ శబ్దాన్ని తాను ప్రయోగించిన సందర్భమూ, భావమే వేరు. దాంతో వీరభద్రుడు పొంగిపోయి తనకు అనుకూలంగా తిప్పుకునే విధంగా తయారవుతాడని తాను గురి చూసింది. ఐతే వీరభద్రుడు తన మానసంలోనే లేని కొత్త అర్థాలు తీసి, ఆ పద ప్రయోగాలకు ఉప్పొంగి, వాటిని తనకు అనుకూలంగా తిప్పుకొని, ప్రత్యర్థిమీద తిప్పికొట్టేందుకు సిద్ధమయ్యాడు. తెలివితేటలు ఎవరి సొమ్ము?
ఈతరానివాడికి నీళ్ళే ఈత నేర్పుతాయి. లేదా ఈదటం చేతనైనా, నీళ్ళలో పడగానే సహజంగా తన కౌశలాన్ని చూపవలసిన సమయమాసన్నమైదనే జ్ఞాపకం కలిగితీరాలి.
అదేవిధంగా ఇప్పుడు ఎదురైన ఈ విషవలయం నుండి తప్పించుకునేందుకు సరస్వతి బుర్ర తీవ్రాతితీవ్రంగా పనిచేయసాగింది.
ఆలోచనకు మరికొంత వ్యవధి కావలా. ఈలోగా ఈ యమపాశం బిగుసుకోకుండా చూసుకోవాలి. ఏదో దొంగ ఎత్తుతో ఉపాయంగా అపాయం నుంచి తప్పించుకోవాలి.
నునుపైన పిరుదులను మెల్లిగా జారుస్తూ తప్పించుకోవాలని ప్రయత్నించిందామె. కాని అది గ్రహించిన వీరభద్రుడు ఆమెను అవలీలగా ఎత్తు, నకు వీలుగాను, వాటంగానూ, సుఖంగానూ, సరస్వతిని కుదురుగా కూర్చునేందుకు అనువుగానూ, ఒడిలోకి లాక్కొని, కదిలేందుకు ఈవలు లేకుండా రెండు చేతులతోనూ ఆమెను చుట్టిపారేశాడు.
మెడలో ఉరితాడు పడగానే ఏం చేయాలో తోచక గుంజుకుంటే అది మరింతగా బిగుసుకున్న పరిస్థితిలాటిది ఏర్పడిందని సరస్వతి గ్రహించింది. వీరభద్రుని వేళ్ళచివర్లనుంచి నిప్పుకణాలు రాలుతున్నవి. ఆ స్పర్శే చెబుతోంది- లోని అగ్నిపర్వతం పగిలి అగ్నిని వర్షించేందుకు సిద్ధంగా ఉన్నదని.
బలప్రయోగంతో తప్పించుకునేందుకు వీరభద్రుడు అతి బలశాలి కనుక, అది కుదరదు. ఆ విధంగా తాను లొంగిపోయే తీరాలి. తెలివితేటలు ఉపయోగించబోయి తనకన్నా నిశితంగా ఆలోచించగల వీరభద్రుని ముందు భంగపడింది; ఆ విధంగా చూసినా తనది కిందిచెయ్యే కనుక లొంగక తప్పదు. ఇక మిగిలింది యుక్తితో మోసంతో సాధించవచ్చునేమో చూడాలి!
తెకతెకలాడే వీరభద్రుని రక్తపువేడి ద్వారా ఎంత ఉద్రేకపడుతున్నాడో తెలుస్తూనే ఉన్నది. తాను ఏమి చెప్పినా వినే స్థితిలో ఉన్నట్లు తోచదు. తప్పించుకోవాలని ప్రయత్నించకుండా, లొంగిపోతున్నట్లు నటిస్తే ఈ పట్టు మరింతగా బిగవదు! బహుశా కాస్త సడలవచ్చు. సమయం చూసి ఈ ప్రమాదం నుంచి దూసుకోవాలి- ఇదీ సరస్వతి వేయదలచిన పాచిక!
అందుకని సరస్వతి ముందుగా వీరభద్రుని బాహువుల్లో ముడుచుకొని ఇమిడిపోయింది. బెట్టు చేయవలసిన మెట్టు దాటిందనే అభిప్రాయాన్ని విజయవంతంగా వీరభద్రునిలో నాటింది. తన శరీరంలోని ఏ అణువూ నిరోధించే ప్రయత్నం చేయటం లేదనే నమ్మకాన్ని వీరభద్రుని మొలకెత్తించింది, కొంచెం మెత్తబడి మోటుగా, ఘాటుగా తొక్కిపట్టిన చేతుల పట్టు తీవ్రత కాస్త తగ్గింది. ఊపిరే ఆడని స్థితి నుంచి కొంచెం గాలి పీల్చుకునే స్థితి ఏర్పడి, గుడ్డిలో మెల్లగా తోచింది సరస్వతికి.
తన హృదయేశ్వరి హృదయ స్పందన ఎలా వున్నదో తెలుసుకోవాలని కాబోలు వీరభద్రుని చేతులు పరిశోధన ఆరంభించినవి. క్షణక్షణానికీ మెట్టు మెట్టుగా తాను పతనం కావలసిన విషాద పరిస్థితి ఏర్పడుతున్నదనీ, త్వరగా విమోచన మార్గాన్ని అనే్వషించి బైటపడాలనీ సరస్వతి తనను తాను హెచ్చరించుకున్నది. ఐతే తాను ఎన్నడూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోచించని దుర్ఘటన ఇది. ప్రశాంతంగా ప్రవహించే నదిలోనికి దిగిన గజ ఈతకత్తె హఠాత్తుంగా సుడిగుండంలో పడినట్లయింది.
స్వప్నంలో ద్వారపాలకుడు తన వెంటపడటం, అతను పట్టుబట్టి తనను కోరి తీరుతాడనీ, తాను లొంగక తప్పదనీ, లొంగేందుక్కూడా సిద్ధపడందే కుదరదనీ ముందుగానే తాను అంతా సరిగ్గా ఊహించగలిగింది. తన ఊహలే నిజమైనది. కర్మకాలి సమకాలోం తాను అంగీకరించకుండటంవల్ల అదంతా బెడిసికొట్టింది.
ఇక ఇప్పుడు ఎలాటి హెచ్చరికా లేకుండా, కనీసం సూచనైనా కానరాకుండానే ఈ దారుణ పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. అందుకనే ఇంత తికమక! ఏం చేయాలో తోచని తొందరపాటు. ఆదిలోనే పడిన ఈ హంసపాదును ఎలా సమర్థించాలనే తహతహ! అనుకూలంగా ఉన్నదనుకొన్న వాతావరణమంతా ప్రతికూలంగా తయారవటంలో ఏర్పడిన నిరుత్సాహం.
ఇంత కలవరపాటులోనూ ఆమె నిలదొక్కుకొని, ఏ కాస్త సందు దొరికినా, దొరికేట్లు చేసుకున్నా, తప్పించుకోగలననే ధైర్యాన్ని మాత్రం విడనాడలేదు.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు