డైలీ సీరియల్

మనిషి కోరికలకు బానిసైతే... ( పురంజనో పాఖ్యానం - 3)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పురంజనుడికీ కోమలి ఇద్దరూ ఆనందంగా కాలం గడుపుతున్నారు. కోమలి పురానికి ఇప్పుడు పురంజనుడే రాజు అయ్యాడు. ఆయనకు తోడుగా అక్కడ ఉండే వారు సహాయపడడానికి కోమలి ఆజ్ఞతో ముందుకు వచ్చారు.
తొమ్మిది ద్వారాలున్న ఆ పురంలో తూర్పున ఐదు దక్షిణాన ఒకటి, ఉత్తరాన ఒకటి పడమర రెండు ఇలా నాల్గు దిక్కులలో మొత్తం తొమ్మిది ద్వారాలున్నాయని వాటిని చూడడానికి పురంజనుడు బయలుదేరాడు. మొదట తూర్పువైపు ఉన్న ద్వారాలల్లో ద్యుమంతుడు అనే చెలికాడు కలసి బయలుదేరి విభ్రాజితం అనే జనపదానికి వెళ్లాడు. అక్కడి అందచందాలు అక్కడి జానపదుల గురించి పురంజనుడు తెలుసుకొన్నాడు. తూర్పువైపునే నళిని, నాళిని అనే రెండు ద్వారాలు నుండి అవధూత అనే స్నేహితుడితో కలసి సౌరభము అనే ప్రాంతానికి వెళ్లి వచ్చాడు. ఆ తరువాత తూర్పునే ఉన్న ప్రధాన ద్వారం ముఖ్య. దీనిలో విషణుడు అనే మిత్రునితో కలసి ఆ ముఖ్య కు వెళ్లి అక్కడ ఉన్న ఆపణ బహూదనములు అనే విషయాలను వెళ్లేవాడు.
దక్షిణ ద్వారం పేరు పితృహువు. శ్రుతధరుడనే మిత్రునితో కలసి ఈ ద్వారం నుంచి పాంచాలం అనే రాష్ట్రానికి పురంజనుడు వెళ్లివచ్చాడు. ఆసుని అనే పడమటి వాకిలి నుంచి దుర్మదుడు అనే సంగడీనితోకలసి గ్రామకము అనే దేశానికి వెళ్లి వచ్చాడు. నిరృతి అనే పడమటి వాకిలి నుంచి లుబ్ధకుడు అనే వానితో కలసి వైశసానికి వెళ్లి వచ్చేవాడు. ఉత్తరం వైపున ఉన్న ద్వారం నుంచి శ్రుతధరునితో కలసి ఉత్తర పాంచాలానికి వెళ్లి వచ్చేవాడు.
ఆ పురంలోనే ఇక్కడ అక్కడ తిరగాలనుకొంటే ఏదైనా పనులు చేయాలనుకొంటే నిర్వాక్కు, పేశస్కరుడు అనే గుడ్డివారితో సాయం గమనము , కరణము అనే పనులను నెరవేర్చేవాడు. అంతఃపురంలోఉన్నపుడు విషూచీనముఅనే వానితో కలసి ఉండేవాడు.
ఎప్పుడూ భార్యాలోలుడై ప్రవర్తించేవాడు. ఆమె నవ్వితే నే తాను నవ్వేవాడు. ఆమె దుఃఖంతో ఉంటే తాను దుఃఖాన్ని పొందేవాడు. ఆ కోమలిని ఎప్పుడూ సంతోషపెట్టడంలోనే కాలాన్నంతా గడిపేవాడు. దానివల్ల ఆమెకు బాగా లోకువ అయ్యాడు. అందరూ భార్యాదాసుడని అనేవారు కానీ పురంజనుడికి ఇవేమీ పట్టక ఎపుడూ కోమలి నవ్వుతూ ఉండాలని ఆమెతోనే ఉండిపోయేవాడు.
- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804