క్రైమ్/లీగల్

కరకట్టపై మోపెడ్‌ను ఢీకొన్న కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, డిసెంబర్ 14: మండలంలోని దేవరపల్లి గ్రామం వద్ద కరకట్టపై శనివారం కారు- మోపెడ్ ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రిరాజుపాలెం శివారు పిల్లివానిలంక నుంచి దేవరపల్లి వైపుకు పిల్లి వెంకటేశ్వరరావు, పిల్లి కోటేశ్వరరావుటీవీఎస్ మోపెడ్‌పై వెళుతుండగా చల్లపల్లి నుంచి విజయవాడకు వస్తున్న కాంట్రాక్టర్ సుధాకర్ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు దేవరపల్లి వద్ద వారి మోపెడ్‌ను ఢీ కొట్టి కేఈబీ కెనాల్‌లోకి దూసుకెళ్లింది. టీవీఎస్ మోపెడ్ మాత్రం నుజ్జు నుజ్జయింది. దానిపై వస్తున్న ఇద్దరూ ఎగిరి కిందపడ్డారు. కేఈబీ కెనాల్‌లో వాటర్ ఎక్కువగా లేక పోవటంతో కారు లోని కాంట్రాక్టర్ రావుపాటి వీరవెంకట సుధాకర్, డ్రైవర్ కొల్లూరు రవి స్వల్పగాయాలతో బయట పడ్డారు. మోపెడ్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరూ తీవ్రంగా గాయపడడంతో స్థానికుల సమాచారంతో 108లో వారిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్ళారు. ఎస్‌ఐ వై చిట్టిబాబు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.