డైలీ సీరియల్

దూతికా విజయం-21

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రవరునివలె నున్నని బోడిగుండువల్ల ప్రయోజనం లేదు!’’ అన్నది సరస్వతి తేలికపడిన మనసుతో. ‘‘కనుకనే నేను వేసిన పథకమే గతి!’’ విజయసూచకంగా చూసింది సరస్వతి.
వీరభద్రుడు గుడ్లు మిటకరించాడు.
‘‘పిచ్చివాడా! నమ్మశక్యంకాని ఈ ప్రక్రియలేవీ మనకు లాభం లేదు’’ అన్నది సరస్వతి. ‘‘అమానుష శక్తులేవీ మనకు అందుబాటులో లేవు. ఎక్కడో జానపద గాథల్లోవలె అత్యద్భుతాలు జరుగుతవనీ, ఆ దేవతలే కరుణించి ప్రతిదీ సానుకూలంగా రూపొందిస్తారనీ నమ్మకం బుద్ధి తక్కువ! కనుక జనపథం- అంటే జనులు- సర్వ సామాన్య మానవులు నడిచే బాటే మనకు శరణ్యం. ఐతే సామాన్యులమైనప్పటికీ, అసామాన్య ప్రజ్ఞా విశేషాలనూ అద్భుత విజ్ఞనాన్నీ ప్రదర్శించగలిగియూ ప్రమాదాలన్నిటిని మనం దాటగలం. ఎన్ని ఉండీ ఆత్మబలం లేనివాడు ఎందుకూ కొరగాడు. ఏదీ లేక ఆత్మబలం వున్నవాడు దేన్నయినా సాధించగలడు. ఆత్మశక్తిని ఎవరికి వారే సాధించుగోగలరు కనుక బైటి శక్తులమీద ఆధారపడటం కన్నా స్వశక్తి మీదనే ఆధారపడటం ఉత్తమోత్తమం కదా!’’’
‘‘ఒప్పుకుంటాను’’ అన్నాడు వీరభద్రడు. ‘‘ఎంత తీవ్రంగా ఆలోచించినా ప్రాణాంతకంగా తోచే ఈ సాహసానికి ఒడి గట్టలేకుండా ఉన్నాను. అదీగాక పరస్ర్తిని అందునా పరదారను జేరటం పాపం కదా! విశేషించి రాజపత్నిని కూడటం మహాపాపం!’’
‘‘ఇంతదూరం వచ్చాక పాపపుణ్యాలప్రస్తావన వచ్చిందా మహాశయా!’’ అన్నదిసరస్వతి వీరభద్రుని వాదనలోని బలహీనతను పసిగట్టి. ‘‘మా రాణి కన్య అయి మిమ్ము కోరి వుంటేసరిపోయేదనుకుంటాను’’. అయితే ఆమె కన్యగా ఉండి గర్భవతి కావాలని కోరుకోవాలన్నమాట! బాగుంది- సంతానగోపాలుని ఆజ్ఞను అనుసరించి ఇప్పటిదాకా ఈ క్రియా కలాపాలం తాలూకు జమాఖర్చులు సరిజూసుకున్నారా? ఇంతలోనే ఆ స్వామి మిమ్ము విడనాడమన్నాడా? దానమిచ్చేందుకు సిద్ధపడిన మీ చేయి అంతలోనే వెనక్కు తగ్గిందెందుకనీ? అది అధర్మమూ, పాపమూ కాదా ఏమిటి? వనిత తనంత తావలసి వచ్చిందని చులకభావం ఏర్పడిందా? వలచి, వరించి పిలిచిన వనిత చులకనే మరి! ఒక ప్రాణిని ఉసురుబెట్టి, ఒక సంసారాన్ని కూల్చటమనేది మీ దాన మహిమవల్ల తప్పించే అవకాశమున్నప్పుడు అది పాపమైనా, దాని ద్వారా మీరు సంపాదించే పుణ్యాన్ని అంచనా వేయలేదా? ఎక్కడో పరలోకాల్లో అనుభవించవలసిన పాప పుణ్యాలను గూర్చి ఇహలోకంలోనే మథనపడే మీ దీర్ఘదృష్టికి జోహారులు. అయితే ఆ అనుభవాలు పాపానికీ, పుణ్యానికీ సంబంధించినవన్నీ ఇక్కడ లభ్యవౌతుంటే ఆ పరలోకాల దాకా పయనమైపవలసిన శ్రమ దేనికి?.. ఇంతకూ మా రాణి ఎన్నికకు చెప్పాలి! అసలు మీ నిర్ణయం ఏమిటో శలవివ్వండి’’ అన్నది సరస్వతి చిరాకుతో చిటపటలాడుతూ.
ఆమె ముఖం చూసేటప్పటికి వీరభద్రుడు చెప్పదలచుకున్న మాటలు వెలికిరాలేదు.
‘‘మనసులో మాట బైటపెట్టండి..’’ అన్నది సరస్వతి సౌమ్యంగా.
‘‘నేను నిరాకరిస్తే ఏవౌతుంది?’’ అన్నాడు వీరభద్రుడు.
