డైలీ సీరియల్

దూతికా విజయం-19

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఉక్కు కడ్డీలనే వొంచిన మీ బాహుబలం, ఇలలనుంచి తైలాన్ని పిండిన మీ చేతి పుష్టి ముట్టుకుంటే కందిపోయే మా రాణిమీద మోటుగా ప్రయోగించకండి. ఆమె కామశాస్త్ర పారంగతురాలు; రసికురాలు; ఆమె ఆశించే రసికత్వాన్ని ఇవ్వగల పురుషుని మెచ్చుకుంటుంది. కామకళలు కరతలామలకాలు తనకని ప్రియునికి తెలియపరుస్తుంది. పున్నామ నరక బాధనుంచి తనను తప్పించేందుకే రుూ తప్పుదారిన ప్రియుని ఆహ్వానించింది. ఆమెను రంజింపజేయటం మీ చాకచక్యం మీదా, కామకళాకౌశలం మీదా ఆధారపడి ఉంటవి!’’
‘‘అర్థమైంది!’’ అన్నాడు వీరభద్రుడు, ఒకేసారి ఐదారు గుటకలు మింగుతూ.
‘‘రాణి మిమ్మే ఎన్నుకొన్న కారణం మీ బ్రహ్మతేజస్సుకూ, బలానికీ అనుగుణంగా తన కడుపుపండితే వాడికి రాజకళ ఉండి, రాజ్యార్హత, యోగ్యతలు ఉంటవి కదానని!’’
తన ద్వారా తన ముందుతరం కూడా తరిస్తున్నదనే ఊహ వీరభద్రుణ్ని పరవశుణ్ణి చేసింది.
‘‘రాణి శయనాగారానికి రెండు దారులు ఉన్నవి. సింహద్వారంలో శారీరకంగా బలిష్టులైన స్ర్తిలు-పురుషులతో సమానంగా పోరాడగల ధైర్యసాహసాలూ, కౌశలమూ ఉన్నవారు కాపలా ఉంటారు. వీరితోపాటు దాస దాసీజనం పడుకొని ఉంటారు. ఆ మార్గం మనకు ప్రమాదకరం, పక్కగా మరో దారి ఉన్నది. రాజుగారు రుూ దారి వెంటనే వచ్చి వెళుతుంటారు. నా మకాం రుూ ద్వారానికి వెలుపల. రాజు వచ్చి వెళ్ళిన సంగతి మిగతా ఎవరికి తెలిసినా తెలియకపోయినా, నాకు తప్పక తెలుస్తుంది.
అదీ రాణికన్నా ముందుగా నేనే ఆయన్ను గమనిస్తాను. తోటలోంచి వచ్చే దారి రుూ దారిని కలుస్తుంది. మిమ్ము శయనాగారం వరకు తీసుకొని వెళ్ళాక, నా పక్కనే పడుకోబెట్టుకుంటాను. అంతటా సద్దుమణిగిందని దృఢంగా తెలుసుకున్నాక, సాంకేతిక సూచనలో రాణికి తెలియపరుస్తాను. ఆమె అంగీకారాన్ని కూడా సాంకేతికంగా నాకు తెలియపరుస్తుంది’’ అన్నది సరస్వతి.
‘‘ఎంత తతంగం!’’ అని ఆశ్చర్యాన్ని ప్రకటించాడు వీరభద్రుడు.
‘‘అనన్య సామాన్యమైన దాన్ని లభింపజేసుకునేందుకు ఎంతో శ్రమా, కష్టమూ, ప్రమాదమూ ఉండక తప్పవు... ఇంకా ఉన్నది వినండి; మీరు ఆడవేషం కట్టినప్పటి నుంచీ నాకు చెల్లెలుగానూ, ‘శారద’ అనే పేరుతోనూ వ్యవహరించబడతారు. నన్ను ‘అక్కా!’ అని సంబోధించాలి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే నోరు మెదపవచ్చు...’’
‘‘ఏమిటా అత్యవసర పరిస్థితి? అసలు నోట మాట రాకూడదనే అన్నావు కదా!’’ అన్నాడు వీరభద్రుడు తన తికమకను స్పష్టపరుస్తూ.
