డైలీ సీరియల్

జగం అసత్యం జగన్నాథుడే సత్యం (ప్రహ్లాదుడు -9)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఈమె పరస్ర్తి అందునా గర్భవతి ఈమెను నీవు చేయి పట్టి లాక్కుని రావడం తప్పుకదా. నీకోపాన్ని హిరణ్యకశిపునిపై చూపించు అంతేకాని ఈ స్ర్తిమూర్తిచేసిన నేరమేమిటి? ఎందుకు ఈమెపై పగబట్టినావు’ అనిఅడిగాడు.
అపుడు దేవేంద్రుడు ‘ఓ మహర్షీ! నేను చేస్తున్న పని మంచిది కాదని నాకు తెలుసు. కానీ ఏమీ చేయను. ఈమె గర్భంలో ఆ దురాత్ముడైన హిరణ్యకశిపుని వీర్యం బిడ్డగా వృద్ధి చెందుతోంది. ఇపుడు ఈ బిడ్డ పుట్టి వానికన్నా మరింత రాక్షస ప్రవృత్తితో ఉంటే దేవతలంతా ఏమై పోతారు? అందుకే పుట్టిన వెంటనే నేను నా వజ్రాయుధంతో నరికివేస్తాను. దానికోసమే ఈమెను తీసుకొని వెళ్లి నా ఆధీనంలో పెట్టుకుంటాను. ఈమె ప్రసవించగానే ఆ బిడ్డను చంపివేసి తిరిగి ఈమెను వదిలివేస్తాను.’అని చెప్పాడు.
నారదుడు ‘అయ్యో ఎంత పని చేశావు ఇంద్రా! నీకు భవిష్యత్తు గురించి ఏమీ తెలియదు. ఈ లీలావతి గర్భంలో పెరుగుతున్న బాలకుడు మహా భక్తుడు. మహాధైర్యశాలి. అతనికి శత్రువులు ఎవరూ లేరు. ఆ నారాయణుని ప్రీతిపాత్రుడు. అతనికి జన్మజన్మల నుంచి హరిభక్తి సంక్రమిస్తూ వస్తోంది. నీవు ఎన్నియుద్ధాలు చేసిన వీరుడివైనా నీవు ఈ బాలకుని ఏమీ చేయలేవు. అసలు నారాయణుని భక్తుని కి నీవే అపకారం చేసినా ఆ నారాయణుడు ఊరుకుంటాడని అనుకొంటున్నావా’అని దేవేంద్రుడిని అడిగాడు.
అసలు నిజం తెలిసిన దేవేంద్రుడు ఆ తల్లి లీలావతికి నమస్కరించి ‘అమ్మా! తెలియక తప్పుచేశాను. నేను రాక్షస రాజుకు భయపడి ఇలా చేశాను. నీవు నన్ను క్షమించు. నీ కడుపులో పెరిగే బిడ్డ నీకు నీ భర్తకు మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తాడు’అని దీవించి అక్కడే ఆమెను నారద మహర్షికి అప్పగించి దేవేంద్రుడు వెళ్లిపోయాడు.
అక్కడనుంచి మా అమ్మ లీలావతిని నారద మహర్షి తన ఆశ్రమానికి తీసుకొని వెళ్లాడు. ఆమెతో ఎవరిపైనా కోపాన్ని , ద్వేషాన్ని పెంచుకొనగ ఆ నారాయణుని ప్రార్థిస్తూ నీ భర్త క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ కాలం గడుపు అమ్మా. నీ భర్త ఆయన కోరుకున్న వరాలను పొంది మరీ వస్తాడు. నీకేవిధమైన భయం లేదు నిశ్చింతా ఇక్కడ ఉండు నీ భర్త వచ్చిన తరువాత నేను ఆయనకు నిన్ను అప్పగిస్తాను’అని చెప్పాడు.
మా అమ్మకూడా ద్వేషాన్ని వదిలి ఎంతో వినమ్రతతో నారద మహర్షికి సేవలు చేస్తూ ఆశ్రమంలో ఉండిపోయింది. ప్రతిరోజు నన్ను ఆ మహర్షి మనసులో పెట్టుకొని స్వచ్ఛమైన జ్ఞానాన్ని ధర్మాన్ని బోధించాడు. నారాయణ తత్వాన్ని మా అమ్మకు చెప్పాడు. నారద మహర్షి చెప్పేదంతా నేను గర్భంలోంచి విన్నాను. ఆయన వల్లనే ఇవన్నీ మరిచిపోకుండా ఇప్పటికీ ఉన్నాను. నాకు తెలిసింది మీకు చెప్పాను చెట్టు పుట్టటం పూలు పూయడం, కాయలు పండ్లు రావడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సామాన్యులు కర్మలు వదలని వారు, నారాయణునిపై ప్రేమను పెంచుకోలేని వారు అహంకారులు, మదోన్మమత్తులు నేనే అన్నింటికీ కారణం అనుకొని విర్రవీగుతుంటారు. కానీ వారంతా ఒకనాటికి నశించేవారు. అసలు ఉన్నదంతా నారయణుడే.
నారాయణుడు కానిది ఏమీ లేదు. మనం మనం చూస్తున్నదంతా మిథ్యనే. కనుక మనం ఆ దేవదేవుడిని నమ్ముకుని ఆయన భజన చేద్దాం. అతి త్వరలోనే మనలను ఆ హరి కాపాడుతాడు. అపుడు ఈ జనన మరణ చక్రం నుంచి విడివడి శాశ్వతమైన పరంధామానికి చేరుకుంటాము’ అని చెప్పాడు. అలా వారికి వివరించి వారినంతా ఒక దరికి చేర్చుకుని మీకు ఒక రహస్యాన్ని చెబుతాను వినండి. ‘ఇపుడు మన గురువులు మనకు నేర్పిస్తున్న దంతా శూన్యమే. వీరు చెప్పేదంతా నీటిబుడగవంటి విషయాలు.ఇవీ ఏమాత్రం మనలనుద్దరించలేవు.
- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి