డైలీ సీరియల్

కనిపించేదంతా నిజమూ కాదు...( పురంజనో పాఖ్యానం - 1)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

3పురంజనా నీవు ఎంత చెప్పినా వినడంలేదు. కానీ ఆత్మ అన్నదే నిత్యం కానీ మరేదే ఈలోకంలో నిత్యం కాదు.2 అన్నాడు అవిజాతుడు.
3అవిజాతా! ఇట్లా నీవు నేను మాట్లాడుకుంటూ ఉంటే ఇది ఇప్పట్లో తేలే విషయం కాదు. ఆత్మ నిత్యం పరమాత్మ నిత్యం కానీ కనబడే దంతా అబద్ధం అనిత్యం అంటావు నేను ఎలా అవునంటాను. చూడు నీవు నా మిత్రుడివి. నాకో భార్య పిల్లలు ఉన్నారు. నీకు భార్యా పిల్లలు ఉన్నారు. వారి నుంచి మనకు ఎంతో మంది బంధువులున్నారు. వీరంతా క్షణంలో మాయమైపోతారు అంటావు. కానీ నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదు. సరే ఇక ఈరోజుకి ఇక్కడితో మన చర్చ ఆపేద్దాం. నేను కాసేపు అట్లా వెళ్లి వస్తాను2అన్నాడు పురంజనుడు.
3వెళ్లు వెళ్లు పురంజనా నీకు అన్నీ అర్థమవుతాయిలే నాకు ఏమీ చింత లేదు. నేను ఇక్కడే ఉంటాను. నీవు అలా తిరిగి రమ్ము2 అవిజాతుడు.
అలా బయలుదేరి వెళ్లిన పురంజనుడు చాలా దూరం నడిచి వెళ్లాడు. అక్కడ అతనికి ఒక వింత దృశ్యం కనిపించింది.
అది ఒక గొప్ప రాజప్రసాదంలాగా ఉంది. దానికి తొమ్మిది ద్వారాలు వాటికి తగిన తలుపులు,, కిటికీలు, వెలుపలి ద్వారం, గుమ్మాలు, గోపురాలు, ఎతె్తైన కోటగోడలు ఆ ద్వారాలనుంచి పొడవైన మంచి వెడల్పుతో కూడిన వీధులు కనిపిస్తున్నాయి. కోటబురుజులు బంగారం వెండి తో చేసిన నగషీ చూడ చక్కగా ఉండి ఆకర్షిస్తోంది. దాన్ని చూసిన పురంజనుడు ఇది ఏమిటి ఈ హిమవత్పర్వత దక్షిణ సానువుల్లో ఇంత పెద్ద రాజప్రసాదం ఉంది. ఇది ఎవరిదై ఉంటుంది.
ఇందులో ఎవరు ఉంటున్నారు. చాలా ఆశ్చర్యంగా ఉందే అనుకొంటూ ముందుకు వెళ్లాడు. ఆ పురద్వారం నుంచి కాస్త ముందుకు వెళ్లగానే అక్కడ పసిడి వెలుగులతో మెరిసిపోతున్న సుందర గృహాలు, రత్నాలు, కెంపులు, మాణిక్యాలను అమ్ముతున్న అంగళ్లు, రచ్చబండలు, పూలతో నిండిన ఉద్యానవనాలు కొత్త కొత్తగా రకరకాల పరిమాణాలతో ఉన్న ముత్యాలు తాపిన గృహగోడలు, పగడాలు కూర్చి కట్టిన తినె్నలు వింత ఆశ్చర్యాన్ని గొలిపే ఎన్నో వింత దృశ్యాలు చూసి మైమరిచి అక్కడే ఉండిపోయాడు పురంజనుడు.
తనకు తెలియకుండానే మెల్లమెల్లగా ఉద్యానవనంలోకి అడుగు పెట్టాడు. అక్కడ చల్లని నీటితో నిండిన తటాకం కనిపించింది. దానిలో కలువలు విరబూసి ఉన్నాయి. ఆ కలువలపైన పక్షులు, తుమ్మెదలు వింత ధ్వనులు చేస్తున్నాయి. రాజహంసలు,చిలుకలు, కోయిలలు చక్కని రాగాన్ని తీసున్నట్లు వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. పైనుంచి జాలువారే జలపాతం కూడా కనిపించింది. ఆహా ఎంత సుందరంగా ఉంది అని పురంజనుడు అనుకొంటూ అడుగులు వేస్తున్నాడు.
అంతలో అక్కడ ఒక నవయవ్వన యువతి రావడం కనిపించింది. ఆమెతో కూడా పది మంది అనుచరులు దగ్గర దగ్గరగా వస్తున్నారు. ఆ అనుచరుల వెనుక నూరుమంది మనుష్యులు ఉన్నట్లు గుంపులు గుంపులుగా మనుష్యులు వస్తున్నారు. ఆమె కన్నా ముందుగా ఐదు తలల పాము నడుస్తున్నది. పురంజనుడు ఆమెను చూసి 3ఆహా! ఎంత సుందరంగా ఉందీ ఈ పడచు. ఊర్వశి కన్నా అందంగా ఉంది అని నేను అన్నా అది అతిశయోక్తికాదు.
ఈమె కనులు చూస్తుంటే ఎవరికోసమో వెదుకుతున్నట్టు ఉంది. అయినా ఈ మె ముందు ఆ పాము ఎందుకు నడుస్తున్నది? ఈమె చుట్టూ ఈ అనుచరులు ఎందుకు వస్తున్నారు? నేను ఈమెను వివాహం చేసుకొంటే ఎంత బాగుండు.. అయినా ఆమెకు నేను నచ్చుతానా... నేను ముందు మాట్లాడానా.. అతివలు చొరవ చూపిస్తే కోపగించుకుంటారు. కానీ వారి కోపం వెనుక సంతోషం కూడా ఉంటుంది.

- డా. రాయసం లక్ష్మి. 9703344804