క్రైమ్/లీగల్

పౌరసత్వ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో అసదుద్దీన్ పిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మూడు ముస్లిం దేశాల నుండి వలస వచ్చిన ముస్లిమేతరులకు భారతీయ పౌరసత్వం కల్పించే సవరణ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గత రాత్రి ఆమోదముద్ర వేయగానే శనివారం దీనిని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పలు ప్రజా ప్రయోజన వాజ్యాలు దాఖలయ్యాయి. హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ పిల్ వేశారు. అలాగే కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్, తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యురాలు మహువా మోయిత్రితో పాటు పలువురు ఇతరులు శనివారం సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యాలు దాఖలు చేశారు. మూడు ముస్లిం దేశాల నుంచి వలస వచ్చిన
ముస్లిమేతరులకు
భారతీయ పౌరసత్వం కల్పిస్తూ రాజ్యాంగంలో సవరణలు చేయడం ఆర్టికల్ 14, 21కి విరుద్దమని ప్రజా ప్రయోజన వాజ్యాలు దాఖలు చేసిన వారు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ చట్టం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం కాబట్టి దీనిని కొట్టివేయాలని పిటిషన్‌దారులు సుప్రీం కోర్టును కోరారు. కేంద్ర ప్రభుత్వం 1985లో కుదుర్చుకున్న అస్సాం ఓప్పందం, పౌరసత్వ చట్టం 1955లోని 6ఏ సెక్షన్‌కు కొత్త చట్టం విరుద్దమని ఆసు (ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్) తమ పిటిషన్‌లో వాదించింది. ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులకు విరుద్ధం అని జైరాం రమేష్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం శరణు తీసుకుంటున్న పలువురిని కొత్త చట్టం వదిలి వేసింది, ఇది రాజ్యాంగానికి విరుద్దమని ఆయన తెలిపారు.

*చిత్రం... హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