‘‘చెపుతాను. మీ పంచేంద్రియాలూ ఎంతో మెలకువగా ఉండాలి. ఎంత చిన్న శబ్దాన్నయినా వినగలిగే సామర్థ్యత, ప్రతి వస్తువునూ నిశితంగా చూడగలిగే నేర్పు, అసలు వస్తువు వెనుక దాగిఉన్న భావాన్ని అర్థం చేసుకునే ఓర్పు అవసరం... ఉదాహరణకు ఏ ఆడ కాపలాదారో ఎవరని అడిగిందనుకోండి. ‘మా చెల్లెలు శారద!’ అని నేను జవాబు చెపుతాను. మీ రూపమే ఆమెను మోసగిస్తుంది కనుక, నేను రాణి ప్రియసఖిని కనుక ఆమె మారుమాటాడకుండా వెనుదిరుగుతుంది. మీరు రహస్యంగా ఆమెకు వినపడీ వినపడకుండా ఉండేట్లు ‘ఎవరే అక్కా?’ అనాలి. కంఠస్వరం స్ర్తి స్వరాన్ని అనుకరించాలి. అది సాధ్యం కాకపోవచ్చు కనుకనే, రహస్యంగా అనమన్నాను. ‘అక్కా!’ శబ్దం వినగానే ఏమైనా మిగిలిన అనుమానాలుంటే అవి పటాపంచలౌతవి. మీరు శయన మందిరంలో ఉండగా వెలుపల నుంచి ఏమైనా ప్రమాదం సంభవించే సూచనలుంటే సాంకేతికంగా నేను రాణికి తెలియపరుస్తాను. అప్పుడామె మిమ్ము జాగ్రత్తగా సాగనంపుతుంది. మీరు మెల్లిగా పిల్లివలె వచ్చి నా పక్కన పడుకోవాలి. ప్రమాదం దాటిపోయాక మిమ్ము లోనికి పంపాలో బైటికి పంపాలో నిర్ణయించుకొని తదనుగుణంగా ప్రవర్తిస్తాను.’’
‘‘నేను శయన మందిరంలో వుండగా రాజుగారే వస్తే? ముందుగా తలుపు కొడతారా? అప్పుడు రాణి ననె్నక్కడ దాస్తుంది? గదిలో అమర్చబడిన దర్పణాలు నన్ను తేలిగ్గా పట్టిస్తవి కదా?’’ శతృసైన్యం గుంపుగా మీదపడి వాడి ఆయుధాలు ఝుళిపిస్తున్న విధంగా ఒక అనుమానాల దొంతర భారం కింద వీరభద్రుడు అణిగి అణువుగా మారిపోతూన్నట్లు బాధతో అడిగాడు.
‘‘వరహాల ఖరీదు చేసే ప్రశ్నలడిగారు. చెపుతాను వినండి: రాణి శయనాగారానికి బలిష్టమైన తలుపులైతే ఉంటవి కాని, అవి ఎప్పుడూ మూయబడవు. నిర్జీవమైన శ్రేష్ఠమైన కొయ్య తలుపులకన్న, సజీవమైన చెలికత్తెలూ, యోధుల్నికూడా ఎదుర్కోగల యువతులే జాగ్రత్తగా పహారా ఇస్తుంటారు. కనుక తలుపులు మూయవలసిన పనే లేదు. అయితే దట్టమైన గుడ్డతో తయారైన తెరలు ఈ ద్వారానికి దింపబడి ఉంటవి. ఎవరూ ఆ శయనాగారం వైపు తొంగి చూసేందుక్కూడా సాహసించరు. ఎంత గాలి కొట్టినా తెరలు ప్రక్కలకు తొలగడం కాని, పైకి లేవటంగాని జరుగకుండా ఏర్పాట్లు చేయబడినవి. ఎవరైనా లోపలికి ప్రవేశింపదలిస్తే, కొంత ప్రయత్నంమీద తెర తొలగించుకొని వెళ్ళవలసిందే! ఈ పద్ధతులు ఎందుకు ప్రవేశపెట్టారంటే- తలుపులు మూయటం తెరవటం వల్ల అవి కీచు కీచుమనే శబ్దాలు చేయవచ్చు. రాణి శయన మందిరంలోకి ఆమె, రాజు తప్పమిగతా ఎవ్వరూ ప్రవేశించవలసిన అవసరం సామాన్యంగా ఉండదు కనుక, ఎట్టి పరిస్థితుల్లోనూ మూసిన తలుపుల ముందు మహారాజు నిలబడి ఉండవలసిన హాస్యాస్పద స్థితి సంభవించరాదు. నిరాటంకంగా ఆయన లోనికి వెళ్లిపోవాలి. ఆయన రాకపోకలు రాణీకి, ఆ తెరలకూ తప్ప సాధ్యమైనంవరకూ ఇతరులకు తెలియరావు’’-
‘‘ఆయనకు ఇంత సులభంగా ప్రవేశం ఉంటే లోపల ఇరుక్కుపోయిన నాకు రక్షణ ఏమిటి?’’ అన్నాడు వీరభద్రుడు రాణితో తాను గడిపే దివ్యానుభూతికి మధ్యలో రాజు వచ్చి అడ్డుపడినట్లే భావించగా కలిగిన భయకంపనం కంఠంలో ధ్వనింపజేస్తూ.
‘‘రాజురాణి శయనాగారానికి రాదలచుకుంటే సూర్యాస్తమయంలోగానే కబురు చేస్తారు.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు