క్రైమ్/లీగల్

చిన్నారి బలి కేసును ఛేదించిన పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఉప్పల్, ఫిబ్రవరి 15: చిల్కానగర్‌లో సంచలనం సృష్టించిన చిన్నారి బలి కేసును పోలీసులు చేధించారు. తల లభ్యమైన ఇంటి యజమాని క్యాబ్ డ్రైవర్ కేరుకొండ రాజశేఖర్ గౌడ్ అసలు నిందితుడని పోలీసుల విచారణలో వెల్లడయింది. భార్య శ్రీలత ఆరోగ్యం, ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కేందుకే నరబలి ఇచ్చినట్టు పోలీసుల ముందు నిందితుడు రాజశేఖర్ ఒప్పుకున్నాడు. ఈ కేసు వివరాలను కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. చిల్కానగర్‌లో నివసిస్తున్న కేరుకొండ రాజశేఖర్ (40) క్యాబ్ డ్రైవర్. అతని భార్య శ్రీలత నాలుగేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతుంది. దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులు తోడయ్యాయి. ఇందు కోసం నగరంలోని పలువుర్ని కలిసినా ఫలితం దక్కలేదు. రెండేళ్ల క్రితం వరంగల్ సమ్మక్క జాతరకు వెళ్లినపుడు అక్కడ ఓ కోయ దొరను కలిశారు. నరబలి ఇస్తే సకల సమస్యలు దూరం అవుతాయని చెప్పాడు. అప్పటి నుంచి నరబలి కోసం వేచి ఉన్న వారు జనవరి 31న రాత్రి బోయగూడ ఫుట్‌పాత్‌పై తల్లి ఒడిలో నిద్రిస్తున్న చిన్నారని కిడ్నాప్ చేసి మూసీ నది వద్దకు వచ్చి కత్తితో మెడను నరికి మొండెంను మూసీ నదిలో పడేసి తలను తీసుకొని ఇంటికి పూజలు చేసి అనంతరం ఇంటిపై పడేశారు. ఉదయం ఇంటికి వచ్చిన రాజశేఖర్ అత్త బాలలక్ష్మి శిశివు తలను చూసి కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. డాగ్‌స్వ్కాడ్, క్లూస్‌టీంతో విచారణ ప్రారంభించారు. సంఘటన స్థలంలో సేకరించిన ఆధారాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపించారు. ఈ కేసులో 122 సెల్‌ఫోన్లు, 54 సెల్‌టవర్ల డేటాను అనలైజ్ చేసి మొత్తం 40 మంది సాక్షులను, 45 మంది అనుమానితులను విచారించారు. వంద సిసి కెమెరాల డేటాను పరిశీలించారు. రాజశేఖర్ ఇంట్లో రక్తం మరకలను సేకరించి తిరిగి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించడంతో కేసు కొలిక్కి వచ్చింది. పూర్తిస్థాయిలో విచారించగా నేరం తామే చేసినట్టు రాజశేఖర్ దంపతులు ఒప్పుకున్నారు. శిశువుఎవర్నది తెలిపిన వారికి బహుమతి ఇస్తామని కమిషనర్ మహేష్ భగవత్ ప్రకటించారు.

చిన్నారి బలి కేసులో పట్టుబడిన రాజశేఖర్-శ్రీలత (ఫైల్ ఫొటో)