క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో మున్సిపల్ ఆర్‌ఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాచర్ల, ఏప్రిల్ 26: ఇంటి పన్ను తగ్గించేందుకు రూ. 18 వేలు లంచం తీసుకుంటున్న మున్సిపల్ ఆర్‌ఐ ప్రసాద్‌ను ఏసిబి అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. సంఘటన వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన కాటేపల్లి వేణుగోపాల్‌కు సొసైటీకాలనీ అన్నపూర్ణేశ్వరి ఆలయం ఎదురు మూడంతస్తుల భవనం ఉంది. కింద ఇంటికి 800 ఇంటి పన్ను ఉండగా మిగిలిన రెండు భవనాలకు కొత్తగా పన్ను విధించాలని ఆర్‌ఐ ప్రసాద్‌ను కలిశారు. దీనికి ఆర్‌ఐ రూ 12600 ఇంటి పన్ను ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధించాల్సి ఉందని చెప్పారు. దీనికి వేణుగోపాల్ పన్ను అంతెందుకు ఉంటుందని, నాలుగు రెట్ల వేసినా చాలా తక్కువ ఉంటుంది కదా అని అన్నారు. దీనికి ఆర్‌ఐ రూ 25 వేల లంచం ఇస్తే పన్ను తగ్గిస్తానని చెప్పినట్లు వేణుగోపాల్ తెలిపారు. రూ 18 వేలు లంచం ఇస్తానని, పన్ను రూ 6 వేలకు వేయాలని చెప్పటంతో ఆర్‌ఐ ప్రసాద్ దానికి అంగీకరించారు. దీంతో వేణుగోపాల్ ఏసిబి అధికారులను ఆశ్రయించాడు. మున్సిపల్ కార్యాలయంలో గురువారం రాత్రి 7 గంటలకు వేణుగోపాల్ రూ 18 వేలు లంచం ఇవ్వగా ఆర్‌ఐ ప్రసాద్ తీసుకోవడంతో విజయవాడకు చెందిన ఏసిబి డిఎస్పీ దేవానంద్‌శాంతో, సిఐలు వెంకటేశ్వర్లు, ఫిరోజ్ దాడి చేసి పట్టుకున్నారు. కెమికల్ పరీక్ష నిర్వహించగా లంచం తీసుకున్నట్లు నిర్ధారణ కావటంతో ఆర్‌ఐ ప్రసాద్‌ను అరెస్ట్ చేశారు.