డైలీ సీరియల్

కడకు తెలిసిన జ్ఞానం (యయాతి -8)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ క్షణ భంగురాలైన సుఖాల కోసమా నా చిన్ని వాని యవ్వనాన్ని కొల్లగొట్టాను అనుకొన్నాడు. వెంటనే తన ప్రియాతి ప్రియమైన కొడుకు పూరువు అని పిలిచాడు. తండ్రి పిలిచిన వెంటనే పూరుడు వచ్చాడు. తండ్రీ ఆజ్ఞ ఏమిటి అనే నిత్యానందంతో ఉన్న పూరువు ను చూసి యయాతీ గర్వం పొందాడు. ఇతడు నాకుమారుడే. నాకులేని స్థిర చిత్తం వీనికి చిన్నపుడే వచ్చింది. నేను ఇన్ని విషయ భోగాలు అనుభవించి ఇపుడు ఇవన్నీ వృథా అని తెలుసుకొంటే ఈ పూరుడు చిన్నవయస్సులోనే తెలుసుకున్నాడు. సమదృష్టిని అలవర్చుకున్నాడు. స్థితప్రజ్ఞతను అలవాటు చేసుకొన్నాడు. ఎంతైనా శర్మిష్ఠ కొడుకు, వృషపర్వుని మనమడు కనుక వీనికి పుట్టుకతోనే ధర్మాచరణ వచ్చి ఉంటుంది. నేను కూడా ధర్మాన్ని ఆచరిస్తూ వస్తున్నవాడినే కానీ నా జీవితంలో ఎన్నో విచిత్రాలు చోడు చేసుకొన్నాయి. కనుక నేను ఇక మారాలి గట్టిగా మరోసారి అనుకొన్నాడు.
పూరువును పిలిచి ‘నాయనా నీవు ఇచ్చిన ఈ శరీరం యవ్వనం నాకు చాలు. నేను ఎంతో ఆనందాలను అనుభవించాను. ఇపుడు అసలు తత్వం తెలుసుకొన్నాను. ఇక నీకు నేనిచ్చిన ముసలితనాన్ని నాకు ఇచ్చివేయుము. నీ యవ్వనాన్ని నీవు తిరిగి పొందుము అని చెప్పాడు. వారిద్దరూ తిరిగి తమ తమశరీరాలను బదలాయించుకున్నారు.
ఆ తరువాత యయాతీ మహారాజు పూరువునకు సమస్త భూమండలాన్ని పరిపాలించే విధంగా పట్టం కట్టాడు. అంగ రంగ వైభోగంగా పట్ట్భాషేకాన్ని జరిపించాడు. యయాతి మిగతా కొడుకులు అక్కడికి వచ్చి ఆ పట్ట్భాషేక ఘట్టాని చూశారు.
***
కోరికల వల్ల నేను జీవితకాలాన్ని వృథా చేసుకొన్నాను అని తెలుసుకొన్న యయాతీ ఇక అప్పటినుంచి ఈ జీవనాన్ని పరమేశ్వరుని భజనలోనే గడుపుతాను అనుకొన్నాడు. సంసారంలోనుంచి విముక్తుడయ్యాడు. అప్పటినుంచి భగవంతుని నామజపంతో కాలం గడిపాడు.
శుభం
- ఇంకాఉంది

డా. రాయసం లక్ష్మి