ధనాధన్ పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైభవ్, రమ్యా నంబీసన్ జంటగా తమిళంలో రూపొందిన ‘డమాల్ డుమీల్’ చిత్రాన్ని ధనాధన్ పేరుతో తెలుగులోకి విడుదల చేస్తున్నారు. శివ వై.ప్రసాద్, శ్రీనివాస్ అనంతనేని. బ్లాక్‌బస్టర్ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నటుడు నాగబాబు సీడీని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ‘శివ టెక్నీషియన్‌గా పరిచయం.. ఇందులో పాటలు బావున్నాయి. ట్రైలర్స్ ఆసక్తికరంగా వున్నాయి. తమిళంలో హిట్టయిన ఈ చిత్రం తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుంది’ అన్నారు. సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి మాట్లాడుతూ, ‘వైభవ్‌కు ఈ సినిమా తమిళంలో మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం తమిళంలో మంచి హీరోగా కొనసాగుతున్నాడు. తెలుగులో కూడా అవకాశాలు వస్తున్నాయి. ఈ సినిమాతో ఇక్కడ కూడా మంచి హిట్ అందుకుంటాడన్న నమ్మకం వుంది’ అన్నారు. నిర్మాత శివ మాట్లాడుతూ, ఎక్కడా రాజీపడకుండా నిర్మించిన ఈ సినిమాను మార్చి 11న విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్, మాటలు: శివపార్వతి, కెమెరా: ఎడ్విన్‌సాకె, నిర్మాతలు: శివప్రసాద్, శ్రీనివాస అనంతనేని, దర్శకత్వం: శ్రీ.