డైలీ సీరియల్

దూతికా విజయం-24

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పురుషుడు కాస్త తటపటాయించాడు.
‘‘చీకటేగా! ఫర్వాలేదు’’ అన్నది స్ర్తి.
‘‘ఎంత అవస్థ తెచ్చిపెట్టావ్ సరస్వతీ!’’
‘‘మరి ప్రణయమంటే కథల్లో చదివినంత తేలికనుకున్నారా? ఇదేం ఉక్కు కడ్డీలు వంచటమనుకున్నారా? నువ్వుల్ని గుప్పెట్లో పిండి నూనె కార్చటం అనుకున్నారా?.. మనమీ ఆరుబైట ఎక్కువసేపు ఉండటం ప్రమాదం. త్వరగా కానీండి..’’
వీరభద్రుడు సిగ్గుపడుతూనే మగదుస్తులు తీసేశాడు. అతనికైతే ఏమీ కనిపంచడంలేదు కానీ, సరస్వతికి అంతా స్పష్టంగా కనిపిస్తున్నట్లే తోచిందతనికి. ఇప్పుడు సిగ్గుపడి ప్రయోజనం లేదని వీరభద్రుడు నిర్ణయించుకొని తన శరీరాన్ని సరస్వతికి అప్పగించాడు.
క్షణాల్లో ఆమె చీర కట్టి అలంకరణలన్నీ చేసేసింది. వీరభద్రుడు ఆశ్చర్యపడి శరీరాన్ని తడిమి చూసుకున్నాడు. రొమ్ముల్ని తడిమిచూసుకొని నిజంగానే తను ఆడజన్మకు మారానేమోనన్న సందేహానికి క్షణంసేపు గురయ్యాడు.
‘‘ఇదిగో మేలి ముసుగు కప్పుకోండి’’
‘‘ఎట్లా?’’
‘‘అన్నీ చెప్పాలి. ఉండండి..’’ అని ఆమె మేలి ముసుగును అమర్చింది.
‘‘చెప్పులు తీసెయ్యండి’’
అతను చెప్పులు విడిచాడు.
‘‘ఒక్క క్షణం’’ అని సరస్వతి, వీరభద్రుడు విడిచిన దుస్తుల్నీ, చెప్పుల్నీ మూటగా కట్టి పొదల మాటున దాచింది.
‘‘మనం మాట్లాడరాదు. నేను ఎవరితో మాట్లాడుతున్న, మీరు మెదలకుండా ఊరుకోండి. జాగ్రత్త!’’
‘‘మరి నాకేమీ కనిపించడంలేదే!’’
‘‘అదేవిధంగా ఇతరులక్కూడా మనం కనిపించమనే మాట మరువకండి. ఈ చీకటి ప్రకృతి మనకు ప్రసాదించిన మహాప్రసాదం!’’
‘‘నీ వెనకే రావటం ఎలా?’’
‘‘మీరు అంధులు. నేనూ అంధనే కాని, కళ్ళు మూసుకొని కూడా రుూ దారిన రాగలను. బాగా అలవాటు చేసుకున్నాను. నాచేయి పట్టుకోండి.. ఒక్క విషయం.. ఏం జరిగినా పెదవి కదల్చరాదు! నాడు నూరిపోసినదంతా బాగా గుర్తుంచుకోండి’’
‘‘ప్రణయం కాదు కాని, ప్రాణంమీదికి వచ్చేట్లుందే!’’ అని వీరభద్రుడు నిట్టూర్చాడు.
‘‘ఇంత బలశాలివి ఇంత అధైర్యపడతావెందుకు? పట్టుబడితే ప్రణయానికి ప్రాణాల్ని బలిచేసిన ప్రణయ పిపాసివనే తృప్తన్నా మీకు ఉంటుంది. ప్రాణం పోతే రుూ జీవిత సమస్యలన్నీ పరిష్కరిచబడినట్లే కదా! నేనో- వృధాగా ప్రాణాల్ని అర్పించిన రాజద్రోహిని అవుతాను. ఇక్కడిదాకా వచ్చాక ఇక ఆలోచనకు ఆస్కారం లేదు. ముందుకు సాగటమే.. ఎక్కువ సేపు మాట్లాడటం మంచిది కాదు. హెచ్చరికల్ని మరచిపోకండి. నాచేతివేళ్ళే మీకు అన్నీ చెపుతవి. రాచమర్యాదల్ని తలుచుకుంటూ వెంటరండి.. మరో మాట.. రాణి శయనాగారం బైటనే ఉంటాను.. రాణి సాంకేతిక శబ్దం చేయగానే మీ చేయి పట్టుకుని రుూ చీకటి సముద్రాన్ని ఈది, మీ దుస్తులు మీకిచ్చి సాగనంపుతాను.. కాస్త పక్కన ఉండండి..’’
