తెలంగాణ

‘డబుల్ బెడ్‌రూం’ పంపిణీలో గడబిడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: దేశంలోనే మొట్టమొదటి సారిగా తెలంగాణలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో లబ్దిదారుల మధ్య చిచ్చు మొదలైంది. బన్సీలాల్‌పేట డివిజన్‌లోని ఐడిఎల్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లలో 86 ఇళ్లను శుక్రవారం రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ లాటరీ పద్ధతిలో కేటాయించేందుకు వచ్చారు. ఇందులో భాగంగా 86 ఇళ్లను అమ్ముగూడ వాసులకు లాటరీ పద్దతి ద్వారా మంత్రి కేటాయించారు. ఇందులో అర్హులైన పనె్నండు మందికి ఇళ్లు కేటాయించలేదంటూ కొందరు ఆందోళనకు దిగారు. దీంతో కొంత సేపు ఇళ్ల కేటాయింపులో అలజడి నెలకొంది. ఈ సందర్భంగా కొందరు స్థానికులు తమకు అన్యాయం జరుగుతోందంటూ నినాదాలు చేస్తూ మంత్రిని ఘెరావ్ చేసేందుకు యత్నించగా, పోలీసులు రంగప్రవేశం చేసి చెల్లాచెదురు చేశారు. మరికొందరు లబ్దిదారుల మధ్య బహాబాహీ కూడా చోటుచేసుకుంది.

సంయమనం పాటించండి
పట్టాలున్నవారికే ఇప్పుడు కేటాయంచాం
త్వరలో మిగిలిన వారికి ఇస్తాం: మంత్రి తలసాని
గతంలో ముఖ్యమంత్రి చెప్పినట్టుగా ఐడిఎల్ వాసులతో పాటు అమ్ముగూడ, భగత్‌సింగ్‌నగర్, సుభాష్‌నగర్, పార్ధీనగర్ వాసులకు కూడా డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించటం జరిగిందని, కానీ వాటి నిర్మాణం పూర్తి కానందున, అప్పట్లో కేటాయింపులు జరపలేదని మంత్రి తలసాని ఈ సందర్భంగా వివరించారు. ప్రస్తుతం అమ్ముగూడ వాసుల్లో పట్టా కల్గి ఉన్న 86 మందికి ఈ ఇళ్లను కేటాయించినట్లు ఆయన తెలిపారు. మిగిలిన పనె్నండు మందికి కూడా రెండు, మూడు రోజుల్లో ఇళ్లను కేటాయించటం జరుగుతుందని, అప్పటి వరకు సంయమనం పాటించాలని సూచించారు. పట్టాలు లేకపోయినా, గతంలో ఇక్కడ నివాసమున్నారన్న ఆధారాలను వెంటనే స్థానిక తహశీల్దార్‌కు సమర్పిస్తే, వారికి తప్పకుండా ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇవ్వటంతో ఆందోళనకు దిగిన లబ్దిదారులు శాంతించారు.