బిజినెస్

అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన ముడి చమురు, పసిడి ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రష్యా ఫైటర్ జెట్ కూల్చివేత,
ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు భయాలు కారణం
లండన్, నవంబర్ 24: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు, బంగారం ధరలు మంగళవారం ఒక్కసారిగా పెరిగాయి. సెర్బియా సరిహద్దులో రష్యా ఫైటర్ జెట్ విమానాన్ని టర్కీ కూల్చివేసిన నేపథ్యంలో పశ్చిమ టెక్సాస్, బ్రెంట్ నార్త్ సీ ప్రకారం బ్యారెల్ ముడి చమురు ధరలు సోమవారం ముగింపుతో పోల్చితే 38 సెంట్ల నుంచి 68 సెంట్లు పెరిగి 42.13 డాలర్ల నుంచి 45.51 డాలర్లకు చేరాయి. రష్యా జెట్ కూల్చివేతతో చమురు సంపన్న మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న తాజా ఆందోళనలే దీనికి కారణం.
ఇకపోతే అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ రాబోయే ద్రవ్యసమీక్షలో వడ్డీరేట్లను పెంచబోతోందన్న సంకేతాలు పసిడి ధరలను పరుగులు పెట్టించాయి. దీంతో మంగళవారం ట్రేడింగ్‌లో దాదాపు ఐదేళ్ల కనిష్ట స్థాయి నుంచి కోలుకున్నాయి. ఔన్సు ధర 0.50 శాతం ఎగిసి 1,074.09 డాలర్లు పలికింది. వెండి ధర సైతం 0.18 శాతం పుంజుకుని 14.18 డాలర్లను చేరింది.
దేశీయంగానూ పెరిగిన పుత్తడి ధర
న్యూఢిల్లీ: వరుసగా రెండు రోజులపాటు పడిపోయిన బంగారం ధర మంగళవారం స్వల్పంగా పెరిగింది. ప్రస్తుత పెళ్ళిళ్ళ సీజన్‌కుతోడు అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల నేపథ్యంలో జ్యుయెల్లర్లు కొనుగోళ్లకు ఆసక్తి కనబరిచారు. దీంతో సోమవారం ముగింపుతో చూస్తే 10 గ్రాముల 99.9 స్వచ్ఛత కలిగిన పసిడి ధర 90 రూపాయలు పెరిగి 25,740 రూపాయలకు చేరింది. వెండి ధర కూడా కిలోకు 350 రూపాయలు ఎగిసి 34,150 రూపాయలను తాకింది.