డైలీ సీరియల్

అద్వయ పరబ్రహ్మ పరమేశ్వరుడే( శివ పురాణం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివ పురాణం వ్యాసవిరచిత శివ మహాపురాణ సారం (వచనం)
అతడిని అరణ్యాలలో ఒంటెగా చరించమని అనాలో చితంగా శాప మిచ్చాడు. సాక్షాత్తూ రెండవ ఈశ్వరుడని పేరు పొందిన ఆ శివావతారుడి శాపం వెంటనే ఫలించింది. ఫలితం! ఒంటెగా మారాడు సనత్కుమారుడు.
తన కుమారుడి దుస్థితి బ్రహ్మ దేవుడికెంతో కష్టం కలిగించింది. తపస్సుతో పరమ శివుడిని మెప్పించి తన కుమారుడికి శాప విమోచనం కలిగించమని వేడుకున్నాడు.
భక్తవశంకరుడూ, కరుణా మయుడూ అయిన శంకరుడ తనిని కరుణించి సనత్కుమా రుడికి యథారూపు ప్రసాదిం చాడు. కృతజ్ఞతతో కైమోడ్చిన ఆయనని, మాయా అహంకా రాలను అధిగమించేటందుకై సంపూర్ణ జ్ఞానీ, తన తరువాత తనంతటి వాడూ అయిన భక్త నందీశ్వరుని ద్వారా మరోమారు శివ పురాణ శ్రవణంచేసి శివ తత్త్వాన్ని అర్థం చేసుకోమని ఆదేశించాడు ఈశ్వరుడు. ఆ ఆదేశం మేరకు మందరా చలంలో నందీశ్వరుడు ‘పరమ గురువు’గా బోధనలు చేయగా రెండవసారి తనివి తీరా శివ తత్త్వాన్ని విన్నాడు సనత్కుమారుడు.
తాను విన్న శివపురాణాన్ని మననం చేసుకుంటూ సనత్కుమారుడు పరాశర పుత్రుడూ, సాక్షాత్తూ విష్ణ్వాంశుడూ అయిన వ్యాస మహర్షికి బోధించగా, వ్యాస మహర్షి తాను గ్రహించినంత మేరకు దాన్ని తన ప్రియ శిష్యుడూ, ‘రోమహర్షణుడు’ అనే నిజనామం కలవాడూ అయిన సూత మహర్షికి వినిపించి అర్హులైన వారికి శివ తత్త్వాన్ని బోధించమని అతనిని ఆదేశించాడు. సూత మహర్షి తన మేధస్సుకి అందినంత మేరకు ఆ శివపు రాణాన్ని శౌన కాది మునులకు వారు పర మ పుణ్య క్షేత్ర మయిన ప్రయాగలో దీర్ఘ సత్రయాగం చేస్తున్న సమయంలో విరామ వేళల్లో వినిపించారు.
శౌనకాది మహామునులు వేసిన శాస్త్ర విహిత ప్రశ్నలకు సూతుని సమాధానాలుగా సాగిన ఆ ప్రవచనాన్ని దివ్య దృష్టితో తిలకించి పులకించిన వ్యాస మహర్షి దానిని ఇరవై నాలుగు వేల సంస్కృత శ్లోకాలలో ఏడు సంహితలుగా, గ్రందస్థం చేసి మనకందించారు.
సూత శౌనక సంవాదము, అనగా ప్రశ్నోత్తరాలుగా సాగిన శివపురాణంలో మరెన్నో సంవాదాలు చోటు చేసుకున్నాయి. నందీశ్వర సనత్కుమారుల ‘ప్రశ్నోత్తరాలూ, బ్రహ్మ నారదుడడుగగా తెలిపిన విషయాలుగా ‘బ్రహ్మ-నారద’ సంవాదమూ ప్రధానమైనవి కాగా, వాటిలో అంతర్గతమైనవి సనత్కుమార- వేదవ్యాసుల సంవాదమూ, కార్తికేయ- వామదేవుల ప్రశ్నోత్తరాలూ, నైమిశారణ్య మునుల సందేహాలకు సమాధానాలుగా వాయుదేవుని బోధలూ, ఉపమన్యుడు గురువుగా శ్రీకృష్ణునికి తెలిపిన శివతత్వమూ మొదలైనవి. ఈ శాస్తవ్రిహిత ప్రశ్నోత్తరాలు మనని శివామృత లహరిలో తేలియాడిస్తాయి. అందుకే మరి ఆది శంకరాచార్యుల వారు తన సువర్ణ మాలాస్తుతిలో సుమంగళ విగ్రహుడైన పరమేశ్వరుడిని ఇలా ప్రస్తుతించారు.
‘‘ఈశ గిరీశ నరేశ పరేశ మహేశ
బిలేశయ భూష విభో!
సాంబ సదాశివ శంభోశంకర
శరణం మే తవ చరణ యుగం’’
‘‘పరబ్రహ్మ స్వరూపా! నీవు ఈశుడివి. అనగా సర్వవ్యాపివి. గిరులన్నింటికీ ప్రభువువైవీన గిరీశుడివి. జనులు సేవించే నరేశుడివైనా, పరతత్వం కల పరేశుడివైనా, మహత్వం గల మహేశుడివైనా అన్నీ నీవే! నీవు బిలంలో నివసించే భయంకర సర్పాన్ని అలవోకగా మెడలోని ఆభరణంగా మలచుకుని భూషించే ‘బిలేశుడి’వి. ‘స’ ‘అంబా’ అనగా అంబా సహితుడివైన సాంబుడివి నీవు. వైరాగ్యం మూర్త్భీవించిన సదాశివుడివీ, అర్థ నిమీలిత నేత్రాలతో ‘శాంభవీ’ ముద్రలో విలసిల్లే శంభుడివీ, శుభములు కలిగించే శంకరుడివీ కూడా నీవే! అట్టి నీ దివ్య చరణ యుగానికి మేము శరణమంటున్నాము’’ అంటూ అద్భుతంగా కీర్తించారు. శ్రీ ఆది శంకర భగవత్పాదులు తన ‘సువర్ణ మాలాస్తుతి’లోని నాలుగవ పద్యంలో.
మహేశ్వర, సదాశివ, ఈశ్వర, సాంబ, శంభు, శంకరాది నామాలన్నీ కూడా నిజానికి కాలానికంటే కూడా ముందే నిర్గుణుడిగా, నిరాకారుడిగా, చిత్స్వరూపంగా ఉన్న పరబ్రహ్మ స్వరూపుడైన ఆ పరమేశ్వరుడికే చెందుతాయి. ‘‘ఓం నమశ్శివాయ’’ మంత్రంతోనూ, ‘‘శివాయ గురవే నమః’’ అనే మంత్రంతోనూ మనం కీర్తించేది నిజానికి ఆ అద్వయ పరబ్రహ్మ అయిన పరమేశ్వరుడినే!
ఇంకా ఉంది

శ్రీమతి గౌరీ గార్లదిన్నె