సరస్వతికి అరికాలి మంట నెత్తికెక్కింది. తన సహకారం వాదనంతా బుగ్గిలో పోసిన పన్నీరయ్యే సూచనలు ఆమెను కలవరపెట్టినవి. శిలను సైతం కరిగించగల ఆమె చాతుర్యం రుూ మూర్ఖుని మీద ఎందుకు పనిచెయ్యలేదో తెలియలేదు. బలవంతుడైనా, పిరికివాడి ద్వారా కాగల కార్యాలు కావివి. వాడి పిరికితనమే వాణ్ని ఎటైనా నడిపించగలుగుతుందనే సిద్ధాంతాన్ని ప్రయోగించి చూద్దామని సరస్వతి నిశ్చయించుకున్నది.
‘‘వీరభద్రా!’’ అన్నదామె భద్రకాళివలె. మంచి మర్యాదల్ని కాసేపు అవతల మరుగుపరచింది.
‘‘నీవెవరివని ఒక్క క్షణమన్నాఆలోచించావా? సర్వసామాన్యుడివి. ఆ శారీరక బలమే లేకుండా అల్పుడివి. బుద్ధిబలం లేని భుజబలం కేవలం ప్రదర్శనలకు తప్ప మరెందుకూ పనికిరాదు. రాణి నిన్ను కోరిందని నేను చెప్పిన క్షణం నుంచీ ఆకాశానికి నిచ్చెనలువేసి మేఘాలకు ఎకబ్రాకావు. కాని కింద నేలమీద వున్న మేము ఆ నిచ్చెన లాగివేస్తే ఎంత ఎత్తునుంచి పడిపాతావో, ఎన్ని శకలాలవుతాయో ఆలోచించలేదు.. రాణి ఆజ్ఞను నిరాకరిస్తావా? ఎన్ని గుండెలతో! నిన్ను అందలాలు ఎక్కించగల సామర్త్యత వున్న రాణి నిన్ను అధఃపాతాళానికి దిగతొక్కగల సమర్థురాలే అయి ఉంటుందని తోచలేదా? రాజానుగ్రహం ఎలాంటిదో నేనీ రాత్రి నీ ఇంట ప్రవేశించినప్పుడు నీ చేతికి అప్పగించిన రాణి బహుమతి సువర్ణ ముద్రికలు నమూనాగా వున్నవి. ఇక ఆగ్రహాన్ని రుచి చూస్తావా? అదీ ఒకేసారి.. మరొకసారి నీలాంటి అల్పుడికి ఆ ఆగ్రహాన్ని రుచిచూసే శ్రమా, వ్యవధీ మాకు ఉండవు. నీ జీవితం మొత్తం ఖరీదెంత వుందని అంచనా వేసుకున్నావో తెలియదు.. నేను చెపుతాను విను. నీకిప్పుడు బహుమతిగాఇచ్చానే ఆ సువర్ణ ముద్రికలకు తెల్లవారేలోగా నిన్ను పరలోకాలకు పంపి, నీ శవం తాలుకునామరూపాలు లేకుండా చేయగల సమర్థులూ, ధన దాసులు, క్రూరులు, రాజ్ఞాను దేవ ఆజ్ఞగా భావించి ముందు వెనుకలు ఆలోచించనివారు నా తలవెంట్రుకలకంతమంది ఈ మహాపట్టణంలోన్నారు. నీవు పిరికిపందవనుకున్నాను. రాణి ఆజ్ఞను తిరస్కరించే పాటి సాహసం నీలో వున్నందుకు సంతోషిస్తున్నాను. అయితే అది దుస్సాహసమని మరోసారి హెచ్చరిస్తున్నాను. రాణిని తృణీకరించి సజీవంగా నీ దేశానికి తిరిగిపోవగలవని భ్రమపడుతున్నావేమో? ఆ ఆశలు పటాపంచలవగానే నీ పొరపాటైతే తెలుసుకుంటావేమో కాని, దాన్ని గూర్చి విచారపడేందుకు కానీ, నిశ్చయాన్ని మార్చుకునేందుకు కానీ మరో అవకాశం ఉండదు. నీవొక అమాయకునివలె తోచబట్టి ఇంత దూరం చెప్పాను. నీ మీద జాలితో మరొక అవకాశం ఇస్తున్నాను. కొద్ది క్షణాల వ్యవధిలో తాడోపేడో తేల్చుకో, నా చేత చాలా వాగించావు. నేను ఈ వ్యవధిలో విశ్రాంతి తీసుకుంటూ వౌనం వహిస్తాను.. ఒకపక్క తెల్లవారబోతోంది. నీ నిర్ణయం వినగానే నేను వెళ్లిపోతాను’’-
అంతే- ఆమె ముఖంలో వౌనం కరుడుగట్టింది. ఏ భావమూ వ్యక్తమవకుండా శిలాప్రతిమవలె కూర్చున్నదామె.

- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు