డైలీ సీరియల్

విలువల లోగిలి-51

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మీ అబ్బాయి బాల్కనీలో ఫోను మాట్లాడుతున్నారు. వెళ్లి చెప్పిస్తాను’’ అంటూ అటు వెళ్లింది విశ్వ.
‘‘హలో! గ్లాడ్ టు మీట్ యు’’ అంటూ కరచాలనం చేశారు ఆయన.
‘‘మీరు..?’’ గుర్తురానట్లుగా ముఖం పెట్టారాయన.
‘‘ఈ ప్రక్క బిల్డింగ్ మాదేనండి. నా పేరు ధన్‌రాజ్’’
‘‘ఓ! అలాగా! కూర్చోండి! కూర్చోండి!’’ అన్నాడు.
అప్పటికి విషయం అర్థమైంది ఆయనకి.
చందూ ఫోను మాట్లాడి ఉంటాడు.
‘‘అవునండీ. మా కోడలు విశ్వ మీ బిల్డింగ్‌లో స్కూలు పెడదామంటోంది. మీరు అమ్మకానికి పెట్టారుగా. ఏమైనా ఓ పదేండ్లు లీజ్‌కిచ్చే అవకాశందేమో కనుక్కుందాం అనుకున్నాం నేనూ, మా అబ్బాయి. వాడే మీకు ఫోను చేసి ఉంటాడు.
ఇంతలో సూర్యచంద్ర అక్కడికి వచ్చాడు విశ్వ చెప్పటంతో.
‘‘ఈ పిల్లలున్నారు చూసారూ! ఎంతకైనా తెగిస్తారు. కాస్త ఈమధ్య నా ఆరోగ్యం బాగోలేదు. మంచం పట్టాను. అంత మాత్రానికి నాతో మాట మాత్రం చెప్పకుండా ఉన్నవాళ్ళను ఖాళీ చేయించెయ్యటం, అమ్మేయటానికి బోర్డు పెట్టటమూ చేసేస్తారా? మీ ఫోను బట్టే నాకీ విషయం తెలిసింది. లేకపోతే తెలిసేదే కాదు. నా సంతకాలు కూడా వాళ్ళే పేట్టేద్దామనుకున్నారేమో!’’ ఆవేశంగా అన్నాడాయన.
ఇద్దరికీ విషయం అర్థమయ్యింది.
ఇపుడు పిల్లలకు, పెద్దలకు అభిప్రాయ భేదాలు మామూలు అయిపోయాయి.
‘‘అయితే మాకు లీజుకిస్తానంటారా? మేము తెలుగు మీడియం స్కూలు పెడదామనుకుంటున్నాం’’
‘‘తప్పకుండా! ఎనే్నళ్ళకు కావాలి?’’
‘‘పదేళ్ళకు చాలండీ’’
‘‘అయితే వెంటనే ఫార్మాలిటీస్ పూర్తిచేయండి. అయ్యాకే నేను వెళతాను’’ అన్నాడాయన.
ఆయన చెప్పిన అవౌంట్ ఇచ్చేసి అగ్రిమెంట్ రాసిచ్చారు నరేంద్రనాధ్. ఇద్దరూ చెరొక కాపీ తీసుకున్నారు.
‘‘వస్తాను’’ అని వెళ్లిపోయాడాన.
ఆ తర్వాత ఆయన విషయం తెలిసి బాధపడింది విశ్వ.
‘‘ప్రేమలు ఎలా పంచుకోవాలా అని ఆలోచించవలసిన సమయంలో ఇలా ఆస్థులు ఎలా లాక్కోవాలా అని బిడ్డలు రహస్యంగా మంతనాలు చేయటం చూస్తుంటే మనం ఎటు పోతున్నామో అర్థంకావటంలేదు. అసలు కష్టపడి తల్లిదండ్రులు సంపాదించుకున్న ఆస్థిపాస్థులమీద బిడ్డలు జులుం చేయటమేమిటి? తాతల నాటి ఆస్థికోసం హక్కుందని పోరాడినా ఒకర్థం ఉంటుంది. ఇలాంటివాళ్ళకు బుద్ధిచెప్పాలంటే ఆస్థి అంతా అనాథ శరణాలయాలకు రాసెయ్యాలి. అప్పుడు బుద్ధి వస్తుంది అంది ఆవేశంగా.
‘‘అసలాయన్ని చూస్తుంటే ఆ ఊపులోనే ఉన్నారనిపించింది’’ అన్నాడు చందూ.
‘‘ఇప్పుడీ విషయం తెలిస్తే పిల్లలు ఏమీ గొడవపెట్టరు కదా!’’ అనుమానంగా అంది అమృత.
‘‘ఓనరు ఈయన అయినపుడు వాళ్లేం చెయ్యగలరు? గమనించారా వెళ్ళేప్పుడు ఆయన బోర్డుపీకేసి ఓ మూలకు విసిరేసి వెళ్లిపోయాడు. ఆయనకు పిల్లలమీద వున్న కోపం ఆ విసరటంలోనే కనిపిస్తోంది’’ అన్నాడు చందూ.
ముందు ‘లోగిలి’ అని నేమ్‌బోర్డు ఎలా కావాలో చూసి సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ ఇచ్చిరండి. ఎంత తొందరగా పెట్టేస్తే మనకు అంత మంచిది. ఎలాగూ అగ్రిమెంటు కాపీ ఉందిగా. భయపడాల్సిన పనిలేదు’’ అన్నాడు ధీమగా నరేంద్రనాధ్.
‘‘విశ్వా! ఇక నీ స్కూలుకేం కావాలో చెబితే మే ఫాలో అవుతాం’’
‘‘మామయ్య చెప్పిన పనిని నేనూ, అత్తయ్య వెళ్లి చేసుకుని వచ్చేస్తాం’’ అంది విశ్వ.
అలా ప్రారంభమైంది స్కూలు పనులు చేయటం వాళ్ళిద్దరికీ. ఇంటి దగ్గర వ్యవహారం సుగుణ చూసుకుంటే బయటపనులు విశ్వ, అమృత చక్కపెట్టేవారు. అలా త్రిమూర్తులులా వారు ఆ పనిలో దృష్టిపెట్టి నిమగ్నమవటంతో అనుకున్నదానికంటే ముందుగానే పనులు జరిగిపోతున్నాయి.
పసుపుపచ్చటి గుమ్మం పిల్లలకి ఆహ్వానం చెబుంతుంటే దానికి కట్టిన తోరణాలు పచ్చదనం శుభాన్ని సూచిస్తుంటే పిల్లలు నలుగురు అందులో ప్రవేశిస్తున్నట్లు వెనక విశాల ప్రపంచంలో అందంగా ముస్తాబైన లోగోతో ‘లోగిలి’ మరింత ఆకర్షణీయంగా మారింది. ఎంచుకున్న రంగులు బాగా నప్పటంతో చూపరులకు తొందరగా చేరువయ్యింది.
కాకపోతే కానె్సప్టే వారికి కాస్త మింగుడుపడలేదు. ఎల్‌కేజీ నుంచే ఐఐటిపెట్టేస్తే బాగుండును. మా పిల్లలు బాగా చదివేసి లక్షలు లక్షలు తెచ్చేస్తారు అని ఆశించే తల్లిదండ్రులు ఆ వైపు కనెత్తి చూడలేదు. కానీ తమలాగే పిల్లలు హాయిగా చదువుకోవాలి అనుకున్నవారు మాత్రం వచ్చి వివరాలు తెలుసుకుంటున్నారు.
విశ్వ తన ప్రణాళికనంతా విపులంగా ఒక సీడీ రూపంలో తీసుకువచ్చింది. ఆసక్తి వున్నవారికి దానిని చూపెట్టటంతో వారు మరింత అవగాహనకి వచ్చేవారు. బాగుంది అని చెప్పినవారు మళ్లీ వస్తామని చెప్పి వెళుతున్నారు.
పది రోజులు గడిచినా ఒక్కరూ చేరలేదు. రోజూ ధైర్యాన్ని నింపుకుంటూనే ఉంది విశ్వ. ఎవ్వరూ రావటం లేదనే దానికన్నా తను ఎంతో ఆలోచనతో రూప శిల్పిలా చేసిన కష్టానికి ఫలితం లేదా అని వాపోయింది మనసులోనే. తనకు వంద మంది పిల్లలు అక్కర్లేదు. కనీసం పదిమంది చేరినా చాలు. తను స్వాతి చిప్పై వాళ్ళను ఆణిముత్యాలులా తయారుచేస్తుంది. మనసులో ఎన్నో భావాలు. ఆశయాలు ఆచరణయోగ్యం అయితేనేగా ఆనందం!
మీ పిల్లలను మా స్కూల్లో చేర్పిస్తే చాలు. అంతా మేమే చూసుకుంటాం అన్నా రాకపోవటం ఒకింత విచిత్రంగానే ఉంది.
మరి అందగాడు, మంచి జీతగాడు కానీ కట్నం తీసుకోకుండా పెళ్లిచేసుకుంటానంటే, అసలు అతను దాంపత్యానికి పనికివస్తాడో లేదోనని ఎగాదిగా చూసే ఈ కాలంలో ఉచితంగా మంచి విద్యను అందజేస్తానంటే ఎవరు నమ్ముతారు?
అలా వదిలెయ్యకూడదు అనుకుంది విశ్వ.
ఒకరోజు వీరయోధులలాప్రజల మధ్యకు వెళ్ళారు ముగ్గురూ. పేదవారినే టార్గెట్‌గా పెట్టుకున్నారు.

- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206