డైలీ సీరియల్

దూతికా విజయం-20

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వసాధారణంగా హఠాత్తుగా రారు. అదీగాక ప్రతి రాత్రీ అసలు రారు. నియమాన్ని అనుసరించే ఆయన రాకపోకలు జరుగుతవి. సంవత్సరాల తరబడి ఆ క్రమమూ, నియమావళీ మాకెంతో అలవాటై ఉండటంవల్ల ఆయన రాని సమయాలేవో మాకు కచ్చితంగా తెలుసు. అధవా యింకో పనంటూ లేని అనంగుడు ఆయనమీద వాడి బాణాలు ప్రయోగించడంవల్ల, హఠాత్తుగా వచ్చారనుకుందాం. ఆ సమయంలో మీరు రాణితో క్రీడానిమగ్నులై, మైమరచి వున్నారనే అనుకుందాం. ఆయన రాకను ఎప్పుడైతే నేను వాసనబట్టానో వేయికళ్ళతో కాపాడే నాకు ఏ కాస్త సూచన తెలిసినప్పటికీ, నేను సాంకేతిక భాషలో రాణికి తెలియపరుస్తాను. ఆమె ఎన్నటికీ పరవత్వంలో ఈ ప్రపంచానే్న మర్చిపోయ ప్రాణంమీదకి తెచ్చుకోదు. నా సంకేతం ఆమెకర్ణపుటాలకు చేరగానే మిమ్ము బయటికి నా దగ్గరకు పంపే ప్రయత్నం చేస్తుంది. అంతా మెరుపు మెరిసినట్లుగా క్షణాలమీద హడావుడి లేకుండా, ఎలాంటి తొందరపాటు జరిగిన సూచనలు లేకుండా జరిగిపోవాలి.’
‘‘ఒకవేళ ఆ అవకాశం కూడా లేకపోతే, రాజు సరాసరి శయన మందిరంలోకి వచ్చి నన్ను చూస్తే, మరుక్షణంలో ఆయన వాడి కరవాలం నా మెడమీద పడగానే, నా కళ్ళ ఎదుటనే నా తల ఎగిరి బంతివలె కిందపడి దొర్లదా?’’ వీరభద్రుని గొంతు తడి ఆరిపోతుందని సరస్వతికి స్పష్టమైంది.
‘‘అధవా అంత వ్యవధి లేనట్లయితే రాణి చేసే సౌంజ్ఞను మీరు అర్థం చేసుకొని వెంటనే ఆమె పాదాలను ఒత్తుతూ, ఆవలిస్తూ ఉండాలి. మీరు ఆడవేషంలోనే ఉండటంవల్ల రాజు మిమ్ము చూడగానే పురుషుడు అనుకోడు సరికదా, దాస దాసీజనంలో ఒక వ్యక్తి అని పొరబడతాడు. రాణి అప్పుడే రాజు రాకను గమినంచినట్లు. తత్తరపడినట్లు నటించి, చప్పున లేచి కూర్చొని ‘శారదా! ఇక చాలు వెళ్ళు’ అంటుంది. అప్పుడు మీరు వయ్యారంగా, వొత్తుకొని వొత్తుకొని పక్కపక్కలకి చూసుకుంటూ, ఎంతో వినయ విధేయతల్ని నటిస్తూ, మేలిముసుగు నిండా ముఖంమీదికి లాక్కొని చల్లగా వచ్చి, మెల్లగా నా పక్కనే పవళిస్తారు. మనిద్దరమూ రాజు వెళ్ళేదాకా ఊపిరి బిగపట్టుకొని ఉండాలి. ఆ తరువాత మీకు వీడ్కోలిచ్చే ఏర్పాట్లు చేస్తాను. అంతేకానీ రాజును చూడగానే భయపడి ఎగిరి గంతేసి, కాళ్ళకు బుద్ధి చెప్పాలని ప్రయత్నించారో ఆ కాళ్ళు మిమ్ము ఎక్కువ దూరం మోసుకొని వెళ్ళవలసిన శ్రమలేదు. మీ శరీరాన్ని మీరు మోయనవసరం లేదు. అదంతా శవవాహకులే చూస్తారు!’’
వీరభద్రుని ముఖంలో వికార లక్షణాలు కనిపిస్తూ క్షణ క్షణానికి అవి పెంపొందుతున్నవి. ఇంత చెప్పినా అతనికెందుకు నచ్చచెప్పలేకపోయిందో సరస్వతికి అర్థం కాలేదు.
‘‘నూటికి తొంభై తొమ్మిది వంతులు ప్రమాదాలను తప్పించే బాధ్యత నాది. రాణిని రతికేళిలో ఒప్పించి, మెప్పించి ఆమె ఋతుక్రమాన్ని తప్పించే బాధ్యత మాత్రమే మీది. వేసిన పథకంలో ఎక్కడా రంధ్రాలు లేకుండా ఎంత బాగా బిగింపు జరిగిందో మీకీ పాటికి అవగాహన అయి ఉండాలి. మీ సందేహాలన్నిటినీ పటాపంచలు చేశాను కదా! ఇంకా ఆలోచిస్తున్నారేమిటి?’’ అన్నది సరస్వతి.
