డైలీ సీరియల్

దూతికా విజయం-22

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ప్రపంచమే ఒక గొప్ప రసాయనిక పరిశోధనాలయంగానూ రుూ మానవులందరూ ముడి పదార్థాలుగానూ సరస్వతికి తోచారు. రసాయనిక సంయోగంలో ఎనె్నన్ని అద్భుతాలు సంభవమో కూడా ఆమెకు అర్థవౌతోంది.
కాకపోతే వీరభద్రునిలాటి సామాన్యుడు రాణితో జరుగబోయే సంయోగాన్ని సిద్ధాంతరీత్యా తెలుసుకోగానే ఎంత అధికుడయాడో! ఈ కలయిక విడివడితే మళ్లీ నేలమీద దుమ్ములో పొర్లాడవలసిందే కదా? అవసరాలు అనేవి ఒక్కొక్కసారి మనిషిని ఎంతెంత దూరం తరుముతాయో ఊహించటమే ఎంత కష్టమోననిపించిందామెకు.
తాను ప్రయోగించిన రుూ ‘దండోపాయం’ తాలూకు ఫలితం ఎలా ఉంటుందో? వీరభద్రుడు మొండికేసి ఏమైతే అదే అవుతుందని నిరాకరిస్తే?
వీణ్ని కాలబెట్టి నేలరాచే ప్రయత్నాలు చేయాలి. అది తనవల్ల కాదు కనుక, వేరొకరిని ఆశ్రయించాలి. అది అవినీతికరమైన, ఘోరమైన పని. గురుతర బాధ్యత వేరొక రూపాన తనపైన పడుతుంది.
ఒకరికి ఉపకారం చేయటం ఎంత శ్రమ తో కూడిన పనో, అపకారం చేయటం కూడా అంతే శ్రమ- ఒకో సందర్భంలో అంతకన్న అధిక శ్రమగా కూడా పరిణమిస్తుంటుంది కదా!
మొదట్లోనే తనవల్ల కాదీ కార్యమని రాణికి తాను చెప్పివుంటే రుూ క్లిష్ట పరిస్థితి తప్పేది కదా! అయితే రాణి దీనవదనాన్ని చూసి, చిన్నతనం నుంచి ఆమెమీద ఉండే అభిమానాన్ని చంపుకోలేక దుస్సాధ్యమైన రుూ దౌత్యానికి తాను అంగీకరించింది. మధ్యలో విడనాడటం తగని పని. ఇప్పుడు విచారించి లాభం లేదు. ఏది ఏమైనప్పటికీ ముందుకు సాగటమొక్కటే గతి!
వీరభద్రుని మెదడు తెకతెకలాడుతున్నది. సరస్వతి చెప్పిందంతా నిజమే! ఆమె చెప్పినదాంట్లో జరుగకుండా ఉండేదేమీ లేదు. ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా ఉన్నది తన పరిస్థితి. కోటలో పాగావేయటమంటే ప్రాణానే్న పణంగావొడ్డి జూదమాడటం; ఈ గొడవంతా లేకుండా తన దారిన తాను పోవటమంటే అదీ మృత్యువును ఏరికోరి ఆహ్వానించటమే!
రాణి ప్రతినిధికే ఇంత కోపం వచ్చినందుకు తను గజగజలాడే పరిస్థితి ఏర్పడితే, ఇక రాణీ కోపజ్వాలల్లో తానొక కీటకమై క్షణంలో బుగ్గికాక తప్పదు.
ఎటుచూసినా ఇదంతా తన చావుకే వచ్చింది. అయితే తన నిరాకరణ ద్వారా మృత్యువు తథ్యం! అంగీకరిస్తే జూదంలోవలె తను గెలిచినా గెలవవచ్చును. నిజానికి ఓటమికన్నా విజయానికే ఎక్కువ అవకాశాలున్నవి. ఒకవేళ ఓటమే తప్పనిసరైతే ఇంతకన్నా చెడేదేమున్నది? నిశ్చయ మరణమా తప్పదాయె ఇన్నాళ్ళుగా- పావు శతాబ్దంగా ఎంతో ప్రేమతో పెంచుకున్న రుూ శరీరాన్ని ఎటు మొగ్గినా నిశితఖడ్గ ఘాతాలకు తుండెలు తుండెలుగా అప్పగించడమే సంభవమనుకుంటే కొన్నాళ్ళపాటన్నా రుూ శరీరానికి సకల సౌఖ్యాలనూ, భోగాలనూ లభ్యపరిచి నాశనం చేయటమే లెస్స!
