క్రైమ్/లీగల్

గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డోన్, మే 18:పట్టణ సమీపంలోని రైల్వేగేట్ వద్ద బ్రిడ్డి కింద 45 సంవత్సరాల గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆదివారం పట్టణ పోలీసులు తెలిపారు. బ్రిడ్జి కింద తెల్లని చొక్కా, నీలం రంగు పంచె ధరించి వున్న వ్యక్తి మృతదేహం పక్కన క్రిమిసంహారక మందు డబ్బా వుండడాన్ని గమనిస్తే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఆచూకీ తెలిసిన వారు పట్టణ పోలీసులకు సమాచారం అందించాలని పట్టణ ఎస్‌ఐ శ్రీనివాసులు కోరారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మద్దిలేటయ్య కోనేరులో
యువకుడి మృతదేహం లభ్యం
బేతంచెర్ల, మే 20:మండల పరిధిలోని మద్దిలేటయ్య కోనేరులో ఆదివారం కె.రమేష్(20) మృతదేహం లభ్యమైంది. ఎస్‌ఐ జిఎండి బాషా తెలిపిన వివరాలు.. కర్నూలు నగరంలోని గణేశ్‌నగర్‌కు చెందిన పెద్దన్న కుమారుడు రమేష్ శనివారం మద్దిలేటయ్య క్షేత్రానికి వచ్చాడు. ఆలయ ఆవరణలోని పెద్ద కోనేరులో స్నానానికి వెళ్లినట్లు తెలిసింది. అయితే ఏకారణం చేతనో రమేష్ ఆదివారం కోనేరులో మృతదేహమై కనిపించాడు. ఆలయ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో రమేష్ బంధువులు అక్కడికి చేరుకున్నారు. అలాగే వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు
క్రిమిసంహారక మందు పిచికారి చేసిన
గడ్డి మేసి 40 గొర్రెల మృతి
* బస్తిపాడులో ఘటన
కల్లూరు, మే 20:మండల పరిధిలోని బస్తిపాడు గ్రామానికి చెందిన రైతుల 40 గొర్రెలు ఆదివారం ఉదయం సపోట, ఎర్రగడ్డ పంట పొలాల్లో క్రిమిసంహారక మందు పిచికారి చేసిన గడ్డి మేసి మృత్యువాత పడ్డాయి. వివరాలు.. గొర్రెలు ఆ గడ్డి మేసిన గంట తర్వాత నుంచి స్పృహ తప్పి పడిపోవడం గమనించిన కాపరులు పశువైద్యులకు సమాచారం అందించారు. దీంతో చిన్నటేకూరు పశువైద్యులు సంఘటనా స్థలానికి వెళ్లి పరీక్షలు నిర్వహించారు. అయితే అప్పటికే గొర్రెలకు బాగా విషం ఎక్కిపోవడంతో వైద్యపరీక్షలు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో నాగేశం, మధు, నాగమద్ది, చెయ్యప్పలకు చెందిన 40 గొర్రెలు మృతి చెందగా రూ. 3 లక్షలు నష్టం వాటిల్లిందని పశువైద్యులు తెలిపారు. మరో 50 గొర్రెలకు సకాలంలో వైద్యం అందించడంతో ప్రాణాపాయం నుండి బయట పడ్డాయని తెలిపారు.