క్రైమ్/లీగల్

భార్యాభర్తల మద్య గొడవ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుకొండ, మే 20: మండలంలోని గుట్టూరులో ఆదివారం కుటుంబంలో భార్యాభర్తల నడుమ గొడవలు రావడంతో భర్త ఇంట్లో లేని సమయంలో భార్య తన ఏడు మంది పిల్లలతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గుట్టూరుకు చెందిన నరసింహులు భార్య కల్యాణి (35) ఆమె పిల్లలు రుక్కి (16), వైదేహి (14), శైలజ (13), సుశీలా (11), ఇందూ (10), నందూ (6), ఈశ్వర్ (5) మధ్యాహ్నం ఇంట్లో కేసరిబాత్ చేసుకుని అందులో విష పూరిత పదార్థాన్ని కలుపుకుని తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో వారు ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉండటంతో గ్రామస్థులు గమనించి వారిని హుటాహుటిన పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే వీరు పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారిని వైద్యుల సూచన మేరకు అనంతపురం తరలించారు. వీరిది తమిళనాడు రాష్ట్రం కాగా గత 20 ఏళ్ళ క్రితం గుట్టూరుకు వచ్చి ఇటుకల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నరసింహులుకు ముగ్గురు భార్యలు కాగా ఇటీవలే ఓ భార్య గొడవ పడి అతని నుండి దూరంగా వెళ్ళిపోయింది. మరో ఇద్దరు భార్యలు, పిల్లలు కలిసి ఉన్నారు. కాగా నరసింహులు చిన్న భార్య కొద్ది రోజుల క్రితం గొడవ పడి తమిళనాడుకు వెళ్ళిపోయింది. దీంతో భర్త నరసింహులు సైతం చిన్న భార్య కోసం వారం రోజుల క్రితం తమిళనాడుకు వెళ్లాడు. వారం రోజులైనా భర్త ఇంటికి రాకపోవడంతో ఫోన్లు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురి నడుమ మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. దీంతో వారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాధితులు
మృతదేహానికి అంత్యక్రియలు
హిందూపురం టౌన్, మే 20: భువనేశ్వర్ నుండి బెంగళూరుకు వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన సభగన్‌జైన్ రైలులో మరుగుదొడ్డిలో తన బనియన్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించేందుకు రైల్వే పోలీసులు ప్రయత్నించినా కుటుంబ సభ్యులు ఎవరూ అందుబాటులోకి రాలేదు. దీంతో విషయాన్ని స్థానిక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడంతో లైఫ్‌వరల్డ్ చారిటబుల్ ట్రస్టు కన్వీనర్ ఉదయ్‌కుమార్, ముస్లీం నగారా ఛైర్మన్ ఉమర్‌ఫరూఖ్, ఎస్‌ఆర్‌ఎంయూ నాయకులు బి.శేఖర్, ధర్మప్రచార పరిషత్ నాయకులు చలపతిల ఆధ్వర్యంలో శ్రీకంఠపురం హిందూ శ్మశాన వాటికలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో బీఎస్పీ శ్రీరాములు, ఎల్‌ఐసీ కదిరప్ప, టైలర్ గంగాధర్, చిరు ఫ్యాన్స్ అమర్‌నాథ్, నిసార్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.