క్రైమ్/లీగల్

డీఈడీ కోర్సుల నిర్వహణపై విచారణ హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ కాలేజీలు డిఇడి కోర్సులను నిర్వహించడంపై వస్తున్న అభియోగాలు, అవకతవకలపై విచారణ చేయాలని హైకోర్టు నిర్ణయించింది. కర్నూలు ఎస్‌విఎన్‌డిఇడి కాలేజీకి చెందిన విద్యార్థులు పంపిన లేఖను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. కాలేజీ యాజమాన్యాల అవకతవకల వల్ల తమ భవిష్యత్తు దెబ్బతింటోందన్నారు. ఈ పిల్‌ను విచారిస్తామని హైకోర్టు పేర్కొంది.
హైకోర్టులో పిల్ దాఖలు చేసిన చెన్నై
అమరజీవి పొట్టిశ్రీరాములు సమితి
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని మార్చి 16వ తేదీన నిర్వహించేందుకు వీలుగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తాము చేసిన వినతిపత్రాన్ని ఏపి ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదంటూ చెన్నైకు చెందిన అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు జి వేణుగోపాల్ పిల్ దాఖలు చేశారు. తాము వినతిపత్రాన్ని ఏపి ప్రభుత్వానికి ఈ ఏడాది జనవరి 22వ తేదీన ఇచ్చామన్నారు.