క్రైమ్/లీగల్

నీట్‌కు తిరుపతిలో మరో విద్యార్థి బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 7: నీట్ పరీక్షలో క్వాలిఫై కాలేకపోయాన్న ఆవేదనతో తిరుపతి కొర్లగుంటకు చెందిన కె.బాలాజీ (20) అనే విద్యార్థి ఇంటిలోనే గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈస్ట్ పోలీసుల కథనం మేరకు కొర్లగుంటలో నివాసం ఉంటున్న వనజాకుమారి రెండో కుమారుడు కె.బాలాజీ (20) నీట్ పరీక్ష రాశాడు. అయితే అందులో ఉత్తీర్ణుడు కాలేకపోయాడు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన బాలాజీ వౌనంగా ఉన్నాడు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలాజీ ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని కుటుంబ సభ్యులు ఆలస్యంగా గుర్తించారు. ఈ మేరకు మృతుని అన్న షణ్ముగం ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు
స్మగ్లర్లను అడ్డుకునే ప్రయత్నంలో కానిస్టేబుల్‌కు గాయాలు
చంద్రగిరి, జూన్ 7: శేషాచలం అడవుల్లోకి ప్రవేశిస్తున్న స్మగ్లర్లను టాస్క్ఫోర్స్ సిబ్బంది అడ్డుకోవడంతో ఓ కానిస్టేబుల్‌కు గాయాలైన సంఘటన గురువారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రగిరి మండలం రంగంపేట సమీపంలో శేషాచలం అడవుల్లోకి 20 మంది స్మగ్లర్లు కారులో వెళుతున్నారని సమాచారం తెలుసుకున్న సిబ్బంది అక్కడకు వెళ్లి కాపుకాశారు. ఈ సందర్భంగా స్మగ్లర్లు ఓ కారులో అడవుల్లోకి వెళ్తుండటాన్ని టాస్క్ఫోర్స్ సిబ్బంది గమనించి వారిని వెంబడించి కారును అడ్డుకునే ప్రయత్నంలో కానిస్టేబుల్ ఆంజనేయులు నాయక్‌పైకి స్మగ్లర్ల కారు దూసుకెళ్లింది. అతను తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. అతని కాలుకి తీవ్రగాయమైంది. స్మగ్లర్లు కారును ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి అక్కడ వదిలి పారిపోయారు. వారు వదిలిపెట్టిన కారులో బియ్యం, 5 కొత్త బెడ్‌షీట్‌లు, 8 కొత్త టవళ్లు, దాదాపు 20 మందికి సరిపడా వంట సామగ్రి, గొడ్డళ్లు ఉన్నాయి. సిబ్బంది ఆ వస్తువులను స్వాధీనం చేసుకొని సమాచారాన్ని ఐజీ కాంతారావుకు, ఎస్‌ఐ భాస్కర్‌కు అందజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఐజీ కాంతారావు స్మగ్లర్లను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు పంపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీఎఫ్ కృష్ణయ్య, డీఎస్పీ హరినాధ్‌బాబు, అటవీ అధికారులు లక్ష్మీపతి, డీఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.