డైలీ సీరియల్

తత్త్వం తెలిస్తే చింతే లేదు( పురంజనో పాఖ్యానం - 5)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగస్త్యుడు మలయధ్వజుని కుమార్తె వల్ల దృఢచ్యుతుడ నే పుత్రుడిని కన్నాడు. ఆ దృఢచ్యుతుడు కూడా పెద్దవాడై వివాహం చేసుకొని ఇధ్మవాహుడు అనే కుమారుడిని పొందాడు.
అపుడు మలయ ధ్వజుడు సంసారం పై విరక్తిని పెంచుకున్నాడు. వివాహాలు సంతానం కనడాలు మళ్లీ వారికి వివాహాలు చేయడం లాంటి వ్యవహారాలపైన విరక్తి చెంది వీటిని అన్నిటినీ వారసులకు వదిలిపెట్టి తాను అడవులకు పయనించాడు. మలయధ్వజుని తో పాటు అతని విదర్భరాజ పుత్రికగా ఉన్న పురంజనుడు కూడా వెళ్లాడు.
మలయధ్వజునినే అతని భార్య అనుసరించింది. వ్యామోహాలు వీడి నిత్య సంతోషి యైన శ్రీమన్నారాయణుని సేవలో వారిద్దరూ గడుపుతున్నారు.
అట్లా కాలం గడుపుతున్నపుడు ఒకరోజు మలయధ్వజుడు మరణించాడు. భర్త పరిచర్యలే తన దినచర్యగా చేసుకొన్న అతని భార్య ఆవిషయాన్ని గ్రహించి తన భర్త లేకపోతే తాను ఉండలేనని భోరున ఏడ్చింది. ఎలుగెత్తి సర్వదేవతలను పిలిచి తన భర్త ప్రాణాలను కాపాడమని రోదించింది. ఎంత ఏడ్చినా తిరిగిరాని లోకాలకు వెళ్లిన మలయధ్వజుని విడిచి ఉండలేక తాను కూడా చితిని ఏర్పాటు చేసుకొని అందులో దూకపోయింది విదర్భరాజ తనయ.
అపుడు అక్కడికి విజాతుడు వచ్చా డు.
‘ఓ కోమలీ! సుందర వనితా నీవు ఎవరివి? ఎందుకోసం చితిలో దూకబోతున్నావు? ’అని అడిగాడు.
విజాతుడిని గుర్తించలేని స్థితిలో విదర్భరాజ పుత్రికగాను, మలయధ్వజుని భార్యగా ఉన్న పురంజనుడు గట్టిగా రోదించి జరిగిన సంగతి చెప్పి భర్తలేని లోటును నేను అనుభవించలేనని అందుకే మరణించాలనుకొంటున్నానని చెప్పాడు
అపుడు అవిజాతుడు గత స్మృతులను పురంజనునికి తెలియచెప్పాడు. పూర్వం మనిద్దరం మిత్రులని గుర్తుచేశాడు. నీవు పురంజనుడివి కానీ ఈ మలయధ్వజుని కుమార్తెవు కావు. అంతకుముందు నీ ప్రేయసికి భర్తవు కావు ఇదంతా మాయ. నీకొడుకులు కూతుర్లు కూడా మాయనే వారంత ఎక్కడివారు? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని అడగగానే పురంజనుడికి ఏంచేయాలో నేను ఎవరిని అనుకొంటూ సందేహంలోపడి పోయాడు.
అపుడు అవిజాతుడు పురంజనుడికి మనిద్దరమూ స్నేహితులమ ని ఒకే సరస్సు లో నివసించే హంసలమని జ్ఞప్తికి తెచ్చాడు. మనం మన నివాసాన్ని విడిచిపెట్టి క్షుద్రసుఖాలను కోరుకుంటూ భూమండలంలో తిరిగాము. నేను తిరిగి మన నిజవాసానికి వచ్చాను. కానీ నీవు మాత్రం కామినీ నిర్మితం, పంచారామం. నవద్వారం, ఏకపాలకం, త్రికోష్ఠకం, షట్కులం, పంచవిషణం, పంచప్రకృతి, స్ర్తి నాయకం అయిన ఒక పురాన్ని చూశావు. దానిలో మాయలో పడిపోయావు అక్కడ నుంచి ఇక్కడ దాకా ప్రయాణం చేశావు. రెండు జన్మలు ఎత్తావు కానీ నీలో జ్ఞానం అంకురించలేదు. పైగా ఇపుడు రోదిస్తున్నావు అసలు నీకు కనిపించిన ఆ పురానికి అర్థం తెలుసా ..
పంచారామాలున్నాయి కదా అంటే పంచేద్రియాలైన శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనేవి. నవద్వారాలు అంటే ముక్కు లాంటి మనిషి ఉండే తొమ్మిదిరంధ్రాలు. ఏక పాలకం అంటేప్రాణం, త్రికోష్టాలు అంటే భూమి, అగ్ని, జలం అనేవి షట్కులములు అంటే నాలుక, కన్ను , చెవి , ముక్కు , చర్మం , మనస్సు అనే జ్ఞానేంద్రియాలు అనేవి ఆరు. విపణములు అంటే వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థ అనే కరేంద్రియాలు. పంచ ప్రకృతి అంటే పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు. కామిని అంటే బుద్ధి, ఇటువంటి పురం అంటే మన దేహం. నీవు స్ర్తికాముకుడివి అయ్యావ. అంటే అజ్ఞానివై ఆమెనే నిత్యం అనుకొంటూ స్మృతిని కోల్పోయావు.
అంతేకానీ నీవు మలయధ్వజుని భార్యవు కావు. విదర్భ రాజు పుత్రికవు కావు నీకు మలయధ్వజుడు మగడు కాదు, కోమలి భార్య కూడా కాదు. నీవు పురంజనుడివి. ఇది కేవలం శరీరం శరీరంలోపల ఉండే ఆత్మనే నిజమని నేను ఆనాడు నీకు చెప్పానుకదా. ఈ శరీరంలో క్షణభంగురమైంది. ఉంటుంది. మృత్యువుచేత వాడినేలపై పడిపోతుంది ఆ తరువాత కట్టెల మంటలో కాలిపోతుంది. కానీ ఆత్మనిత్యసత్యమై పరమాత్మునితో సంగమం అవుతుంది. ఇది నిజం అని చెప్పాడు. అపుడు పురంజనునికి అసలు సంగతి అర్థమైంది.జ్ఞానం ఉదయించింది. అలా ఆ మిత్రులిద్దరూ కలుసుకొన్నారు.

అయపోయంది.

- డా. రాయసం లక్ష్మి. 9703344804