క్రైమ్/లీగల్

ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, మే 20: జిల్లా కేంద్రమైన చిత్తూరు ఎస్పీ బంగ్లాలో విధి నిర్వహణలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని అత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్‌కు అధికారులు సెలవులు ఇవ్వకుండా వేధించడం వల్లనే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. అయితే పోలీసు అధికారులు మాత్రం మిస్ ఫైర్ వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటన జిల్లా పోలీసు వర్గాలో కలకలం రేకెత్తించింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన రాజశేఖర్ (29) చిత్తూరు జిల్లాలో 2014 నుంచి ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో శనివారం రాత్రి ఎస్పీ బంగ్లాలో గార్డు డ్యూటీ చేయడానికి వెళ్లారు. విధుల్లో ఉన్న రాజశేఖర్ తన వద్దనున్న ఏకె 47 తుపాకీతో ఆదివారం వేకుకజామున ఛాతీపై కాల్చుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. రాజశేఖర్ డ్యూటీ సమయం అయిపోవడంతో మరో కానిస్టేబుల్ రిలీవర్‌గా వచ్చారు. అప్పటికే ఎస్పీ బంగ్లా వెనుక విగతజీవుడై పడి ఉన్న రాజశేఖర్‌ను గుర్తించి రిలీవర్ ఈవిషయాన్ని తోటి సిబ్బందికి తెలపడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు వివరణ ఇస్తూ, ఎస్పీ బంగ్లాలో ఏఆర్ కానిస్టేబుల్ మరణించండం దారుణమని ఈ ఘటనపై సమగ్రంగా విచారించనున్నట్లు తెలిపారు. చిత్తూరు డీఎస్పీ సుబ్బారావును విచారణాధికారిగా నియమించామన్నారు. అయితే తుపాకీ మిస్ ఫైర్ వల్ల ఈ దుర్ఘటన చోటుచేసుకుందా, లేక కుటుంబ సమస్యలు వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డాడా, పోలీసు అధికారుల వేధింపుల వల్ల ఈ ఘటన చోటుచేసుకుందా అన్న దానిపై విచారణ చేస్తున్నట్లు వివరించారు. మృతదేహాన్ని తహశీల్దార్ ప్రత్యేక వైద్యనిపుణుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు చెప్పారు. అయితే అందరితో సఖ్యతగా ఉండే రాజశేఖర్ మరణాన్ని తోటి సిబ్బంది జీర్ణించుకోలేక పోతున్నారు.