క్రైమ్/లీగల్

ఏసీబీ న్యాయస్థానంలో పురుషోత్తమ్ రెడ్డి లొంగుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 16: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న కేసులో ప్రధాన నిందితుడు హెచ్‌ఎండీఏ డైరెక్టర్ పురుషోత్తమ్ రెడ్డి ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. గత 15 రోజులుగా కనిపించకుండా పోయిన అతను అనూహ్యంగా శుక్రవారం నాంపల్లిలోని ఏసీబీ న్యాయస్థానంలో లొంగిపాయారు. ఈ కేసును విచారించిన కోర్టు ఆయనకు రెండు వారాల పాటు జ్యూడీషల్ కస్టడీ విధించింది.
రెండు వారాలుగా అవినీతి నిరోధక శాఖ అధికారులు అతని ఇళ్లతో పాటు బందువులు, సన్నిహితుల ఇళ్లలో సోదాలు జరిపారు. ఈ సోదాల్లో కీలక పాత్రాలతో పాటు నగదు, విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పురుషోత్తమ్ రెడ్డి దేశం విడిచి పారిపోవచ్చునన్న కోణంలో అధికారులు లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. తాజాగా శుక్రవారం రాధాచరణ్ రెడ్డి భార్యకు చెందిన కొటక్ మహేంద్ర బ్యాంకు లాకర్‌ను తెరిచిన అధికారులు ఖరీదైన వజ్రాభరణాలను ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇదే కేసుతో సంబందం ఉన్న నిషాత్‌రెడ్డి, యాదవ రెడ్డిను అవినీతి నిరోధక శాఖ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. పురుషోత్తమ్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.