క్రైమ్/లీగల్

కన్నబిడ్డపైనే అఘాయత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రగిరి, మే 20: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎం.కొంగరవారిపల్లి గ్రామంలో కామాంధుడైన ఓ తండ్రి మూడేళ్లుగా కన్నకూతురిపై అత్యాచారం చేస్తున్న సంఘటన ఆదివారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగుచూసింది. ఈ విషయం తెలిసినా పట్టించుకోని తల్లిపై కూడా బాధితురాలు ఫిర్యాదు చేసింది. జీపు నడుపుతూ జీవనం సాగించే కామాంధుడు కన్నకూతురిపై కనే్నశాడు. తన కామవాంఛను తీర్చమన్నాడు. లొంగకపోతే చంపేస్తానని బెదిరించాడు. ఎదురుతిరిగితే చితకబాది తన కోర్కెను తీర్చుకునేవాడు. ఈ విషయాన్ని కన్నతల్లికి చెబితే న్యాయం జరుగుతుందని భావించిన బాధితురాలికి చేదు అనుభవమే మిగిలింది. కట్టుకున్నవాడు కన్నకూతురినే కాటేస్తున్నాడని తెలిసినా తల్లి చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో జీవితంపై విరక్తి కలిగిన బాధితురాలు ఆదివారం ఆ నరకం నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితురాలి తల్లిని కూడా అరెస్ట్ చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. సీఐ సురేంద్రనాయుడు, ఎస్‌ఐ చిరంజీవులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.