డైలీ సీరియల్

సింహాచలేశుని గిరిపరిక్రమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిక్రమంటే ప్రదక్షిణం. భగవంతుని చుట్టూ ప్రదక్షిణం చేయడం యుగాలుగా జరుగుతున్నది. ప్రదక్షిణ చేయడంవల్ల సత్ఫలితాలు ప్రాప్తిస్తున్నాయని పురాణాలలో ఉంది. దేవగణాధిపత్యం కోసం పరమశివుడే తన కుమారులిద్దరికీ స్పర్థకలిగించాడనీ, బరువైన బొజ్జతో, మూషిక వాహనంతో భూపరిక్రమ చేయలేని లంబోదరుడు, నెమలి వాహనంపై కుమారస్వామి మధ్య జరిగిన ఈ పోటీలో, నారదుని సలహా మేరకు లంబోదరుడు తల్లిదండ్రులనే భూమిగా భావించి ప్రదక్షిణం చేసి గణాధిపతి అయ్యాడని గణేశ పురాణం ఉంటంకిస్తున్నది.
ద్వాపరంలో ఇంద్రునికి గర్వభంగం కలిగిస్తూ శ్రీకృష్ణుడు గోవర్దనగిరిని తన చిటికనవ్రేలితో ఎత్తి, తత్ఫలితంగా గోవిందుడుగా ఇంద్రునిచే పూజలు అందుకున్నాడని భాగవత మహాపురాణం అంటున్నది. ఆనాటినుంచి గోవర్థనగిరి పరిక్రమ నిత్యకృత్యమైందని అంటారు.
శ్రీశైలగిరిని ప్రదక్షిణం చేసి శ్రీ భ్రమరాంబికా మల్లికార్జునుల అనుగ్రహ పాప్త్రులవడం, సత్ఫలితాలను పొందడం నేటికీ జరుగుతున్నది.
అరుణాచల గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యాన్ని భగవాన్ శ్రీరమణ మహర్షి భక్తులకు చెప్పేవారు. అరుణగిరి సాక్షాత్తు శివ స్వరూపమని, ఆ గిరిని అర్చిస్తూ ముక్కోటి దేవతలు అక్కడే కొలువై ఉన్నారని అనేవారు. తాను అరుణగిరి ప్రదక్షిణం చేస్తూ, భక్తులకు ముందుండి నడిచేవారు. భక్తులకు అలసట కలుగకుండా ప్రార్థనగా పాడుకోవడానికి ‘అక్షర మణిమాల’ను కూడా రచించి పాడించేవారు. ఈనాటికీ అరుణగిరి పరిక్రమ కొనసాగుతూనే వుంది.
భారతదేశంలో పలు దేవీ దేవతలు గిరులపైనే ఆవాసముంటున్నారు. అక్కడ నిర్మించిన దేవాలయాల శిఖరాలను దర్శించినంత మాత్రాన మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. గిరిప్రదక్షిణం చేయలేని అశక్తులు దేవాలయం చుట్టూనో, గర్భాలయం చుట్టూనో ప్రదక్షిణలు చేస్తారు. అలానే కామ్యకర్మలు ఫలితాలనిస్తాయన్న నమ్మకంతో తాము నమ్మిన దేవీదేవతల ఆలయాల చుట్టూ, అశ్వత్థ వృక్షాలచుట్టూ మ్రొక్కుకున్న విధంగా పరిక్రమలు చేయడం చూస్తూనే ఉన్నాం. ‘చార్‌ధామ్ యాత్ర’ కూడా హిమాలయాల పరిక్రమలో ఒక భాగంగా విశ్వసించేవారున్నారు.
అటువంటిదే సింహాచలంపై కొలువున్న సింహాచలేశుని గిరిపరిక్రమ. అయితే ఈ గిరి పరిక్రమకు భిన్నమైన కథనం ఉంది. ఇక్కడ గిరి పరిక్రమ ఆషాఢ శుద్ధ పూర్ణిమనాడు విధిగా జరుగుతుంది.
