క్రైమ్/లీగల్

జూన్‌లో సోహ్రాబుద్దీన్ కేసు పునర్విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 25: సోహ్రాబుద్దీన్ షేక్ బూటకపుఎన్‌కౌంటర్ కేసులో సీనియర్ పోలీసులు అధికారులకు విముక్తికల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూపిటిషన్ స్వీకరించిన బాంబే హైకోర్టు జూన్‌లో పునఃవిచారణ జరపనున్నట్టు వెల్లడించింది. సోహ్రాబుద్దీన్ సోదరుడు రుబాబుద్దీన్, సీబీఐ ఈ రివ్యూపిటిషన్లు దాఖలు చేశాయి. మొత్తం మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. రుబాబుద్దీన్ షేక్ ఒకటి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్(సీబీఐ) రెండు పిటిషన్లు వేశాయి. కేసు విచారణకు రావల్సి ఉండగా ఫిబ్రవరిలో ఆకస్మాత్తుగా పలువురు హైకోర్టు న్యాయమూర్తులకు బదిలీ అయ్యాయి. బుధవారం నాడు బాంబే హైకోర్టు సింగిల్ జడ్జి నితిన్ సాంబ్రే పిటిషన్లు పరిశీలించిన తరువాత జూన్‌లో విచారణ చేపడతామని వెల్లడించారు. అయితే అత్యవసరంగా పిటిషన్లను విచారించలేమని న్యాయమూర్తి తెలిపారు. తాను కెనడా శిక్షణకు వెళ్లాల్సి ఉన్నందున పిటిషన్‌ను ఇప్పుడే విచారించాలని కేసులో విడుదలైన మాజీ ఐపీఎస్ అధికారి రాజ్‌కుమార్ పాండియన్ కోర్టును అభ్యర్థించారు. వచ్చేనెలలో కెనడాకు శిక్షణ నిమిత్తం వెళ్లాల్సి ఉందని ఆయన తెలిపారు. జస్టిస్ రేవతి మొహితే-డేరే నేతృత్వంలోని సింగిల్ బెంచ్ రోజువారీ పద్ధతిలో పిటిషన్లు విచారిస్తున్నట్టు ఫిబ్రవరిలోనే ప్రకటించింది. ఈలోపు అనేక మార్పులు చేర్పులు జరిగాయి. వీటిపై అనేక వందతులు వచ్చినా బొంబాయ హైకోర్టు రిజిస్ట్రార్ వాటిని కొట్డిపారేశారు. పాలనా సౌలభ్యం, సాధారణ చర్యల్లో భాగంగానే ఇవి జరిగాయని అప్పట్లో ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయాలన్నింటినీ రుబాబుద్దీన్ షేక్ తరఫున్యాయవాది గౌతం తివారీ న్యాయమూర్తి సాంబ్రేకు తెలిపారు. విచారణ తేదీని ప్రకటించాల్సిందిగా ఆయన అభ్యర్థించారు. ఫిబ్రవరి 9 నుంచి రోజువారీ పద్ధతిలో న్యాయమూర్తి మొహితే-డేరే రుబాబుద్దీన్ పిటిషన్ విచారించారు. ఐపీఎస్ అధికారులు డీజీ వంజారా, దినేష్ ఎంఎన్, రాజ్‌కుమార్ పాండియన్‌ను విడుదల చేయడాన్ని సోహ్రాబుద్దీన్ సోదరుడు కోర్టులో సవాల్ చేశారు. గుజరాత్ ఐపీఎస్ అధికారి ఎన్‌కే అమిన్, రాజస్థాన్ పోలీసు కానిస్టేబుల్ దల్‌పత్ సిగ్ రాథోడ్‌లను విడుదల చేయడాన్ని సీబీఐ కోర్టులో సవాల్ చేసింది. జస్టిస్ మొహిత్-డేరే ఐదు రివిజన్ పిటిషన్లలో నాలుగింటిలో కీలక వాదనలు వినడం జరిగింది. అనూహ్యంగా ఫిబ్రవరి 24 సాయంత్రం బెంచ్‌లోని మిగతా న్యాయమూర్తులతో పాటు మొహిత్ బదిలీ అయ్యారు. వంజారా, అమిన్, పాండియన్, దినేష్ తరఫున సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ వాదనలు వినిపించారు. సోహ్రాబుద్దీన్ షేక్, అతడి భార్య కౌసర్ బీ 2005 డిసెంబర్‌లో ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు. గుజరాత్, రాజస్థాన్ పోలీసు అధికారుల బృందం ఈ ఆపరేషన్‌లో పాల్గొంది. ఈ బూటకపుఎన్‌కౌంటర్ కేసులో 38 మందిపై చార్జిషీట్ దాఖలైంది. దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఎన్‌కౌంటర్ కేసులో 14 మందిని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. బీజేపీ చీఫ్ అమిత్‌షా, పలువురు ఐపీఎస్ అధికారులకు కోర్టు విముక్తి కల్పించింది.