డైలీ సీరియల్

వేటైనా నియమావళి తప్పదు( పురంజనోపాఖ్యానం - 4)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకనాడు పురంజనునికి వేటకువెళ్లాలనే కోరిక పుట్టింది. వెంటనే కవచము ధరించాడు. బాణాలను అమ్ముల పొదిని పట్టుకొని రాణిని విడిచి వేటకు వెళ్లాడు. వేటాడుతూ వెళ్లి వెళ్లి దారిలో ఉన్న సెలయేరులో స్నానం చేశాడు. మంచి గంధాన్ని అలుదుకున్నాడు. తిరిగి బాణాలు పట్టుకొని వేట ప్రారంభించాడు.
అలా వెళ్లుతూ మృగాలను వేటాడంలో మంచి ఆసక్తిని పెంచుకుని ఆ ఆసక్తిలో వేటనియమాలను మరిచి కుందేళ్లను, పందులను, ఆడ సవరపుమేకలను, నల్లచారల దుప్పిని, కానెనుపోతును, ఏదుపందిని, ఆడుజింకను, ఏనుగును, సింహాన్ని, తోడేలును, పెద్దపులి, కోతిని ఇలా ఏ జంతువునంటే ఆజంతువును చంపుకుంటూ వెళ్లాడు. వేట రాజులకు విధించిన విధుల్లో ఒకటి అయినా దానికి కూడా కొన్ని నియమ నిబంధనలుంటాయి. వాటిని కూడా తోసిరాజని అవసరమైనవే కాక అనవసరమైన జంతువులను కూడా చంపండం ప్రారంభించాడు. రాత్రి దాకా బాగా వేటాడి వేటాడి అలసి పోయి చివరకు ఇక వేటాడలేని స్థితికి చేరుకొన్నాక అపుడు ఇంటికి వచ్చాడు.
బాగా అలసి నందువల్ల వేడినీరు స్నానం చేయాలనుకొన్నాడు. రాజు గారు కనుక ఆయన రాగానే ఆయన కోరిక అనుసారం వేడినీరు స్నానాల గదిలో పరిచారికలు అమర్చారు. ఆ తరువాత కమ్మటి భోజనం చేశాడు. ఇక అపుడు రాణి గుర్తుకు వచ్చింది. ఆమెకోసం అంతఃపురాన్నంతా వెతికి ఎక్కడా ఆమె కనిపించకపోయేసరికి బాగా బాధపడ్డాడు. ఆ బాధతోనే అక్కడ ఉండే పరిచారికలను మీరాణిగారు ఏరి అని అడిగాడు. వారు ఆమె కోపగృహం లో ఉందని ఆమెకు చాలాకోపం వచ్చింది. నేలమీద పడుకుని ఉందని చెప్పారు.
వెంటనే పురంజనుడు ఆమె దగ్గరకు వెళ్లిపోయాడు. పురంజనుడు కోమలికి కోపం రావడం సహించలేకపోయాడు. ఆమె పై ప్రేమను పెంచుకున్న పురంజనునికి ఆమె కింద పడుకుని ఉండడం చూడలేకపోయాడు. వెంటనే ఆమె పాదాలను తన ఒళ్లో పెట్టుకుని ఆమెను ఎంతో బతిమాలాడు. లేచి పరుపుపై పడుకోమని , ఆహారాన్ని తీసుకోమని తనను అనుగ్రహించమని వేడుకున్నాడు.ఆమె అపచారం చేసిన వారిని ఎవరినైనా దండిస్తానని, వారికి ఉరిశిక్ష ను వేస్తానని కూడా చెప్పాడు. ఆఖరికి త్రిలోకాల్లో ఎవరు ఆమెను కనె్నత్తిచూసినా తాను ఊరుకోనని చెప్పాడు.-
- ఇంకాఉంది