క్రైమ్/లీగల్

ఇద్దరు నకిలీ పోలీసుల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 7: అమరావతి మండల పరిధిలోని మునగోడు గ్రామ సమీపంలో ఈనెల 5వ తేదీ ఉదయం 10 గంటలకు బండారు మల్లిఖార్జునరావు అమరావతి మండలం నుండి ఇసుక లారీతో వెళ్తుండగా జూపూడి చెరువు సమీపంలో ఇద్దరు వ్యక్తులు పల్సర్ బైకుపై వచ్చి లారీ ఆపి, పోలీసులమని బెదిరించి అతని వద్ద 500 రూపాయలు తీసుకుని పరారయ్యారు. డ్రైవర్ బండారు మల్లిఖార్జునరావు సమయస్ఫూర్తితో అమరావతి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పల్సర్ బైకు నెంబర్ ఆధారంగా గురువారం ఉదయం 11 గంటలకు మనుగోడు బస్‌స్టాప్ సమీపంలో బంకా ప్రసాద్, బంకా తిరుపతయ్య అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి సత్తెనపల్లి కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. తుళ్లూరు డిఎస్‌పి శ్రీనివాసులు, అమరావతి సిఐ కట్టా శ్రీనివాసరావు, ఎస్‌ఐలు నరసింహారావు, ఎస్‌కె రహంతుల్లా, సిబ్బంది పాల్గొన్నారు.