నిలువెత్తు తలుపుమీద సరస్వతి మూడు చిటికెలు వేసింది. ప్రతిధ్వని రాలేదు. వీరభద్రునికి చెమటలు కమ్ముతున్నవి. కొద్దిసేపు భరించరాని నిశ్శబ్దంలో గడిచింది. దూరాన ఎక్కడో ఫారావాళ్ళ అరుపులు అస్పష్టంగా వినిపిస్తూన్నవి. చుట్టుప్రక్కల కీచురాళ్ళ ద్వని సింహగర్జనలల్లే వీరభద్రుని వీనులను తాకుతూన్నవి.
కొద్ది క్షణాలు గడిచాక తలుపుల అవతలనుంచి రెండు చిటికెలు వేసిన శబ్దం వినవచ్చింది. సిద్ధంగా ఉండమన్నట్లు సరస్వతి వీరభద్రుని చేయి నొక్కింది.
మెల్లిగా కీచుమనే ధ్వని స్పష్టంగా వినిపించకుండా సింహద్వారం కొద్దిగా తెరుచుకున్నది. ఒక్క మనిషి పట్టే మాత్రంగా దారి ఏర్పడింది. ముందు సరస్వతి, ఆ వెనుక వీరభద్రుడు లోపలికి జేరారు. తలుపు వెంటనే మొసుకున్నది.
‘‘ఎవరూ?’’ అన్న కాపలావాడి కంఠస్వరం తగ్గుస్థాయిలో అయినా స్పష్టంగా వినిపించింది.
తానెవరో చెప్పుకోవలసిన గతి పడితే, సజీవంగా తిరిగి వెళ్ళే అవసరం తనకుండదని వీరభద్రునికి తెలుసు.
ఒకరికి ఉపకారం చేయటం ఎంత శ్రమతో కూడిన పనో, అపకారం చేయటం కూడా అంతే శ్రమ- ఒకో సందర్భంలో అంతకన్న అధిక శ్రమగా కూడా పరిణమిస్తుంటుంది కదా!
మొదట్లోనే తనవల్ల కాదీ కార్యమని రాణికి తాను చెప్పివుంటే రుూ క్లిష్ట పరిస్థితి తప్పేది కదా! అయితే రాణి దీనవదనాన్ని చూసి, చిన్నతనం నుంచి ఆమెమీద ఉండే అభిమానాన్ని చంపుకోలేక దుస్సాధ్యమైన రుూ దౌత్యానికి తాను అంగీకరించింది. మధ్యలో విడనాడటం తగని పని. ఇప్పుడు విచారించి లాభం లేదు. ఏది ఏమైనప్పటికీ ముందుకు సాగటమొక్కటే గతి!
వీరభద్రుని మెదడు తెకతెకలాడుతున్నది. సరస్వతి చెప్పిందంతా నిజమే! ఆమె చెప్పినదాంట్లో జరుగకుండా ఉండేదేమీ లేదు. ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా ఉన్నది తన పరిస్థితి. కోటలో పాగావేయటమంటే ప్రాణానే్న పణంగావొడ్డి జూదమాడటం; ఈ గొడవంతా లేకుండా తన దారిన తాను పోవటమంటే అదీ మృత్యువును ఏరికోరి ఆహ్వానించటమే!
రాణి ప్రతినిధికే ఇంత కోపం వచ్చినందుకు తను గజగజలాడే పరిస్థితి ఏర్పడితే, ఇక రాణీ కోపజ్వాలల్లో తానొక కీటకమై క్షణంలో బుగ్గికాక తప్పదు.
ఎటుచూసినా ఇదంతా తన చావుకే వచ్చింది. అయితే తన నిరాకరణ ద్వారా మృత్యువు తథ్యం! అంగీకరిస్తే జూదంలోవలె తను గెలిచినా గెలవవచ్చును.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు