డైలీ సీరియల్

దూతికా విజయం-18

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘వెలుగు మన పథకానికి పరమ విరోధి. రాణి శయనాగారంలో కూడా దేదీప్యమానంగా ఉండే వెలుగు ఉండదు. కన్ను కాస్త అలపడితే అంతా స్పష్టంగా కనిపించే వెలుగు మాత్రమే ఉంటుంది!’’
‘‘ఆమెతో మాట్లాడవచ్చునా?’’
‘‘ఇంకా నయం! మీరు తిరిగి కోట బయటకు అడగుపెట్టేదాకా మీలో మీరే ఎన్ని మాటలైనా మాట్లాడుకోవచ్చు. పైకి గట్టిగా ఒక్క నిట్టూర్పు కూడా విడువరాదు. నీ ఊపిరి తీయటంకూడా వినిపించేటంత నిశ్శబ్ద వాతావరణంలో సంచరించాలి...’’
ఈ చీకట్లో చిందులాట ఊహకు అందక వీరభద్రుడు తికమకపడ్డాడు.
సరస్వతి సాగించింది.
‘‘మీరు స్వప్నంలో కూడా చూసి ఉండనంత అందంగా అలంకరించబడి వుంటుంది శయనాగారం. శయనాగారంలో సువాసన నూనెలు తాగుతూ మంద్ర సుగంధపు వెలుగునిచ్చే దీపాలుంటవి. మంచం మీద పరుపులు, తలగడలు గాలికి కూడా కుంగిపోయేటంత మెత్తనివి. ఆ స్పర్శే మీకో నూతనానుభూతిని, బహుశా అస్వభావికమైనదవటంవల్ల ఏదో తెలియని భయాన్ని రేకెత్తించవచ్చు.. తెలుస్తోందా?’’
వీరభద్రుడు చెప్పమన్నట్లు తల ఆడించాడు.
‘‘గదిలోకి ప్రవేశించే ద్వారం ఒక్కటే. మిగతా మూడు గోడలకూ, హంస తూలికా తల్పానికి సమమట్టం మూడు పెద్ద నిలువుటద్దాలు అడ్డంగా బిగించబడి ఉంటాయి. మంచానికి తలవైపునా, కాళ్ళవైపునా రెండు నిలువుటద్దాలు నిలువుగా బిగించబడి ఉంటాయి. మంచం పైభాగంలోని పందిరికి మరో పెద్ద నిలువుటద్దం పొడుగులో అమర్చబడి ఉంటుంది. అద్దాలన్నీ బంగారు చట్రాలలో ఉంటవి... మా రాణి శయనాగారాన్ని ‘సప్తదర్పణ శయన మందిరం’ అంటారు.
‘‘రాచనగరులోని ఏర్పాట్లన్నీ రాజుగారి అభిరుచులకు అనుగుణంగా ఉంటవి. మీకు కామశాస్త్ర పరిజ్ఞానం కొంత ఉన్నట్లయితే ఈ ప్రశ్న అడిగి ఉండేవారు కాదు. శృంగారాన్నంతా సజీవంగా ఉండే ప్రతిబింబాలలో ఎటు తల తిప్పినా గోచరిస్తుండే విధంగా రుూ దర్పణాలు అమర్చబడినవి. అంటే కొత్త ఉద్రేకాలు, ఉత్సాహాలూ ప్రేయసీ ప్రియుల్లో అగ్నిపర్వతాల వలె పగిలి, వేడి వేడి అర్ధ ఘన పదార్థాల్లాటివి ఉవ్వెత్తుగా లేచి పతనమవటం లాంటిదీను. విద్యుల్లతలు, నరనరాల్లోనుంచీ ప్రవహించేలాంటి అనుభూతులు కలుగుతవి. మానసికమైన కామోద్రేకం రెట్టించి మిన్నుముట్టేందుకే రుూ అమరిక! అదీగాక కొత్త వ్యక్త్ఛియలు కూడా దర్పణాల్లో స్పష్టవౌతవి. గదిలో ఏ మూల ఏమున్నదో వెతికి చూడకుండా తలను వలయాకారంలో తిప్పితే ఒక్కసారి అంతా కళ్ళకు కట్టినట్లవుతుంది... మరో ఉద్దేశ్యమేమంటే తెల్లవారి లేచి ఇతరులకు ముఖాలు కనబడకుండా రాజ కుటుంబీకులు తమ కంటిపాపనే చూసుకునేందుకు వీలుగా రుూ ఏర్పాటు చేయబడింది.’’
చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పే నాగలోకపు వింతలు వీరభద్రుని మనసులో మెదులుతూన్నవి. సరస్వతి విడమరిచి చెపుతూంటే అంతా కళ్ళకు కట్టినట్లవుతోంది. నిజంగానే తాను రాణి శయనాగారం ప్రవేశిస్తే అది కేవలం అపరిచిత స్థలంగా తోచదనే అభిప్రాయం ఏర్పడుతోంది.
‘‘నేలమీద మెత్తని పట్టు తివాసీలు పరిచి వుంటవి. మీ బరువుకు అవి కుంగి కాలు ఎత్తుతూంటే దాంతోపాటే యథారూపాన్ని పొందుతుంటవి. వాటిమీద నడుస్తూంటే పాముమీద కాలు వేసినట్లుంటుంది. కాళ్ళలో గిలిగింతలు పెట్టినట్లుంటుంది.’’
‘‘ఇంకా!’’అన్నాడు వీరభద్రుడు కొత్త ఉత్సాహానికి గురైన సూచనగా.
‘‘కుడ్యాల మీద పచ్చి శృంగార చిత్రాలు కన్నుల పండువగా వేళాడుతూంటవి. ఆ వాతావరణంలో నపుంసకుడికి కూడా పుంసకత్వం వచ్చి తీరాలి.’’
సరస్వతి కాస్త ఆగి వీరభద్రుని ముఖంలోకి చిలిపిగా చూసింది. అతను చలించి, చిరునవ్వు నవ్వటం ఆమెకెంతో తృప్తినిచ్చింది.
‘‘కొత్తకొత్త సువాసనలు మీ ముక్కుపుటాలకు సోకుతవి. అత్యద్భుతమూ, అపురూపమూ ఐన ఆ సువాసనల మత్తు కొత్త అనుభూతిని ఇచ్చి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. కామప్రేరిత మండలాల మీద ఆ సువాసనల ప్రభావం అమోఘమని కొమ్ములు తిరిగిన కామశాస్తజ్ఞ్రుల అభిప్రాయం!’’
‘‘తరువాత’’?అన్నాడు వీరభద్రుడు సరస్వతి చెప్పటం ఆపేస్తుందేమోననే భీతి ప్రకటిస్తూ.
‘‘ఇంతవరకూ మీరు మూర్ఛపర్యంతం కాకుండా ఎలాగో నిలదొక్కుకోవచ్చేమో? కాని మా రాణిని చూస్తే నేను అతిశయోక్తులు చెప్పలేదని, నిజానికి ఆమె సౌందర్యంలో పదోవంతుకూడా వర్ణించలేని నా అసమర్థతను ప్రకటించానని మీరు తెలుసుకుంటారు. ఆ కుసుమ కోమలాంగిని చూసిన పురుషుడు షండుడైనా, ఎండిమోడైన కోర్కెల గూడయినా సరే- ఆ క్షణంలో మోహావేశంతో ఉక్కిరిబిక్కిరి కాక తప్పదు.
‘‘సర్వాలంకార భూషితమైన వెనె్నల వెలుగుల్లాంటి కమ్మని కాంతి వెదజల్లగలిగే అందచందాలతో తమ రాకకు ఎదురుచూస్తుండే ఆ అన్నుల మిన్న, సౌందర్యరాశి, అందాల బరిణె చిరునవ్వుతో తమకు నమస్కరించి ఘన స్వాగత సూచన చేస్తుంది.’’
‘‘నాకా నమస్కరించేది?’’ వీరభద్రుడు ఆశ్చర్యంతో నోరు సగానికి తెరిచాడు.
‘‘ఔను. మీరు దాతలు కదా!’’
‘‘ఓహో! ఏమి నాగరికత! ఏమి సంస్కారం! ఆమె గ్రహీత అయినా హోదాలో గొప్ప అంతస్తులోఉన్న కారణాన ఆమెను చిన్నబుచ్చకుండా నేను ప్రతి నమస్కారం చేస్తాను!’’ అన్నాడు వీరభద్రుడు.
వీరభద్రుడు దారిన పడినందుకు సరస్వతి సంతోషించింది.
‘‘ఎంత ఉద్రేక ఉద్వేగాలు కలిగినా మాటమాత్రం వెలికి రారాదు. పాము కుబుసం వంటి చీరెలోంచి ఆమె శరీరంలోని వొంపులన్నీ మీకు సుస్వాగత గీతికలను ఆలపిస్తూంటవి. మాటలతో చెప్పదలచుకున్నదంతా చేతలతోనే ప్రదర్శించి ప్రయోజకత్వాన్ని, అర్హతను చూపాలి సుమా!’’
‘‘గ్రహించాను!’’ ఉద్రేక తరంగం వీరభద్రుని గొంతులోంచి దూసుకొని వొస్తోంది.

- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు