డైలీ సీరియల్

విశ్వనాథ్ గోడ్బోలే..3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘చిన్న సేటూ! మీరు వయస్సులో ఇంకా చిన్నవారు. ప్రపంచ జ్ఞానం బాగా రావాలి. డబ్బు విలువ సంపాదించేవారికే తెలుస్తుంది’’
‘‘గోడ్బోలే! నీకు ఎన్నాళ్ళనుండి ఉద్యోగం చేస్తున్నావు?’’
‘‘ఐదేళ్ళ నుండి’’
‘‘నెలకు ఎంత సంపాదిస్తున్నావు?’’
‘‘ఐదు వేలు’’
‘‘కర్తార్ సింగ్ ఎన్నాళ్ళనుండి చేస్తున్నాడు?’’
‘‘పదేండ్ల నుండి’’
‘‘ఎంత సంపాదిస్తున్నాడు?’’
‘‘రోజుకు పది రూపాయలు’’
‘‘గోడ్బోలే! నేను బొంబాయి వెళ్ళి క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్‌లో ఒక్కరోజులో లక్ష రూపాయలు సంపాదిస్తాను. ఒక్కసారి మద్రాసు గిండీ రేసులో పాల్గొంటే నీవు జీవితమంతా సంపాదించిన మొత్తం నేను ఒక్క రోజులో సంపాదించుకోగలుగుతాను తెలుసా?’’
‘‘చిన్నసేటూ! అది అనైతికం’’
‘‘ఈ నీతి, అవినీతి, ధర్మం, అధర్మం వంటి పదాలన్నీ అసమర్థులు తమ కవచకుండ లాలుగా వాడుకుంటుంటారు. ఏది ధర్మం? ఏది అధర్మం?
గంట కొట్టేవాడు గుడిలో గంట కొడుతున్నాడు-
బండ కొట్టేవాడు వీధిలో ఎండలో బండ కొడుతున్నాడు. ఈ సమాజాన్ని ఎవరూ మార్చలేరు. అందుకని నా దారేదో నేను చూచుకున్నాను’’
‘‘అంటే తండ్రి సంపాదన మీద ఆధారపడటమేనా?’’
‘‘ఓరి పిచ్చి విశ్వనాథయ్యా! మా తండ్రి వాళ్ళ తండ్రి సంపాదన మీద ఆధారపడ్డాడు. మా తాత మా ముత్తాత కూడబెట్టిన ఆస్తి మీద ఆధారపడ్డాడు. ప్రపంచంలో ఈ వ్యవస్థ ఇలా ఉంటుంది. దీనిని మార్చాలనే పోరాటం వ్యర్థం. అందుకని నా సుఖమేదో నేను అనే్వషించుకుంటున్నాను’’
గోడ్బోలే నవ్వి -
‘‘మీ అక్రమాలకు అందమైన ముసుగు తొడిగి దానికొక తర్కాన్ని కల్పించావు పార్థూ’’ అన్నాడు.
పార్థు నవ్వి ‘‘ఇంతకూ డబ్బు ఇస్తావా? ఇవ్వవా?’’ అన్నాడు.
‘‘ఇవ్వకపోతే?’’
‘‘నీవు డబ్బు తిన్నావని మా నాన్నతో చెప్పి నీ ఉద్యోగం తీసేయిస్తాను’’
‘‘అడుక్కొనేవాడికి అన్నీ స్వంత ఇళ్ళే. ఈ కంపెనీ కాకపోతే మరొక కంపెనీ! మీ నాన్నగారి అనుమతి లేకుండా నీకు డబ్బు ఇవ్వను’’
పార్థు మెత్తబడ్డాడు.
‘‘బాబ్బాబు! నేను బొంబాయి వెళ్ళి బాలీవుడ్ నటుణ్ణి కావాలనుకుంటున్నాను. పెట్టుబడిగా కొంచెం డబ్బు ఇవ్వు. లక్షలు, కోట్లు సంపాదిస్తాను’’
‘‘సేటూ! నాన్నగారు చేవెళ్ళ దగ్గర ఫాంహౌస్ తీసుకుంటున్నారు. నిన్ను కూడా అక్కడికి తీసుకు వెళ్ళాలని చెప్పారు. ముందుగా నావెంటరా! డబ్బు తక్కువగా ఉంది. వారికి ఎడ్వాన్సు ఇవ్వాలి’’
‘‘్ఫంహౌస్ దేనికి?’’
‘‘ఉద్యాన పంటలకు’’
‘‘అది సరే- ఆ భూమిని ఏం చేసుకుంటాము?’’
‘‘్భమి తల్లిలాంటిది. దానిని గౌరవించాలి’’
‘‘సరేలేవోయ్! ఈ మంత్రాలు, శ్లోకాలు నాకూ తెలుసు. పాదస్పర్శం క్షమస్వమే అని భూమిని గౌరవించాలని మా నాయన నాకు నేర్పాడు కానీ విశ్వనాథ్! మనిషికి కావలసింది ఆరు గజాల నేల. అంతకు మించి ఎన్ని దేశాలు జయించినా అలెగ్జాండరులూ, జూలియస్, సీజర్‌లూ ఏదీ వెంట తీసుకుపోలేదు. మనమూ అంతే!’’
‘‘ఈ మెట్టవేదాంతం నాకు తెలియదు. మీ నాన్న గారు కొనాలని చెప్పారు. గుమాస్తాగా కొనటం నా ధర్మం. ఆ భూమిని నీకు అప్పగించి ఉద్యానపంటల బాధ్యత చూసుకోవలసిందిగా నాయనగారు చెప్పారు.’’
పార్థూ ఒక్క క్షణం మాట్లాడలేదు. ‘‘సరే పద’’ అన్నాడు.
ఆ తర్వాత వారిద్దరూ కారెక్కి చేవెళ్ళ వెళ్ళారు.
దారి పొడుగునా పార్థూ సినిమా పాటలు పాడుతున్నాడు.
‘‘మేరా జూతాహై జపానీ
మేరా పంట్లూమ్ పాకిస్తానీ
మేరీ లాల్ టోపీ రూసీ
ఫిర్‌భీ మై హూం హిందుస్తానీ’’
గోడ్బోలే నవ్వుకుంటూ వింటున్నాడు.
కొంతసేపటికి నిరీక్షణానంద స్వామి ఆశ్రమం వచ్చింది.
ఆయన ఒక అవధూత. సర్వసంగ పరిత్యాగం చేసి ఇక్కడ ఆశ్రమంలో ఉంటున్నాడు.
‘‘పార్థూ! లోపలికి వెళ్ళి స్వామివారి ఆశీస్సులు తీసుకుందాము’’ అన్నాడు గోడ్బోలే.
ఇరువురూ కారు దిగారు.
ఆశ్రమానికి ముందు ఓ ఆవు, దూడ ఉన్నాయి.
‘‘గోడ్బోలే! ఈ ఆవు ఎవరిది?
‘‘ఆశ్రమానిది’’
‘‘ఆవు ఎందుకు?’’
‘‘ఆవు పాలిస్తుంది. పైగా గోపూజకు ఆవు కావాలి కదా!’’
‘‘గోడ్బోలే! ఆవుకు గడ్డి కావాలి. ఆవును చూచేందుకు ఒక సేవకుడు కావాలి. ఆవు పాలు కాచేందుకు వంటవాడు కావాలి. మరి ఇదంతా సంసారం కాదా? ఊళ్ళో సంసార లంపటం ఎలాంటిదో ఈ ఆశ్రమ లంపటము అలాంటిదే. అక్కడైదే ఒకరిద్దరితో పరిమితం. ఇక్కడికి వందలాది మంది శిష్యులు వస్తుంటారు. ఈ లంపటం ఇంకా పెద్దది గోడ్బోలే!’’
‘‘బాబూ! నీవు చిన్నవాడివి. నీకు ధర్మసూక్ష్మములు తెలియవు. ఇలాంటి మహాత్ములు సాధువులూ ధర్మబోధ చేస్తుంటారు. దానివలననే సమాజం తన సంతులనం కోల్పోకుండా ఉంటుంది’’

- ఇంకా ఉంది

-ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్, చారిత్రక నవలా చక్రవర్తి