సింహాచలేశునికి అక్షయ తృతీయ (వైశాఖ శుద్ధ తదియ) నాడు చందనోత్సవం జరుగుతుంది. అంతకు ముందు రోజు (విదియ) లింగరూపంలో కనిపించే వరాహలక్ష్మీ నృసింహునికి పూసిన చందనం ఒలిచి నిజరూపదర్శన భాగ్యం కలిగిస్తారు.
యుగాలుగా వస్తున్న ఆగమశాస్త్ర సంప్రదాయం అనుసరించి 12 మణుగుల చందనాన్ని నాలుగు విడతలుగా స్వామికి పూస్తారు. విదియనాటి రాత్రి ఆగమాలనుసరించి స్వపన కార్యక్రమాలు పూర్తయ్యాక తొలివిడతగా మూడు మణుగుల చందనాన్ని స్వామికి అలదుతారు. తతిమ్మా మూడు విడతలు వైశాఖ, జ్యేష్ఠ, ఆషాడ పున్నములనాడు స్వామికి పూస్తారు. ఇలా మొత్తం చందనాన్ని స్వీకరించిన సింహాచలేశుడు తన సంపూర్ణ రూపాన్ని (లింగరూపం) ధరిస్తాడు.
అలా పరిపూర్ణుడైన సింహాచలేశుని (సింహాద్రి అప్పన్నను) దర్శిస్తే సమస్త శుభాలు కలుగుతాయని విశ్వాసం. సింహగిరి ప్రదక్షిణం చేసినందువల్ల అంతులేని పుణ్యం ప్రాప్తిస్తుందని పురాణ వచనం. గిరి ప్రదక్షిణ, భూప్రదక్షిణ అనేవి తపస్సుతో సమానమైనవని అంటున్నాయి పురాణాలు.
సాధారణంగా ఏకాదశులు పూర్ణిమలు పరిక్రమలకు అనువైనవని శాస్త్రాలంటున్నాయి. తదనుగుణంగా సింహగిరి పరిక్రమ ఆషాఢ పూర్ణిమకు జరుగుతుంది. పరిక్రమ చేసిన భక్తులు పూర్ణిమనాటి ఉదయం స్వామిని దర్శించుకుని తరిస్తారు. అందుకోసం భక్తులు వైశాఖ శుద్ధ చతుర్దశిరాత్రి కొండ దిగువన గల తొలి మెట్టు వద్ద నమస్కరించుకుని కాలినడకన 32 కి.మీ చుట్టుకొలత కలిగిన సింహగిరిని మనసు నిండా భక్తితో పరిక్రమ ప్రారంభిస్తారు. సింహం ఆకారంలో కనిపించే సింహగిరి చుట్టూ చక్కనైన మార్గం ఉంది. వేలాది భక్తులు ఈ పరిక్రమలో పాల్గొంటారు. వీరి సౌకర్యం కోసం దేవస్థానంపాటు పలు స్వచ్ఛంద ఆధ్యాత్మిక సేవా సంస్థలు సహాయ సహకారాలందిస్తాయి. ప్రభుత్వ యం త్రాంగం, పోలీసు, వైద్య శాఖలు కూడా అప్రమత్తంగా ఉండి పరిక్రమ చేస్తున్నవారికి అండగా ఉంటాయి. పరిక్రమ చేయలేనివారు ఆలయంలో ప్రదక్షిణం చేయడం కద్దు. సింహగిరికి వరుసగా మూడేళ్ళు ప్రదక్షిణలు చేస్తే భూప్రదక్షిణం చేసే ఫలం లభిస్తుందని పెద్దలు అంటారు.
సింహాచలేశ్వరుని కోసం సింహాచల పరిక్రమ చేసిన వారి కుటుంబాలకు సింహాద్రి అప్పన్న ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని ప్రార్థిస్తూ...

-ఎ. సీతారామారావు 8978799864