డైలీ సీరియల్

బంగరు భవితకు హేతువు !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోకంలో మంచి చెడు రెండూ ఉంటాయ. మంచివారు మంచిని గ్రహిస్తే చెడుతలంపులతో ఉన్న వారు చెడును గ్రహిస్తుంటారు. మంచివారు చెడ్డవాళ్లు అని రెండు రకాల వారు ప్రపంచంలో ఉండరు. కానీ ఒకే మనిషిలో మంచితనం, చెడుతనం రెండూ ఉంటాయ. మంచి ఆలోచన్లు ఉంటే చెడును అణగదొక్కి మంచిని పైకి తీసుకొని వస్తారు. అందరిచేత మంచివారుగా కీర్తించబడుతారు. అట్లానే ప్రకృతిలో కూడా మంచి చెడు రెండు ఉంటాయ. కాకపోతే కంటితో చూసినదానిని మెదడు విశే్లషిస్తుంది. మంచి ఏది చెడు ఏది అని మనసుకు చెబుతుంది. మనసు సద్గుణాలతో నిండి ఉంటే మంచిని చేయమని ప్రబోధిస్తుంది. అట్లా చేయడం వల్లే మనిషి వ్యక్తిత్వం ఏర్పడుతుంది. దీనికి పూర్వజన్మ సంస్కారము, పరిసరాల ప్రభావము, జన్యుసంస్కారము, ఇతర సంపర్క సాంగత్య ప్రభావము ఇవన్నీ మనసు మీద ప్రభావాన్ని చూపిస్తాయ.
మనిషి భగవంతుడిని నమ్మి ఉంటే భగవంతుడే అన్నింటికీ కారణుడు అని నమ్మితే తనకు ఏది మంచిది లేదా హితాన్ని కలిగిస్తుందని నమ్ముతాడో దానినే ఇతరులకు కూడా చేయడానికి ఇష్టపడుతాడు.చెడు ఉన్నంత మాత్రాన అది భగవంతుని సృష్టి కాదు అని చెప్పలేము. చెడు కూడా భగవంతుని సృష్టిలోనిదే. వెలుగు ఇచ్చే సూర్యుడు నీడను కూడా కల్పిస్తున్నాడు. రాత్రి చీకటి పగలు వెలుతురు రెండూ భగవంతుని సృష్టిలోఎట్లా ఉన్నాయో అదేవిధంగా మంచి చెడు కూడా ఉంటాయ. ఇంకా చెప్పాలంటే మంచికి బాగా ప్రచారం కావాలంటే అంతకు ముందు అక్కడ చెడు ఉన్నట్లయతే మంచి ప్రభావం అతి త్వరగా తెలుస్తుంది. ఇట్లా తెలుస్తుంది అనుకొనేది సామాన్యులకే.
అసామాన్యులు, పండితులు, లేదా భగవంతునిపైన పూర్తిగా నమ్మకముంచిన వారికి మంచిచెడుల మధ్య భేదము కనిపించదు. అంటే వాటిపైన అంత ఆసక్తి వారికి ఉండదు. ఇపుడు ఏది చెయ్యాలో చేస్తారు. మంచి ప్రభావం కానీ చెడు ప్రభావం కానీ వారిపై ఎలాంటి ప్రత్యేకతను వారు పొందరు. ఇట్లాంటి స్థితి అందరికీ సాధ్యమయ్యేది కాదు.
అందుకే పురాణాలు విని, వేదాలు చదివి లేక పెద్దలు చెప్పగా విని వాటిని ఆకళింపు చేసుకొని ఆ తరువాత మంచి చెడుల భేదము గుర్తించాలి. మంచిని మాత్రమే గ్రహించాలి. వేద విభజన చేసిన వాడు, పురాణాలు చెప్పిన వాడు భాష్యాలు చెప్పిన వేద వ్యాస మహర్షి ఇవి అన్నీ చదివినా చదవకపోయనా మీకు విచక్షణ ఉన్నా లేకున్నా సరే కానీ పరులను హింసించడం పాపమని, పరులను సంతోష పెట్టడమే పుణ్యమని తెలుసుకోండి చాలు. ఇట్లా ప్రవర్తించండి అదే పుణ్యాన్నిస్తుంది భగవంతు ని కరుణ మీకు లభ్యమవుతుంది అని చెప్పాడు.
అంటే సామాన్యులము మనకు ఏది తెలియదే ఎట్లా పుణ్యం సంపాదించాలి అని ఆలోచించక్కర్లేదు. పరులను హింసించ కుండా ఉంటే చాలు పుణ్యం చేసినట్లే అవుతుంది. భగవంతుని సన్నిధి దొరకనే దొరుకుతుంది.
మనిషిలోని దైవశక్తి పెరిగినకొలదీ ప్రతికూలచెడు శక్తి బలహీనమవుతుంది. కాని పూర్తిగా మాయమయిపోదు. దాన్ని నిరోధించి పూర్తిగా అంతమొందించి కైవల్య సాధనకై చేసే ప్రయత్నమే తపస్సు. పురాణాలలో మనకు అగుపించే సంఘటనలలో ఈ తపస్సు విఫలం చెందడం, మళ్లీ పునఃతపస్సు కోసం మునులు, రాక్షసులు, మానవులు మొదలైనవారు పూనుకోవడం జరిగేది. ఇది నిరంతరం కొనసాగుతున్న యజ్ఞం. అభ్యాసమనే ప్రక్రియలో నిరంతరం ఎన్నో అవరోధాలు ఎదురవుతాయి. అల్లరి చేసే పిల్లవానిని సరియైన దారిలోకి తీసుకురావాలంటే ఎన్నిమార్లు ప్రయత్నాలు చేయాలి? అలాగే మనసుని చెడునుంచి మంచివైపు మళ్లించాలంటే ఎంతో అభ్యాసం చేయాలి.
మంచి- చెడు పోరాటంలో దైవశక్తి మనలో పెంపొందించుకొని మంచివారితో స్నేహం చేస్తూ మంచి ఆలోచనలు కలిగి ఉంటే తప్పక మంచి జరుగుతుంది. మంచి భావనలు కలిగి ఉంటే సమాజం నుంచి కూడా మంచే ఎదురవుతుంది. వేదం కూడా నాలుగువైపుల నుంచి మంచిభావనలు నాకు అందేలా చేయ భగవంతుడా అనిప్రార్థించమంటుంది. సర్వ జనులు సుఖంగా ఉండాలని కోరుకుంటే చాలు మనమూ సుఖసంతోషాలతోనే ఉంటాం.

- చివుకుల రామమోహన్