‘‘ఇదంతా తలచుకుంటే కాళ్ళకింద భూకంపమే వస్తున్నట్లుంది. ఇంతకన్నా మంచి మార్గం ఇంకా సురక్షితమైనది ఏదీ లేదా?’’ అన్నాడు వీరభద్రుడు- అలాంటిదేదైనా ఉంటే సరస్వతి బుద్ధిచాతుర్యాన్ని దాటిపోయేందుకువీలు లేదనే నమ్మకంతో.
సరస్వతి ఛర్రుమన్నది.
‘‘ఉన్నది. ఉదాహరణకు అలనాడు ఉషాకుమారి అనిరుద్ధుణ్ణి ప్రేమిస్తే ఆమె ప్రియసఖి చిత్రరేఖకు ఇంద్రజాల, మహేంద్రజాల, టక్కుటమార విద్యలన్నీ ఎంతతెలిసి ఉండబట్టి, ఆమె అర్థరాత్రి సుఖనిద్రలోన్న అనిరుద్ధుణ్ణి శయ్యతోపాటే ఉషాకుమారి శయన మందిరానికి జేర్చనూ జేర్చింది. అక్కడ అనిరుద్దుణ్ణి ఉషాకుమారితో గాంధర్వ వివాహ క్రీడా విశేషాలన్నీ సక్రమంగా జరిపాక, తిరిగి అతని శయ్యతోపాటే అతన్ని యథాస్థానానికి తీసుకొని వెళ్లింది. ఈవిధంగా అనేక రాత్రులు జరిగి ఉషాకుమారి గర్భవతి అయ్యేదాకా రహస్యం బైటికి పొక్కకుండా సమర్థించగల చిత్రరేఖ చాతుర్యం కానీ, ఆమెకు తెలిసిన సిద్ధులు కానీ నాకు తెలియవు. నేను సామాన్య మానవిని. మా రాణీ అంతే! అందుకని నేను కేవలం నా బుద్ధిచతురతమీదా, లోక జ్ఞానంమీదా, సుతర్కం మీదా ఆధారపడ్డాను. ఇంకొన్నిమార్గాలూ లేకపోలేదు’’ అని సరస్వతి ఆగింది.
నమూనాగా, తాను చెప్పిన మార్గం ఎంత దుర్గమమో , అసాధ్యమో గ్రహించి వీరభద్రుని నోరు మూతపడుతుందేమోనని సరస్వతి అంచనా వేసింది. ఐతే ఇలాంటి విషయాల్లో మొదటినుంచీ తన మూర్ఖత్వాన్ని స్పష్టం చేస్తూన్న వీరభద్రుడు తనలో మార్పు రావలసిన అవసరం లేదని మరోసారి నిరూపించాడు.
‘‘ఆ ఇతర మార్గాలు కూడా చెప్పు’’ అన్నాడు వీరభద్రుడు నీరస స్వరంతో.
‘‘అవి మీకు సంబంధించినవి’’ అన్నది సరస్వతి.
‘‘అవి మీకు సంబంధించినవి’’ అన్నది సరస్వతి.
‘‘అలనాడు విష్ణుమూర్తి జలంధరుని సతి అయిన బృందాదేవిని అనుభవించగోరి ఆమెకు కానీ, ఇతరులకు కానీ ఎలాంటి సందేహమూ కలుగకుండా జలంధరుని వేషంలోనే ఆమెను కలిశాడు. వరూధునిని ప్రేమించిన వేణిమేఘలుడు- ఆమె ప్రవరుని ప్రణయంలో పడి తిరస్కరించబడిందని తెలుసుకొని, ప్రవరుని రూపానే్న వెళ్లి రమించాడు. మీరు కూడా మా మహారాజు రూపాన్ని ధరించి, ఆకాశంలో నుంచి సరాసరి రాణి శయనగారానికి దిగి, ఆమెకు మీ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించి, గాలిలో కలిసి మీ స్వస్థానాన్ని జేరగలిగితే మా అందరికీ క్షీరాభిషేకం చేసిన వారౌతారు!’’
- సరస్వతి సాగించింది:
‘‘లేదా అలనాడు దేవతల నుంచి వరాన్ని పొంది, అదృశ్యరూపుడుగా నలమహారాజు, దమయంతీ రాణివాసంలో జొరబడిన విధంగా మీరు కూడా ఎవరికంటా పడకుండా సప్తదర్పణ శయన మందిర ప్రవేశం చేయగలిగితే మరీ మంచిది!’’
‘‘అసంభవం!’’ అని వీరభద్రుడు నిట్టూర్చాడు.
‘‘అంతవరకూ అర్థమైంది గదా!

- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు