డైలీ సీరియల్

చైతన్య కేంద్రాలే దేవాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూ ధర్మము యొక్క సర్వతోముఖ వికాసానికి ఆలయాలు అత్యంత ముఖ్య సాధనాలు. సాధనాలు అని ఎందుకు అంటున్నాం అంటే కేవలం భగవంతుడు దేవా లయంలో మాత్రమే ఉన్నాడనికాక, సామా న్యులకు మనసు నిలవడానికి భక్తి పెరగడానికి విగ్రహారాధన అవసరం. అంతేకాక దేవాలయా ల ద్వారా మనిషి ఉన్నతిని చేరుకోవడానికి ఎన్నో విషయాలను ఎరుక పరుస్తారు. వాటిని సులభంగా అర్థం చేసుకోవడానికి దేవాలయా లు ఎంతో అవసరం.
మానవ హృదయాన్ని దేవాలయంగా, సత్యాలయంగా, ధర్మాలయంగా రూపొందించడానికి దేవాలయం అత్యవసరాలు. ఆలయాలు ఆధ్యాత్మిక శాస్త్భ్య్రాస కేంద్రాలు. సత్య విజ్ఞాన సాధనాలయాలు. జీవిత రహస్య పరిశోధనాశాలలు. మానసిక రోగ వైద్యశాలలు. మానవాత్మను జాగృతంచేసే మాతృ నిలయాలు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే భారతీయ ఆధ్యాత్మికతను అధ్యయనం చేయడానికి, విజ్ఞాన శాస్త్రాన్ని ఆకళింపు చేసుకోడానికీ ప్రాచ్య, పాశ్చాత్య దేశాల నుండి ఎందరెందరో వచ్చేవారు. ఈ ఆలయాలు విశ్వవిద్యాలయాలుగా రూపుదిద్దుకున్నట్లు చరిత్ర చెబుతుంది.
రాళ్లలో దేవుళ్లను ప్రతిబింబింపజేసే చైతన్య కేంద్రాలు దేవాలయాలు. ఇవి మనిషిలోని దైవత్వాన్ని వెలికితీస్తాయ. చైతన్యదీప్తిని రగిలిస్తాయ. మానవుని మాధవునిగా మారుస్తాయ.
దైవాన్ని సగుణ రూపంలో కాని, నిర్గుణ రూపంలో కాని చూడవచ్చునని ఉపనిషత్తులు వక్కాణిస్తున్నాయి. సగుణ రూపంలో దేవాలయాలలో దర్శనమిస్తున్నాడు. దేవాలయాలు లేకుండా దైవంపట్ల భక్తి, జ్ఞానం లభింపజేయడం సులభంకాదు. రూప సాధనాలంబనాలు మనస్సు పరమాత్మను అవగాహన చేసుకోడానికి ఒక మార్గం. విగ్రహారాధన అందుకోసమే ఏర్పరుపబడింది.
‘‘మనస్సుతో కూడిన విధానమంతా విగ్రహారాధనమే. మనోలయానంతరమే ప్రతీకాలంబనం పోతుంది’’ అంటారు త్రైలింగస్వామివారు. విశ్వమంతా నిండి ఉండిన పరమాత్మను విగ్రహ రూపంలో దర్శిస్తున్నాడు మానవుడు. ఆలయం పండిత పామర ప్రయోజనకరం. మేధను మెరుగుపరచుకునే దొకరైతే, హృదయాలను సంస్మరించుకునేదొకరు అయ ఉంటారు.
. ‘‘దేహం-దేవాలయం’’, ‘‘జీవుడు-దేవుడు’’ అను ఉపనిషద్వచనాలకు గల అర్థాన్ని తెలుసుకొంటే దేవాలయం యొక్క విశిష్టత అర్థమవుతుంది. వేల సంవత్సరాల క్రితం మన ప్రాచీనులు, రమణీయమైన గుడులు, గోపురాలు నిర్మించారు. అద్భుతమైన శిల్పకళావైభవం ప్రదర్శితమైంది. ఐతిహాసిక కథలనేగాక, సంగీత, నాట్య కళలను శిల్పాలలో మలిచి కనువిందు చేసారు. ప్రపంచానికే తలమానికములైన దేవాలయ శిల్పాకృతులు కళ్లను కట్టిపడేస్తాయ.
గర్భాలయంలో విరాట్ స్వరూపుడు అధిష్టానమై ఉంటాడు. అదే ఈశ్వర పీఠం. ప్రతి మనిషి గుండెలో నివసించే ఈశ్వరుడే దేవాలయంలోని మూలవిరాట్. దేవాలయంలో ఉత్సవ విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహానికి వివిధ రకాల సేవలు చేస్తుంటారు. వూరేగింపు లలోను పాల్గొనడానికి ఉత్సవ మూర్తులను తీసుకొస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. విరాట్ అంటే నిర్గుణంగా భావిస్తే. రెండవది సగుణం. రెండూ ఒక్కటే. ఒకటి వ్యక్తం. రెండవది అవ్యక్తం. ఇది అర్థంచేసుకుంటే మన హృదయంలో దైవాన్ని దర్శించగలుగుతాము. ఎదురుగా గుడిలోని అంతరార్థాన్ని తెలుసుకొంటాము. ఉత్సవ విగ్రహానికి, మూలవిరాట్‌కు కూడా అర్థం విపులీకరించగలుగుతాము.
గోపురాలు గుడి కంటె ఎంతో ఎత్తులో ఉంటాయి. ఎంతో దూరంనుంచి కనుపిస్తాయి. ఇలా ఎందుకంటే గోపురం కనుపించినంతనే గుడినీ, గుడిలోని దైవాన్నీ దర్శించినంత ఆనందం కలుగుతుంది. దానివల్ల పైకి కనిపించే విశ్వంలోని విశ్వాన్ని చూడమని, ఊర్ధ్వదృష్టిని అలవర్చుకోమనే అంతరార్థం గోపురంలో ఇమిడి ఉంది. జ్ఞాన విజ్ఞాన ఉన్నతికి ఉత్తమ సాధన రంగాలైన ఆలయాల సర్వతోముఖాభివృద్ధికి అందరం కలసి కట్టుగా పయనించాలి.

- భీమవరం లక్ష్మి