ఒకవేళ పరిపూర్ణ విజయమే తనకు రాసిపెట్టి ఉంటే ఇక రుూ జీవిత శేషమంతా మహావైభోగంగా సాగే అసామాన్యమైన అవకాశం ఉండనే ఉన్నది. చేజేతులారా దీన్ని పాడుజేసుకోవటం దేనికి?
వరదలతో పారే మహానది నడిబొడ్డులో కొట్టుమిట్టాడుతుండే వాడికి ఏ ఒడ్డయినా ఒకటే! అయితే గాలివాటునుబట్టి తనకు దొరికిన చిన్న తెప్ప సహాయంతో దానంతట అది కొట్టుకెళ్ళి వొడ్డుచేరడమే ఎన్నుకోతగింది.
సరస్వతి లాటి తెప్ప సహాయం ఉన్నది. మునిగి చావటం తథ్యమైతే తెప్ప కూడా నాశనవౌతుంది. తన వినాశనాన్ని వాంఛించని సరస్వతి తన రక్షణనే ఆదర్శంగా ఉంచుకుంటుంది. ఎన్నాళ్ళు, యెనే్నళ్ళు ఆలోచించినా తేలేదేమున్నది? ఏదో ఒక నిశ్చయం తప్పదు. ఫలితాలు తన చేతుల్లో లేవు. విధివిలాసానికి తృణప్రాయుడైన తానేం చేయగలడు?
తనను అనవసరంగా ఇబ్బందిలో పడేసిన రాణిమీద ఒక్క క్షణంపాటు మనసు మండిపడింది. తనకొద్దు బాబూ అంటే అదీ నేరమే! అధికారం అధికమైన కొద్దీ మానవత్వపుపాలు అల్పవౌతూంటుందనే అనుకోవాలి మరి! యెంత కోపం వచ్చినా పేదవాని కోపం పెదవుల చేటనే సామెతను అనుసరించి వీరభద్రుడు దాన్ని దిగమింగుకొన్నాడు.
ఈ సరస్వతి అసామాన్యురాలుగా రూఢిఐంది. ఈ కొద్ది సేపట్లోనూ ఆమె తన ప్రతిభను ఎన్ని కోణాల్లో ప్రదర్శించగలిగింది!
ఈమె ఆజ్ఞాపించగలదు, అర్థించగలదు, అమృతాన్ని కురిపించగలదు, హాలాహలాన్ని వర్షించగలదు, హృదయాంతరాళంలోని కోర్కెలను ఎదుటి వ్యక్తికి సుగ్రాహ్యమయే విధంగా వివరించగలదు. తన మాటల ప్రభావం ఎలా పనిచేసిందో గ్రహించగలదు. ఏకువలె మెత్తగా కనిపించగలదు. అంతలోనే మేకువలె దృఢంగా రూపొందగలదు. ఇలాంటి స్ర్తిరక్షణ వుండగా తను భయపడటంలో అర్థం లేదు.
ఈ ప్రపంచమే ఒక పెద్ద రంగస్థలమూ, మానవులే పాత్రధారులూ అనుకున్నట్లయితే ఆయా పాత్రలు తమతమ ఇష్టానుసారంగా నటించటం కుదరదు. పక్క పాత్రలు వూరుకోవు. ఎవరికివారుగా ఆడి, పాడితే నాటకం రక్తికట్టదు. అందుకని సరిగా నటించని పాత్రల్ని సక్రమంగా నడిపించేందుకూ, రసాత్మకంగా రూపొందించేందుకూ ఇతర పాత్రలు తీవ్రంగా ప్రయత్నిస్తుంటవి. ఈ సరస్వతి ఏయే పాత్రను ఏవిధంగా నడిపించి ఈ నాటకాన్ని రసాత్మకంగాను, రక్తిగానూ, సుఖాంతంగానూ చేయగల సర్వసమర్థురాలేనని నమ్మేందుకు ఎలాటి ఆక్షేపణలూ ఉండవలసిన అవసరం లేదు!
సరస్వతి ఇచ్చిన వ్యవధి అంతా వినియోగించకుండానే ‘‘నేను అంగీకరిస్తున్నాను సరస్వతీ!’’ అన్నాడు వీరభద్రుడు ఖంగుమనే కంఠస్వరంతో దృఢ నిశ్చయాన్ని ధ్వనింపజేస్తూ.
శిలవలె ఉన్న సరస్వతి ముఖం వికసించి పెదవుల మీద సజీవమైన చిరునవ్వు వెనె్నలలు విరిసినవి.
‘‘మిమ్ము ఆ ఉద్రేకంలో తూలనాడేనేమో? క్షమించండి. సత్యం కఠినంగానే ఉంటుంది. కేవలం ఇచ్చకపు కబుర్లుచెప్పే వాళ్ళ మాటలు కర్ణోపేతాలుగాఉన్నా, వాటివల్ల మేలుకన్నా కీడే ఎక్కువ జరుగుతుంది.

- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు