క్రైమ్/లీగల్

మహిళ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎమ్మిగనూరు, జూన్ 7: భర్త, అత్తమాలల వేదింపులు తట్టుకోలేక మనెమ్మ(28) ఆత్మహత్య చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గోనెగండ్ల మండలం బైలుప్పులు గ్రామానికి చెందిన మనెమ్మను 10 సంవత్సరాల క్రితం ఎమ్మిగనూరు మండలం మాస్‌మాన్‌దొడ్డిగ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుకు ఇచ్చి వివాహం చేశారు. అయితే గత కొన్ని రోజులుగా వారు ఎమ్మిగనూరు పట్టణంలోని ఎస్‌ఎంఎటి కాలనీలో నివాసం ఉంటున్నారు. మనెమ్మకు ఇద్దరు ఆడ పిల్లలు పుట్టారు. మగ పిల్లవాడు పుట్టలేదని భర్త, అత్తమాల వేదింపులకు గురి చేయడంతో విసిగి చెందిన మనెమ్మ బుధవారం అర్ధరాత్రి నివాసం ఉంటున్న కొట్టంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు తండ్రి తిక్కయ్య ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

బొలోరో వాహనం అద్దాల ధ్వంసం
దేవనకొండ, జూన్ 7: మండల వ్యవసాయ అధికారి అల్త్ఫా ఆలీఖాన్ బొలోరో వాహన అద్దాలను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు ఆయన గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏఓ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వ్యవసాయ అధికారి నివాసం ఉంటున్న ఇంటి దగ్గర ఉన్న హోటల్ దగ్గర బొలోరో వాహనాన్ని నిలిపినట్లు తెలిపారు. బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో బొలోరో వాహనాల అద్దాలు అన్ని పూర్తిగా పగలగొట్టారన్నారు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ గంగయ్యయాదవ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఓ తెలిపారు.