డైలీ సీరియల్

ప్రహ్లాదుడు -8

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1
అటువంటి వారిని ఒక దరికి చేర్చుకుని మీకు ఒక రహస్యాన్ని చెబుతాను వినండి. ‘ఇపుడు మన గురువులు మనకు నేర్పిస్తున్న దంతా శూన్యమే. వీరు చెప్పేదంతా నీటిబుడగవంటి విషయాలు. ఇవీ ఏమాత్రం మనలనుద్దరించలేవు.
అసలు ఈ లోకాన్ని సృష్టించి నడిపిస్తున్నది దేవదేవుడైన నారాయణుడువాడు ’అని చెప్పాడు. మనంపుట్టిన ప్పటి నుంచి ఎంతో మందిచనిపోవడం చూస్తున్నాము కదా. వారు ఎక్కడికి వెళ్లారు. అట్లానే ఎంతోమంది పుడుతున్నారు కదా. తిరిగి వారంతా మనలాగే పెరుగుతూ ఉన్నారు. ఈ మరణించేవారు కేవలం వృద్ధులేనా కాదుకదా ఎంతోమంది చిన్న పిల్లలు కూడా మరణిస్తునే ఉన్నారు కదా. మరి మనకు మాత్రం మరణం రాదా? వస్తే తిరిగి మనం ఈ రాక్షస జన్మనే ఎత్తు తామని మనకు పూర్తిగా తెలుసా లేదుకదా. మరి మనకు రాబోయే జన్మ ఎలా ఉంటుందో దాన్ని ఎవరు నిర్ణయిస్తారో దానిని మనం తెలుసుకోవాలికదా. చూడండి కొందరు ముస్తాబు చేసుకొని ఎంతో అందంగా కనిపిస్తున్నారుకదా. మరికొంతమంది ముసలివారు చర్మంఅంతా ముడతలు పడిపోయి నడవడానికి శక్తిలేక నానాఅవస్థలు పడుతున్నారు కదా. మరి ఈముస్తాబు ఎప్పటికీ ఉండడం లేదు కదా. ఎప్పటికీ ఉండని విషయం మనకెందుకు? మీరీ విషయాలెప్పుడైనా గమనించారా?’ అని ప్రహ్లాదుడు చెబుతున్నాడు. ఆ బాలకులు వింతగా చూశారు.
మేమంతా ఇక్కడే పుట్టాము. పుట్టిన తరువాత మాతల్లిదండ్రులు ఈ గురువుల దగ్గరకు శాస్త్భ్య్రాసానికి పంపించారు. ఈ గురువులదగ్గరే సర్వశాస్త్రాలను అభ్యసిస్తున్నాము నీవు చెప్పే విషయాలు వీరు మాకు ఎన్నడూ చెప్పలేదుకదా. మరి నీకు ఎవరు చెప్పారు. నీకీవిధంగా నేర్పించిది ఎవరు. నీవు చెబుతుంటే మాకు వినడానికి ఎంతో సంతోషంగా ఉంది. అవి మాత్రమే వినాలన్న ధ్యాస కలుగుతోంది. మాకు తెలియని విషయాలు నీకు ఎలా తెలిసాయి. నీవు చెబుతున్నవిషయాలు నిజాలుగా అనిపిస్తున్నాయి. అవును మనం ఎందుకు పుట్టాము. తిరిగి మృత్యువు వస్తే మనం ఎక్కడికి వెళ్తున్నాము. అసలు మృత్యువంటే ఏమిటి? మనం వేరు ఈ శరీరం వేరునా నా చేయి అంటామే కాని ‘నా’ అనేది ఏమిటి నీవు చెబుతుంటే మాకు ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి. అసలు నీకు ఎవరు నేర్పారు ఇవన్నీ ’అని ఎంతో ఆశ్చర్యంగా వారు ప్రహ్లాదుడిని అడిగారు.
అపుడు ప్రహ్లాదుడు నారద మహర్షి ఇవన్నీ నాకు బోధించారు. అవి మీకు చెబుతాను వినండి అన్నాడు.
పూర్వం ఒకసారి మాత్రండి తపస్సు చేయడానికి తపోవనాలకు వెళ్లాడు. ఎవరూ కోరని వరాలను కోరుకుని వాటిని బ్రహ్మదేవుని చేత వరాలుగా పొందాలని తీవ్రమైన తపస్సమాధిలో ఉండిపోయాడు. అంతకుముందు ఈ రాక్షసుల బాధ పడిన దేవతలు ఇపుడు నగరంలో హిరణ్యకశిపుడు లేడు. ఇపుడు అక్కడ ఉండే రాక్షసులందరినీ అంతం చేసేసి వస్తే మనపైకి ఎవరూ దండెత్తిరారు. కేవలం ఒక్క హిరణ్య కశిపుడు వరాలను తెచ్చుకున్నా ఏమీ చేయలేకపోతాడు. పదండి ఆ రాక్షసులను మట్టుపెడదాం అని దేవేంద్రుడు తన దగ్గర ఉన్న దిక్పాలకులను, ఇతర దేవతలకు చెప్పాడు. వారంతా ఎంతో సంతోషంగా రాక్షసుల నగరంపైకి దండెత్తి వచ్చారు . ఇంద్రుడు అందరినీ చంపుతూ బెదరిస్తూ ముందుకు వస్తున్నాడు. దేవతా గణాన్ని చూసి రాక్షసులంతా తమ రాజు లేడని భయపడి తమ తమ భార్యాపిల్లలనుతీసుకొని దూరంగా పరుగెత్తి పోతున్నారు. ఆహా అనుకొంటూ ఇంద్రుడు రాజసౌధాన్ని కూడా ముట్టడించాడు. అక్కడ నా తల్లి నన్ను గర్భంలో ధరించి ఉంది. ఆమె దగ్గరకు వచ్చి దేవేంద్రుడు నవ్వి ఆమె చేతిని పట్టుకొన్నాడు. మా తల్లి లీలావతి ఎంతో భయపడిపోయింది. సిగ్గుపడింది. పెద్ద పెట్టున రోధించింది.. కానీ కనికరం లేని దేవేంద్రుడు ఆమెను గట్టిగా పట్టుకొని ముందుకు పోయాడు. నా తల్లిని లాక్కుని పోయే సమయంలోనే నారద మహర్షి దేవేంద్రునకు కనిపించాడు. అతడు దేవేంద్రుడిని ఆపి ‘ఓ స్వర్గ్ధాపతీ దేవేంద్రా నీవు చేస్తున్న పని ఏమి? నీకెందుకీ దురాలోచన కలిగింది?’ అంటూ దేవేంద్రుని నిలబెట్టాడు.

- డా. రాయసం లక్ష్మి. 9703344804